PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/dastagirifb1b6612-a872-422d-9e2a-e40b8d393d60-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/dastagirifb1b6612-a872-422d-9e2a-e40b8d393d60-415x250-IndiaHerald.jpgకాబట్టి సుప్రింకోర్టే ఒక లాయర్ ను ఏర్పాటుచేయాలని కోరాడు. దస్తగిరి లేఖపై సుప్రింకోర్టు ఏమిచేస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఒకవైపు పంచాయితీలు, కిడ్నాపులు చేస్తు డబ్బులు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలు దస్తగిరిపైన పెరిగిపోతున్నాయి. ఒకపుడు జేబులో వందరూపాయలు కూడా ఉంచుకునేంత సీన్ లేని దస్తగిరి ఇపుడు బొలేరోవెహికల్, గన్ మెన్లు, విలాసవంతమైన జీవితాన్ని ఎలా గడుపుతున్నాడన్నదే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయమై కోర్టులో విచారణ జరిగింది కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.viveka dastagiri sunitha supreme court{#}monday;CBI;Letter;policeరాయలసీమ : సుప్రింకోర్టుకే ఫిట్టింగ్ పెట్టాడా ?రాయలసీమ : సుప్రింకోర్టుకే ఫిట్టింగ్ పెట్టాడా ?viveka dastagiri sunitha supreme court{#}monday;CBI;Letter;policeTue, 04 Jul 2023 05:00:00 GMT


లాయర్ ను పెట్టుకునేంత ఆర్ధికస్ధోమత తనకు లేదుకాబట్టి మీరే ఒక లాయర్ ను అరేంజ్ చేయమని దస్తగిరి చేతులు దులిపేసుకున్నాడు. వివేకానందరెడ్డిని హత్యచేసి తర్వాత అప్రూవర్ గా మారిన దస్తగిరి ప్రస్తుతం బెయిల్ మీదున్నారు. హంతకుల్లో ఒకడిగా కాకుండా ఇండియాకు మెడల్ సంపాదించిన వాడిగా దస్తగిరి బాగా హైలైట్ అవుతున్నారు. సీబీఐ సిఫారసుతో ఐదుగురు గన్ మెన్లను పెట్టుకుని పంచాయితీలు చేస్తున్నాడనే ఆరోపణలు అందరికీ తెలిసిందే.




కొందరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దస్తగిరిపై కేసులు కూడా పెట్టారు. ఇలాంటి దస్తగిరి బెయిల్ రద్దుచేయాలని వివేకాకు పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి సుప్రింకోర్టులో పిటీషన్ వేశారు. దాని ఆధారంగా సుప్రింకోర్టు అటు సీబీఐకి ఇటు దస్తగిరికి నోటీసులు జారీచేసింది. ఇదే విషయమై సోమవారం విచారణ జరగబోతోంది. తనకు నోటీసులు అందగానే వెంటనే దస్తగిరి సుప్రింకోర్టుకు ఒక లేఖ రాశాడు. అందులో ఏముందంటే సుప్రింకోర్టులో లాయర్ ను పెట్టుకునేంత స్ధోమత తనకులేదని చెప్పాడు.





కాబట్టి సుప్రింకోర్టే ఒక లాయర్ ను ఏర్పాటుచేయాలని కోరాడు. దస్తగిరి లేఖపై సుప్రింకోర్టు ఏమిచేస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఒకవైపు పంచాయితీలు, కిడ్నాపులు చేస్తు డబ్బులు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలు దస్తగిరిపైన పెరిగిపోతున్నాయి. ఒకపుడు జేబులో వందరూపాయలు కూడా ఉంచుకునేంత సీన్ లేని దస్తగిరి ఇపుడు బొలేరోవెహికల్, గన్ మెన్లు, విలాసవంతమైన జీవితాన్ని ఎలా గడుపుతున్నాడన్నదే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయమై కోర్టులో విచారణ జరిగింది కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.





ఒకవైపు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతునే మరోవైపు సుప్రింకోర్టులో లాయర్ ను పెట్టుకునే పరిస్దితి లేదని లేఖరాయటంపై ఆశ్చర్యపోతున్నారు. కావాలనే దస్తగిరి సుప్రింకోర్టుకు లేఖ రాసినట్లు ఆరోపణలు మొదలైయ్యాయి. ఇదే సమయంలో దస్తగిరికి మద్దతుగా నిలబడిన వివేకానంరెడ్డి కూతురు సునీత, సీబీఐ తాజా  ఎపిసోడ్లో ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. వివేకా హత్యకేసు విచారణలో ఇప్పటివరకు అందరు లాయర్లను సొంతంగా పెట్టుకునే తమ వాదనలు వినిపిస్తున్నారు. మొదటిసారి దస్తగిరి సుప్రింకోర్టునే లాయర్ ను అరేంజ్ చేయమని అడిగాడు. మరి సోమవారం సుప్రింకోర్టు ఏమంటుందో చూడాలి.





RRR Telugu Movie Review Rating

వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల కాబోయే సినిమాలు ఇవే..?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>