MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan8ab833f3-397f-48a6-9f74-e8dc3f775438-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan8ab833f3-397f-48a6-9f74-e8dc3f775438-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోస్ అన్నాక అభిమానులు ఉండటం కామన్. కానీ ఆ అభిమానం అనేది బాధ్యతగా ఉండాలి. నలుగురు మెచ్చుకునే విధంగా తమ హీరోకి మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలి. ఈ మధ్య హిట్ సినిమా రీరిలీజ్ ట్రెండ్ బాగా పాపులర్ అయింది. సూపర్ స్టార్ మహేష్ సినిమాల ద్వారా స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ ఇప్పుడు మిగతా హీరోలు కూడా ఫాలో అవుతున్నారు. అయితే ఇందులో భాగంగా అభిమానులు అత్యుత్సాహనికి లోనయ్యి చెత్త పనులు చేస్తున్నారు.థియేటర్ లని బాధ్యత లేకుండా ధ్వంసం చేస్తున్నారు. ఇలా చేస్తే ఫ్యూచర్ లో సింగిల్ స్క్రీన్ థియేటర్ లు రన్ చేయడం కష్టమPAWAN KALYAN{#}Rajani kanth;kalyan;Saturday;Vijayawada;cinema theater;Tholi Prema;Pawan Kalyan;police;Friday;Cinemaచెత్తగా తయారైన పవన్ ఫ్యాన్స్.. ఇలాగైతే కష్టమే?చెత్తగా తయారైన పవన్ ఫ్యాన్స్.. ఇలాగైతే కష్టమే?PAWAN KALYAN{#}Rajani kanth;kalyan;Saturday;Vijayawada;cinema theater;Tholi Prema;Pawan Kalyan;police;Friday;CinemaSun, 02 Jul 2023 17:46:00 GMTస్టార్ హీరోస్ అన్నాక అభిమానులు ఉండటం కామన్. కానీ ఆ అభిమానం అనేది బాధ్యతగా ఉండాలి. నలుగురు మెచ్చుకునే విధంగా తమ హీరోకి మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలి. ఈ మధ్య హిట్ సినిమా రీరిలీజ్ ట్రెండ్ బాగా పాపులర్ అయింది. సూపర్ స్టార్ మహేష్ సినిమాల ద్వారా స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ ఇప్పుడు మిగతా హీరోలు కూడా ఫాలో అవుతున్నారు. అయితే ఇందులో భాగంగా అభిమానులు అత్యుత్సాహనికి లోనయ్యి చెత్త పనులు చేస్తున్నారు.థియేటర్ లని బాధ్యత లేకుండా ధ్వంసం చేస్తున్నారు. ఇలా చేస్తే ఫ్యూచర్ లో సింగిల్ స్క్రీన్ థియేటర్ లు రన్ చేయడం కష్టమే అన్నట్లు తెలుస్తుంది. తాజాగా తొలిప్రేమ సినిమా ప్రదర్శించిన థియేటర్‌ను ధ్వంసం చేసిన పవన్‌ కళ్యాణ్‌ అభిమానులపై విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ నటించిన తొలిప్రేమ సినిమా శుక్రవారం నగరంలోని గాంధీనగర్‌లో ఉన్న కపర్థి థియేటర్‌లో ప్రదర్శించారు.సెకండ్‌ షో రాత్రి 10.30 గంటలకు స్టార్ట్ కాగా, 10.45కి కొంతమంది అభిమానులు స్క్రీన్‌ వద్దకు చేరి డ్యాన్సులు చేశారు. స్క్రీన్‌ను చింపేందుకు ప్రయత్నించగా వారిని థియేటర్‌ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో పవన్‌ కళ్యాణ్ అభిమానులు  సిబ్బందిపై దాడి చేశారు. అంతేగాక స్క్రీన్‌ను కూడా చించివేశారు. అలాగే కుర్చీలు ఇంకా తలుపులు విరగ్గొట్టారు.థియేటర్స్ అద్దాలను పగులగొట్టారు. సినిమాకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు థియేటర్‌లో విధ్వంసం సృష్టించి మొత్తం రూ.4 లక్షలు ఆస్తి నష్టం కలిగించారని థియేటర్‌ మేనేజర్‌ బి.మోహనరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు శనివారం నాడు కేసు నమోదు చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విచారణకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు.చూడాలి ఈ దెబ్బతో అయిన ఫ్యూచర్ లో మన స్టార్ హీరోల అభిమానులు ఇలాంటి పనులు చెయ్యడం ఆపుతారో లేదో..



RRR Telugu Movie Review Rating

బాలయ్య తో చచ్చినా సినిమా చెయ్యను అంటున్న స్టార్ హీరోయిన్..!?

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?

అనుమానాస్పదం: కేసీఆర్‌, మోదీ మధ్య ఏం జరుగుతోంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>