MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudeepfade9279-5658-46ce-a794-c6f5cc2560ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudeepfade9279-5658-46ce-a794-c6f5cc2560ed-415x250-IndiaHerald.jpgకన్నడ స్టార్ హీరోల్లో ఒక్కడైన కిచ్చా సుదీప్ టాలీవుడ్‌ వారికి కూడా బాగా పరిచయం వున్న హీరోనే. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమా ఆయనకు మంచి స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఈ మధ్యనే విక్రాంత్‌ రోణా సినిమాతో తెలుగులో కూడా మెప్పించాడు.తాజాగా ఆయన మరో మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. భారీ సినిమాల నిర్మాత కలైపులి ఎస్‌ థాను నిర్మిస్తున్న కిచ్చా46 సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్.తాజాగా సుదీప్‌పై కన్నడ నిర్మాత అయిన ఎమ్ ఎన్ కుమార్ పలు ఆరోపణలు చేశాడు. తన బ్యానర్‌లో సుదీప్ సినిమా చేస్తాSUDEEP{#}Kumaar;Sudeep;Rajamouli;producer;Kannada;Director;Producer;Eega;Indian;Darsakudu;Tamil;Cinemaఆ నిర్మాతని మోసం చేసిన సుదీప్?ఆ నిర్మాతని మోసం చేసిన సుదీప్?SUDEEP{#}Kumaar;Sudeep;Rajamouli;producer;Kannada;Director;Producer;Eega;Indian;Darsakudu;Tamil;CinemaTue, 04 Jul 2023 19:35:00 GMTకన్నడ స్టార్ హీరోల్లో ఒక్కడైన కిచ్చా సుదీప్ టాలీవుడ్‌ వారికి కూడా బాగా పరిచయం వున్న హీరోనే. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమా ఆయనకు మంచి స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఈ మధ్యనే విక్రాంత్‌ రోణా సినిమాతో తెలుగులో కూడా మెప్పించాడు.తాజాగా ఆయన మరో మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. భారీ సినిమాల నిర్మాత కలైపులి ఎస్‌ థాను నిర్మిస్తున్న కిచ్చా46 సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్.తాజాగా సుదీప్‌పై కన్నడ నిర్మాత అయిన ఎమ్ ఎన్ కుమార్ పలు ఆరోపణలు చేశాడు. తన బ్యానర్‌లో సుదీప్ సినిమా చేస్తానని చెప్పి రెమ్యూనరేషన్ కూడా తీసుకుని మూవీ చేయకుండా మోసం చేశాడని ఆయన తెలుపుతున్నాడు. ఆ సినిమా కోసం సుదీప్‌కు రూ. 9 కోట్ల రూపాయలు ఇచ్చానని, కానీ డేట్స్ ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడని ఆ నిర్మాత ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వద్ద ఫిర్యాదు కూడా చేశానన్నారు. సుమారు 8 ఏళ్ల క్రితమే సినిమా చేయడానికి ఇద్దరి మధ్య పరస్పరం అంగీకారం కుదిరనట్లు ఆయన తెలిపాడు. కానీ ఇప్పటి దాకా డేట్స్ కేటాయించడంలో సుదీప్‌ విఫలమయ్యారని ఆ నిర్మాత పేర్కొన్నారు.


అలాగే సినిమాకు సంబంధించిన పూర్తి రెమ్యూనరేషన్ రూ. 9 కోట్లతో పాటు.. మరో రూ. 10 లక్షలు తన వంట గది రెనోవేషన్‌ కోసం సుదీప్‌ తీసుకున్నాడని నిర్మాత చెప్పుకొచ్చాడు. ఆ సినిమా కోసం దర్శకుడు నంద కిషోర్‌కి అడ్వాన్స్ చెల్లించడంతో పాటు ఈ సినిమాకి 'ముత్తట్టి సత్యరాజు' అనే టైటిల్‌ను కూడా ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేశామన్నారు. కానీ తమ బ్యానర్‌లో సినిమాని చేయకుండా ఇప్పుడు, ఒక తమిళ నిర్మాతతో సుదీప్‌ సినిమా ప్రకటించారు.తన వద్ద డబ్బు తీసుకున్న తర్వాత ఇప్పటికే చాలా నిర్మాతలతో సుదీప్‌ నాలుగు సినిమాలు చేశాడు. కానీ తన బ్యానర్‌లో చేసేందుకు మాత్రం సుదీప్ ముందుకు రావడం లేదన్నారు. అలాగే తాను సుదీప్‌ను సంప్రదించడానికి చాలా రకాలుగా ప్రయత్నించానని, అయితే అతని నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్‌కి సమస్యను తీసుకెళ్లానని, సుదీప్ మాట్లాడితే పరిష్కరించేందుకు రెడీగా ఉన్నానని నిర్మాత ఎమ్ ఎన్ కుమార్ చెప్పారు.



RRR Telugu Movie Review Rating

తండ్రికి తగ్గ కూతురుగా దూసుకుపోతున్న సీతార?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>