MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood257b10fb-6de0-4519-9a8d-53dbfe138049-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood257b10fb-6de0-4519-9a8d-53dbfe138049-415x250-IndiaHerald.jpgతమిళ అగ్ర హీరో ధనుష్ కి తమిళ నిర్మాత మండలి(TFPC) భారీ షాక్ ఇవ్వబోతోందా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. కోలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ధనుష్ రీసెంట్ గా తెలుగులో స్ట్రైట్ మూవీ చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. కోలీవుడ్ తర్వాత ధనుష్ కి ఆ రేంజ్ లో పాపులారిటీ ఉంది టాలీవుడ్ లోనే అని చెప్పాలి. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న ధనుష్ కి ఇప్పుడు ఓ సమస్య వచ్చి పడింది. తమిళ నిర్మాతల మండలి తాజాగా ధనుష్ కి రెడ్ కార్డు ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఒకవేళtollywood{#}dhanush;Comedian;sree;Kollywood;shankar;Tamil;Success;India;Hero;Tollywood;Red;News;Cinemaధనుష్ ని తమిళ ఇండ్రస్ట్రీ బ్యాన్ చేయబోతోందా..?ధనుష్ ని తమిళ ఇండ్రస్ట్రీ బ్యాన్ చేయబోతోందా..?tollywood{#}dhanush;Comedian;sree;Kollywood;shankar;Tamil;Success;India;Hero;Tollywood;Red;News;CinemaMon, 03 Jul 2023 14:00:00 GMTతమిళ అగ్ర హీరో ధనుష్ కి తమిళ నిర్మాత మండలి(TFPC) భారీ షాక్ ఇవ్వబోతోందా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. కోలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ధనుష్ రీసెంట్ గా తెలుగులో స్ట్రైట్ మూవీ చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. కోలీవుడ్ తర్వాత ధనుష్ కి ఆ రేంజ్ లో పాపులారిటీ ఉంది టాలీవుడ్ లోనే అని చెప్పాలి. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న ధనుష్ కి ఇప్పుడు ఓ సమస్య వచ్చి పడింది. తమిళ నిర్మాతల మండలి తాజాగా ధనుష్ కి రెడ్ కార్డు ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఒకవేళ ఇదే కనుక జరిగితే ధనుష్ తోపాటు అతని సినిమాలపై కూడా నిషేధం విధించడం గ్యారెంటీ అని చెబుతున్నారు.

ఇంతకీ అసలేమైందంటే.. సుమారు 20 సంవత్సరాలుగా తమిళ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న ధనుష్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. అయితే ధనుష్ గతంలో శ్రీ తెండ్రల్ ఫిలిమ్స్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. దానికి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ఇది జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటివరకు సినిమా మాత్రం చేయట్లేదు. దీంతో సదరు నిర్మాణ సంస్థ తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించింది. ధనుష్ సినిమా చేయకుండా ఆలస్యం చేస్తున్నందుకుగాను అతనికి రెడ్ కార్డు ఇవ్వాలని తమిళ నిర్మాతల మండలి అనుకుంటున్నట్లు కోలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

ధనుష్ లాగానే తమిళ  ఇండస్ట్రీలో మరికొంతమంది నటీనటులకు కూడా ఈ రెడ్ కార్డ్ ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ నిర్మాణ సంస్థల దగ్గర అడ్వాన్సులు తీసుకొని సినిమా చేయడం లేదనే కారణంతో ఇప్పటికే తమిళ హీరోలు అయినా శింబు, విశాల్, ఎస్ జె సూర్య, అథర్వ అలాగే కమెడియన్ యోగ బాబుకి రెడ్ కార్డ్ ఇవ్వనున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ రెడ్ కార్డు కనుక జారీ చేస్తే ఈ నటినటులతో ఏ దర్శక నిర్మాతలు సినిమా చేయడం కుదరదు. అంటే ఒక రకంగా వీళ్ళపై నిషేధం విధించినట్లే అవుతుంది. గతంలో కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తో ఇలాంటి వివాదం కారణంగానే కమెడియన్ వడివేలు కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ధనుష్ కి కూడా ఇదే పరిస్థితి రాబోతుందని కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ ఈ వార్త కనుక నిజమైతే ధనుష్ ఫ్యాన్స్ కి ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పక తప్పదు.



RRR Telugu Movie Review Rating

ఆ స్టార్ హీరోయిన్ ని ప్రేమించిన రాజమౌళి.. కానీ..!?

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>