PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan11111ab2-031d-4628-ac28-2d82ed570481-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan11111ab2-031d-4628-ac28-2d82ed570481-415x250-IndiaHerald.jpgపవన్ మీద ఎవరైనా ఎందుకు దాడిచేస్తారు ? వైసీపీ ఎందుకు దాడిచేయిస్తుంది ? వేలాదిమంది అభిమానులు చుట్టూ ఉన్నపుడు ఎవరైనా పవన్ మీద దాడిచేయగలరా ? తనకు ప్రాణహాని ఉందని, చంపటానికి కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చారని చెప్పుకుని సింపతీ సంపాదించాలని పవన్ చూస్తున్నట్లున్నారు. ఇలాంటి మాటల వల్ల సింపతి వస్తుందా ? తన పోరాటాల వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వణికిపోతోందని, తానంటే భయపడుతోందని పదేపదే చెప్పుకుని తృప్తిపడిపోతున్నారు. janasena pawan varahi {#}Pawan Kalyan;Jagan;Narendra Modi;East Godavari;Vishakapatnam;kakinada;Reddy;Yatra;Party;YCPగోదావరి : ఈ డ్రామాలు భరించాల్సిందేనా ?గోదావరి : ఈ డ్రామాలు భరించాల్సిందేనా ?janasena pawan varahi {#}Pawan Kalyan;Jagan;Narendra Modi;East Godavari;Vishakapatnam;kakinada;Reddy;Yatra;Party;YCPTue, 04 Jul 2023 03:00:00 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెబుతున్న డైలాగులు ఫక్తు డ్రామాలో డైలాగుల మాదిరిగానే ఉంటున్నాయి. పవన్ చెబుతున్న డైలాగులకు జనాలు కనెక్టు కాకపోగా రివర్సు కొడుతున్నారు. ఇక్కడే పవన్ డైలాగులన్నీ ఉత్త డ్రామాడైలాగులని అందరికీ అర్ధమైపోతున్నాయి. నరసాపురంలో వారాహియాత్ర ప్రారంభించిన సమయంలో పవన్ మాట్లాడుతు తానుచేస్తున్న పోరాటంలో తాను బతికుంటానో లేదో అన్నారు. పవనేమన్నా దేశం సరిహద్దుల్లో శతృవులతో పోరాడుతున్నారా ? ప్రాణాలు పోవటానికి ?





ఎన్నికల ప్రచారాన్ని, ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయటాన్ని ప్రాణాలు పోయేంత స్ధాయి పోరాటమని పవన్ ఎందుకు అనుకుంటున్నారు ? తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడులో యాత్ర మొదలైన దగ్గర నుండి రాజోలులో ముగిసేవరకు తనను చంపేందుకు కిరాయిహంతకులకు వైసీపీ వాళ్ళు సుపారి ఇచ్చారని పదేపదే చెప్పారు. తర్వాత దిండి రిసార్ట్స్ రోడ్డులో నలుగురు రాడ్లు పెట్టుకుని తనపైన దాడిచేయటానికి రెడీగా ఉన్నారని చెప్పారు.  ఇపుడేమో తన బతికుంటానో లేదో అన్నారు. అసలు ఇలాంటి పనికిమాలిన మాటలు ఎందుకు చెబుతున్నారో అర్ధంకావటంలేదు.





పవన్ మీద ఎవరైనా ఎందుకు దాడిచేస్తారు ? వైసీపీ ఎందుకు దాడిచేయిస్తుంది ? వేలాదిమంది అభిమానులు చుట్టూ ఉన్నపుడు ఎవరైనా పవన్ మీద దాడిచేయగలరా ? తనకు ప్రాణహాని ఉందని, చంపటానికి కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చారని చెప్పుకుని సింపతీ సంపాదించాలని పవన్ చూస్తున్నట్లున్నారు. ఇలాంటి మాటల వల్ల సింపతి వస్తుందా ? తన పోరాటాల వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వణికిపోతోందని, తానంటే భయపడుతోందని పదేపదే చెప్పుకుని తృప్తిపడిపోతున్నారు.





నిజానికి పార్టీ పెట్టినదగ్గర నుండి పవన్ చేసిన పోరాటం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ప్రత్యేకహోదా విషయంలో నరేంద్రమోడీ ప్రభుత్వంపై పోరాటం చేయాలని 2016లో కాకినాడ సభలో పిలుపిచ్చారు. తర్వాత ఆ పోరాటం ఏమైందో తెలీదు. చాలా కాలం తర్వాత విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం అన్నారు. ఏమి ఉద్యమంచేశారో పవన్ కే తెలియాలి. బహిరంగసభల్లో ఏదోకటి నోటికొచ్చింది మాట్లాడేయటం, పూనకం వచ్చినవాళ్ళు ఊగిపోయినట్లు ఊగిపోవటం తప్ప పవన్ చేసిన పోరాటమేమీ లేదు. ఇంతోటి పోరాటానికి జగన్ ప్రభుత్వం వణికిపోతున్నట్లు బిల్డప్ ఒకటి. ఎన్నికల వరకు ఇలాంటి డ్రామాలు భరించాల్సిందేనేమో.




RRR Telugu Movie Review Rating

మోక్షజ్ఞ కోసం ఆ హీరోయిన్ ను సెట్ చేస్తున్న బాలయ్య బాబు....!!

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>