Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli-cb491f14-0dd4-402c-a8e8-325a1231c9a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli-cb491f14-0dd4-402c-a8e8-325a1231c9a2-415x250-IndiaHerald.jpgక్రికెట్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ ఇద్దరి భవిష్యత్తుపై కూడా త్వరలోనే ఒక స్పష్టత రానుంది. భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ సారథి, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి టీ20 కెరీర్‌ను ఉద్దేశించి ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌తో మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ కొత్త చీఫ్‌ సెలక్టర్‌ నియామకం తర్వాత పొట్టి ఫార్మాట్‌లో వీరిద్దరి భవితవ్యం తేలనుందనే సంకేతాలు ఇచ్చారు. దీంతో అసలు ఏం జరుగుతుందో అని అందరు ఎదురు చూస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌-2021 తర్వాత కోహ్లి పొట్టి ఫాKohli {#}VIRAT KOHLI;Hardik Pandya;రాజీనామా;ICC T20;BCCI;championship;West Indies;Application;Newsఅజిత్‌ అగార్కర్‌ వచ్చిన తర్వాతే.. ఆ కీలక ప్రకటన?అజిత్‌ అగార్కర్‌ వచ్చిన తర్వాతే.. ఆ కీలక ప్రకటన?Kohli {#}VIRAT KOHLI;Hardik Pandya;రాజీనామా;ICC T20;BCCI;championship;West Indies;Application;NewsTue, 04 Jul 2023 17:30:00 GMTక్రికెట్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ ఇద్దరి భవిష్యత్తుపై కూడా త్వరలోనే ఒక స్పష్టత రానుంది. భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ సారథి, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి టీ20 కెరీర్‌ను ఉద్దేశించి ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌తో మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ కొత్త చీఫ్‌ సెలక్టర్‌ నియామకం తర్వాత పొట్టి ఫార్మాట్‌లో వీరిద్దరి భవితవ్యం తేలనుందనే సంకేతాలు ఇచ్చారు. దీంతో అసలు ఏం జరుగుతుందో అని అందరు ఎదురు చూస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌-2021 తర్వాత కోహ్లి పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్‌గా వైదొలగగా ఆ భాద్యతను రోహిత్ తీసుకున్నాడు. ఎన్నో విజయాలు అందించాడు కానీ మొన్న జరిగిన టెస్టు ఛాంపియన్ షిప్ లో ఓడిన తరువాత అన్నే విమర్శలు కూడా ఎదుర్కున్నాడు. కోహ్లీ బ్యాటర్ గా రాణిస్తున్నాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఆసియా కప్‌-2022 సందర్భంగా టీ20లలో తొలి శతకం బాదాడు. ఆ తర్వాత కోహ్లి వెనుదిరిగి చూసుకోలేదు.

ఇప్పటికే అగార్కర్‌ చీఫ్‌ సెలక్టర్‌ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. త్వరలోనే అతడి నియామకానికి సంబంధించిన ప్రకటన కూడా రానుంది. అయితే ఆయన సెలెక్ట్ అయ్యాక టీం ఇండియాలో చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. కోహ్లి, రోహిత్‌ టీ20 కెరీర్‌ భవిష్యత్తుపై స్పష్టత కూడా రానుందని తెలుస్తోంది. బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌గా చేతన్‌ శర్మ రాజీనామా నేపథ్యంలో మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌ అతడి స్థానాన్ని భర్తీ చేయనున్నాడు.

హార్దిక్ కు ఛాన్స్: హార్దిక్ పాండ్యకు t20 కెప్టెన్ గా ఛాన్స్ రానుంది. ముఖ్యంగా టీ20 వరల్డ్‌కప్‌-2024 కు హార్దిక్ ను పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమించే అవకాశాలు కూడా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. భారత జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనకు సిద్ధమైంది. టెస్టు, వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత కోహ్లి, రోహిత్‌ స్వదేశానికి తిరిగి రానున్నారు. టీ20 సిరీస్‌లో జట్టును హార్దిక్ నడిపించనున్నాడు. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.



RRR Telugu Movie Review Rating

తండ్రికి తగ్గ కూతురుగా దూసుకుపోతున్న సీతార?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>