HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthe878cd41-9742-40ef-9501-fdd535415fdd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthe878cd41-9742-40ef-9501-fdd535415fdd-415x250-IndiaHerald.jpgదేవకాంచన చెట్టు గురించి ఎప్పుడైన విన్నారా? ఈ చెట్టు పూలు చాలా అందంగా ఆకట్టుకునే రంగుల్లో ఉంటాయి.అలాగే ఈ చెట్టు ఆకులు చూడడానికి గుండె ఆకారంలో ఉంటాయి. ఈ దేవకాంచన పూలతో పరమ శివున్ని కూడా పూజిస్తారు. ఈ దేవకాంచన చెట్టు పూలు, ఆకులు చూడటానికి అందంగా ఉండడంతో పాటు వీటిలో చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో చాలా ఔషధాల తయారీలో ఈ మొక్కను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.దేవకాంచన చెట్టు వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఇంకా దాని గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దేవకాంచన చెట్టు, ఆకులు, పూలు మనకుHEALTH{#}Coriander;Jaggery;Coriander Seeds;Manam;Heartదేవకాంచన: ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?దేవకాంచన: ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?HEALTH{#}Coriander;Jaggery;Coriander Seeds;Manam;HeartMon, 03 Jul 2023 20:05:03 GMTదేవకాంచన చెట్టు గురించి ఎప్పుడైన విన్నారా? ఈ చెట్టు పూలు  చాలా అందంగా ఆకట్టుకునే రంగుల్లో ఉంటాయి.అలాగే ఈ చెట్టు ఆకులు చూడడానికి గుండె ఆకారంలో ఉంటాయి. ఈ దేవకాంచన పూలతో పరమ శివున్ని కూడా పూజిస్తారు. ఈ దేవకాంచన చెట్టు పూలు, ఆకులు చూడటానికి అందంగా ఉండడంతో పాటు వీటిలో చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో చాలా ఔషధాల తయారీలో ఈ మొక్కను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.దేవకాంచన చెట్టు వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఇంకా దాని గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


దేవకాంచన చెట్టు, ఆకులు, పూలు మనకు చాలా విధాలుగా ఉపయోగపడతాయి. వీటిని ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను మన దరి చేరకుండా చూసుకోవచ్చు.నోటి పూత, నోటి దుర్వాసన వంటి సమస్యలతో ఎక్కువగా బాధపడే వారు ఈ చెట్టు బెరడును నీటిలో వేసి మరిగించాలి. ఆ తరువాత ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా అయ్యే దాకా ఉంచాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల నోటి పూత ఈజీగా తగ్గుతుంది. దాంతో పాటు నోటి దుర్వాసన సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది. ఇంకా నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంకా అలాగే దేవకాంచన చెట్టు బెరడును ఉపయోగించడం వల్ల మూత్రాశయ సమస్యలను కూడా చాలా ఈజీగా దూరం చేసుకోవచ్చు. 


అలాగే మూత్రంలో మంట, ఇన్పెక్షన్స్ తో పాటు ఇతర మూత్రాశయ సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఒక గ్లాస్ నీటిలో దేవకాంచన చెట్టు బెరడు, ధనియాలు వేసి సగం అయ్యే దాకా మరిగించాలి. ఆ తరువాత ఈ నీటిని వడకట్టి పటిక బెల్లం వేసి కలిపి తీసుకోవాలి.ఇలా తీసుకోవడం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు ఈజీగా తగ్గుతాయి.ఇంకా అలాగే ఈ చెట్టు బెరడును గ్లాస్ నీటిలో వేసి సగం అయ్యే దాకా మరిగించాలి. ఈ నీటిని వడకట్టి చల్లారిన తరువాత పటిక బెల్లం కలిపి తీసుకోవడం వల్ల హార్మోన్ల సమస్యలు ఈజీగా తగ్గుతాయి. అలాగే థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. ఇంకా అదే విధంగా దేవకాంచన చెట్టు బెరడు కషాయాన్ని రోజుకు రెండు పూటలా 10 నుండి 20 గ్రాముల మోతాదులో తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఇంకా అదే విధంగా దేవకాంచన పూలను సేకరించి ఎండబెట్టాలి. ఈ పూలకు సమానంగా పటిక బెల్లాన్ని కలిపి పొడిగా చేసుకుని స్టోర్ చేసుకోవాలి.అలాగే ఈ పొడిని అర టీ స్పూన్ మోతాదులో రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల మొలల సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది.



RRR Telugu Movie Review Rating

శ్రీ విష్ణు: టాలీవుడ్ కి మరో వెంకటేష్?

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>