EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/lokeshd1344b6d-5597-470a-876b-a75ea900844b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/lokeshd1344b6d-5597-470a-876b-a75ea900844b-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. లోకేశ్ పాదయాత్ర ఒక వైపు, పవన్ వారాహి యాత్ర మరో వైపు కొనసాగుతోంది. వీటికి ధీటుగా జగన్ తన ప్రభుత్వ పథకాలను ప్రవేశపెడుతూ ప్రజల వద్దకు వెళుతున్నారు. ఇలా ఒక్కో పార్టీ నాయకుడు ఒక్కోలా ప్రజల్లోకి వెళ్లి ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారం మొదలెట్టారు. జగన్ ను ఎలాగైన ఓడించాలని పవన్ కల్యాణ్ పట్టుదలగా ఉన్నారు. ప్రతి సభలోనూ సీఎం జగన్ ను విమర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. మొన్నటి వరకు లోకేశ్ పాదయాత్రకు అపూర్వ స్పందన వచ్చింది. మొదట్లో యువగళం పాదయాత్రకు జనాల నుంచిLOKESH{#}apoorva;Pawan Kalyan;Nara Lokesh;Janasena;Nellore;CM;politics;Yatra;Party;Jagan;Yuva;mediaలోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?LOKESH{#}apoorva;Pawan Kalyan;Nara Lokesh;Janasena;Nellore;CM;politics;Yatra;Party;Jagan;Yuva;mediaSun, 02 Jul 2023 00:00:00 GMTఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. లోకేశ్ పాదయాత్ర ఒక వైపు, పవన్ వారాహి యాత్ర మరో వైపు కొనసాగుతోంది. వీటికి ధీటుగా జగన్ తన ప్రభుత్వ పథకాలను ప్రవేశపెడుతూ ప్రజల వద్దకు వెళుతున్నారు. ఇలా ఒక్కో పార్టీ నాయకుడు ఒక్కోలా ప్రజల్లోకి వెళ్లి ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారం మొదలెట్టారు. జగన్ ను ఎలాగైన ఓడించాలని పవన్ కల్యాణ్ పట్టుదలగా ఉన్నారు.


ప్రతి సభలోనూ సీఎం జగన్ ను విమర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. మొన్నటి వరకు లోకేశ్ పాదయాత్రకు అపూర్వ స్పందన వచ్చింది. మొదట్లో యువగళం పాదయాత్రకు జనాల నుంచి పెద్దగా స్పందన రాలేదు. కానీ నెల్లూరు వచ్చే సరికి ఆయన పాదయాత్రకు ఒక్కసారిగా ఊపు వచ్చింది. ప్రజల్లోకి వెళుతున్న కొద్దీ ఆయనలో మాట్లాడే తీరు మారింది. సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆంధ్రకు భవిష్యత్ యువ నాయకుడని విపరీతంగా ఎల్లో మీడియా ప్రచారం చేసేస్తోంది.


అయితే గతంలో పవన్ కల్యాణ్ సభలకు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చిన ఇదే మీడియా ఏ మాత్రం కవరేజీ వేయలేదు. ఎందుకంటే అప్పుడు టీడీపీకి అనుకూలంగా మాట్లాడకపోవడం..  ఇప్పుడు అదే టీడీపీకి వెనక నుంచి మద్దతు ఇస్తున్నట్లు ఉండటంతో పవన్ స్పీచ్ లను కానీ ఆయన సభలను కానీ బాగానే కవర్ చేస్తున్నారు. ఇలా పవన్ కల్యాన్ జనసేన సభల్ని ప్రచారం చేయడం వెనక ప్లాన్ ఉన్నా..  చేయొద్దని మనసులో ఉన్నా..  తప్పక చేయాల్సిన పరిస్థితి.


పవన్ కల్యాణ్ కు జనాల నుంచి ఎక్కువగా మద్దతు వస్తోంది. సమావేశాలకు కార్యకర్తలు ఎక్కువగా వస్తున్నారు. దీని వల్ల ప్రచారంలో పవన్ కూడా స్పీచ్ దంచి కొడుతున్నారు. సమస్యల గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇన్ని రోజులు యువగళం పాదయాత్ర పై పెట్టిన ఫోకస్ ఇప్పుడు జనసేన పవన్ కల్యాణ్ పై పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి లోకేశ్ పాదయాత్రనా పవన్ వారాహి యాత్రనా అన్నట్లు కొనసాగుతోంది.



RRR Telugu Movie Review Rating

చిన్న గౌనులో పరువాలు విందు చేస్తున్న శ్రీయ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>