PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-khammam-rahulgandhi-ponguleti-revanth452b1828-3dcf-499b-8622-e3f1c05e9d07-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-khammam-rahulgandhi-ponguleti-revanth452b1828-3dcf-499b-8622-e3f1c05e9d07-415x250-IndiaHerald.jpgనిజానికి బహిరంగ సభ సక్సెస్ లో ఎక్కువ క్రెడిట్ పొంగులేటికే ఇవ్వాలి. రాహూల్ మాట్లాడింది సుమారు అర్ధగంటే అయినా జనాల్లో మంచి స్పందన కనబడింది. ఖమ్మంసభ కాంగ్రెస్ భవిష్యత్తు మీటింగులకు మంచి జోష్ నింపేదే అనటంలో సందేహంలేదు. బీఆర్ఎస్, బీజేపీలను టార్గెట్ చేస్తు రాహుల్ మాట్లాడింది తక్కువే. రెండుపార్టీలు ఒకటే అని రాహూల్ ఆరోపించారు. కాంగ్రెస్ కు ఓట్లేయమన్నారు, రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీయే అని చెప్పారు. telangana khammam rahulgandhi ponguleti revanth{#}Jagga Reddy;revanth;MP;Congress;Josh;Success;Party;rahul;Rahul Sipligunjతెలంగాణా : కాంగ్రెస్ సభ సూపర్ సక్సెస్తెలంగాణా : కాంగ్రెస్ సభ సూపర్ సక్సెస్telangana khammam rahulgandhi ponguleti revanth{#}Jagga Reddy;revanth;MP;Congress;Josh;Success;Party;rahul;Rahul SipligunjMon, 03 Jul 2023 07:00:00 GMT


ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ బహిరంగసభ సూపర్ సక్సెస్ అయ్యిందనే అనుకోవాలి. వైరా రోడ్డులోని 150 ఎకరాల స్ధలంలో నిర్వహించిన సభకు జనాలు బాగానే వచ్చారు. జనాలు రావటం ఒకఎత్తు, స్పందన మరోఎత్తు. ఈ సభలో జనాల హాజరు, స్పందన రెండూ బాగానే ఉన్నాయి. ఎందుకంటే రెండు కారణాలు. మొదటిదేమో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్(పాదయాత్ర) ముగింపు సభ కావటం. ఇక రెండోదేమో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాహూల్ గాంధి సమక్షంలో కండువా కప్పుకోవటం.





నిజానికి బహిరంగ సభ సక్సెస్ లో ఎక్కువ క్రెడిట్ పొంగులేటికే ఇవ్వాలి. రాహూల్ మాట్లాడింది సుమారు అర్ధగంటే అయినా జనాల్లో మంచి స్పందన కనబడింది. ఖమ్మంసభ కాంగ్రెస్ భవిష్యత్తు మీటింగులకు మంచి జోష్ నింపేదే అనటంలో సందేహంలేదు. బీఆర్ఎస్, బీజేపీలను టార్గెట్ చేస్తు రాహుల్ మాట్లాడింది తక్కువే. రెండుపార్టీలు ఒకటే అని రాహూల్ ఆరోపించారు. కాంగ్రెస్ కు ఓట్లేయమన్నారు, రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీయే అని చెప్పారు.





నిజానికి కాంగ్రెస్ పార్టీ అంటే నేతల్లోకన్నా క్యాడర్ తో పాటు జనాల్లోనే ఎక్కువ అభిమానముంది. అధికారంలో ఉన్నపుడు అన్నీ పదవులను అనుభవించి కూర్చున్న కొమ్మనే నరికేసింది పెద్ద నేతలే కానీ క్యాడర్ కాదు. పార్టీ మీద అభిమానంతో జెండాలు మోసినవాళ్ళు, బ్యానర్లు కట్టినవాళ్ళలో ఎక్కువమంది ఇంకా పార్టీలోనే ఉన్నారు.





ఇలాంటి వాళ్ళకు పార్టీ అధికారంలోకి రావాలని బలంగా ఉంది. అయితే పార్టీని అధికారంలోకి తీసుకురావాలని నేతల్లో ఎంతమందికి ఉందన్నదే అసలైన ప్రశ్న. ఎందుకంటే చాలామంది సీనియర్లలో చాలామందితో పడదు. బలమైన వర్గం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఉత్తమకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు రేవంత్ ను పదేపదే టార్గెట్ చేస్తు మాట్లాడుతున్న విషయం అందరు చూస్తున్నదే. ఇలాంటి నేతల వైఖరి చూస్తున్నపుడే వీళ్ళ చిత్తశుద్దిపై అనుమానాలు పెరిగిపోతుంటాయి.




RRR Telugu Movie Review Rating

ఎరుపు రంగు డ్రెస్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రచ్చ చేస్తున్న కియారా..!

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>