PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jdff0d6233-fd71-4c01-bcdd-b7e35a1e6a6e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jdff0d6233-fd71-4c01-bcdd-b7e35a1e6a6e-415x250-IndiaHerald.jpgకడపలో పుట్టి కర్నూలులో చదువుకున్న జేడీ విశాఖపట్నంలో ఎందుకు పోటీచేశారంటు ప్రశ్నించారు. అంత ప్రేముంటే పుట్టి, చదువుకున్న కడప, కర్నూలులోనే పోటీచేయచ్చుకదాని నిలదీశారు. ఇక్కడ ఆశ్చర్యమేమిటంటే బొలిశెట్టి ఇలా ఆరోపణలు చేస్తునే లక్ష్మీనారాయణకు విశాఖ ఎంపీగా టికెట్ ఇప్పించింది తానే అని చెప్పుకోవటం. కడప, కర్నూలు ఎక్కడైనా పోటీచేయచ్చు కదా, విశాఖలో ఏమిపని అని డిబేట్లో అడిగిన బొలిశెట్టి టికెట్ కు సిఫారసు చేసి ఇప్పించేటపుడు ఈ విషయం ఎందుకు అడగలేదు ? jd janasena pawan{#}Vishakapatnam;Kanna Lakshminarayana;Daggubati Venkateswara Rao;Haribabu Kambhampati;Kurnool;Venkatesh;television;Party;MPఅమరావతి : జనసేనలో ఇంత మంటుందా ?అమరావతి : జనసేనలో ఇంత మంటుందా ?jd janasena pawan{#}Vishakapatnam;Kanna Lakshminarayana;Daggubati Venkateswara Rao;Haribabu Kambhampati;Kurnool;Venkatesh;television;Party;MPSun, 02 Jul 2023 05:00:00 GMT


జేడీ లక్ష్మీనారాయణగా బాగా పాపులరైన మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ మీద జనసేలో ఎంత అక్కుసు పేరుకుపోయిందో తాజాగా బయటపడింది. ఒక చానల్ డిబేట్లో పార్టీ అధికార ప్రతినిధి బొలిశెట్టి సత్యానారాయణ నోటికొచ్చింది మాట్లాడేశారు. లక్ష్మీనారాయణ గొప్ప మేథావి కాదు పైగా అందరు అనుకునేంత మంచోడూ కాదనేశారు.  లక్ష్మీనారాయాణ మీద తన ఆరోపణలకు బొలిశెట్టి ఎలాంటి ఆధారాలను చూపకుండానే నోటికొచ్చింది మాట్లాడేశారు. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్త అసలు లక్ష్మీనారాయణకు విశాఖపట్నంతో ఏమిపనంటు నిలదీశారు.





కడపలో పుట్టి కర్నూలులో చదువుకున్న జేడీ విశాఖపట్నంలో ఎందుకు పోటీచేశారంటు  ప్రశ్నించారు. అంత ప్రేముంటే పుట్టి, చదువుకున్న కడప, కర్నూలులోనే పోటీచేయచ్చుకదాని నిలదీశారు. ఇక్కడ ఆశ్చర్యమేమిటంటే బొలిశెట్టి ఇలా ఆరోపణలు చేస్తునే లక్ష్మీనారాయణకు విశాఖ ఎంపీగా టికెట్ ఇప్పించింది తానే అని చెప్పుకోవటం. కడప, కర్నూలు ఎక్కడైనా పోటీచేయచ్చు కదా, విశాఖలో ఏమిపని అని డిబేట్లో అడిగిన బొలిశెట్టి టికెట్ కు సిఫారసు చేసి ఇప్పించేటపుడు ఈ విషయం ఎందుకు అడగలేదు ?





విశాఖ ఎంపీగా పోటీచేయాలని లక్ష్మీనారాయణ అనుకున్నపుడే విశాఖతో ఏమిపని అని అడిగుంటే బాగుండేది కదా. అప్పుడేమో తానే టికెట్ ఇప్పించి ఇపుడు విశాఖతో ఏమిపని అని అడగటమే విచిత్రంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే విశాఖకు ఎంపీలుగా పనిచేసిన వారిలో కొందరు నాన్ లోకల్సు.  సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యానారాయణతో కలిపి మాజీ ఎంపీలు ఎంవీవీఎస్ మూర్తి, నేదురమల్లి జనార్ధనరెడ్డి, తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి, దగ్గుబాటి పురంధేశ్వరి, కంభంపాటి హరిబాబులు విశాఖలో పుట్టి పెరగలేదు. ఎక్కడో పుట్టి తర్వాత కాలంలో విశాఖకు వచ్చి స్ధిరపడి రాజకీయాల్లో ఎంటరయ్యారంతే.





స్ధానికుడైన బొలిశెట్టికి ఈ విషయం తెలియకుండానే ఉంటుందా ? తెలిసే కదా అప్పట్లో లక్ష్మీనారాయణకు ఎంపీ టికెట్ ఇప్పించింది. తర్వాత ఏదో కారణాలతో జేడీ పార్టీని వదిలేశారు. అప్పటినుండి బొలిశెట్టికి ఈ మాజీ ఐపీఎస్ అధికారి మీద బాగా అక్కసు పెరిగిపోయినట్లుంది. నాన్ లోకలంటే పర్వాలేదు కానీ మేథావి కాదు మంచోడు కాదని ఆరోపణలు గుప్పించేసి టీవీ డిబేట్లో తన అక్కసంతా తీర్చేసుకున్నారు.




RRR Telugu Movie Review Rating

రెండు రోజుల్లో "సామజవరగమన" మూవీకి వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>