PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ntr279ec0df-42de-4814-ab02-c0af80577d47-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ntr279ec0df-42de-4814-ab02-c0af80577d47-415x250-IndiaHerald.jpgఇటీవల జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అయినటువంటి శ్యామ్ ఎన్టీఆర్ సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ కూడా తన తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా శ్యామ్ ఎన్టీఆర్ మృతి పై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. శ్యామ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా శ్యామ్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విచారణ జరిపించాలని కోరుతున్నారు. నిజానికి శ్యామ్ సూసైడ్ వీడియో నోట్ లో చెప్పింది ఒకటి, ఆ తర్వాత శ్యామ్ కుటుంబ సభ్యులు చెప్పేది మరొకటి అని అంటునNTR{#}NTR;Padmini;Jr NTR;shyam;Sucide;Parents;Annayya;Telugu Desam Partyజూ. ఎన్టీఆర్‌ అభిమాని హత్యతో టీడీపీ రాజకీయమా?జూ. ఎన్టీఆర్‌ అభిమాని హత్యతో టీడీపీ రాజకీయమా?NTR{#}NTR;Padmini;Jr NTR;shyam;Sucide;Parents;Annayya;Telugu Desam PartySun, 02 Jul 2023 10:04:20 GMTఇటీవల జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అయినటువంటి శ్యామ్ ఎన్టీఆర్ సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ కూడా తన తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా శ్యామ్ ఎన్టీఆర్ మృతి పై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. శ్యామ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా శ్యామ్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విచారణ జరిపించాలని కోరుతున్నారు.


నిజానికి  శ్యామ్ సూసైడ్ వీడియో నోట్ లో చెప్పింది ఒకటి, ఆ తర్వాత శ్యామ్ కుటుంబ సభ్యులు చెప్పేది మరొకటి అని అంటున్నారు కొంతమంది. శ్యామ్ తను చనిపోయేటప్పుడు చివరిగా తీసుకున్న వీడియోలో తాను సరిగ్గా చదవనని కాబట్టి తనకు ఉద్యోగాలు రావని, కాబట్టి తాను తన ఫ్యామిలీకి బరువు అన్నట్లుగా చెప్పాడు. అయితే శ్యామ్ చెల్లెలు పద్మిని తన అన్నయ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెప్తుంది.


తమకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండగా నిలబడ్డారని ఆమె చెప్తుంది. తన అన్నయ్య శ్యామ్ తనకు ఇష్టమైన హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కూడా చేశాడని చెప్తుంది. శ్యామ్ తల్లిదండ్రులు తమ బిడ్డ మృతిపై తమకు ఎవరి మీదా అనుమానం  లేదని, అంతేకాకుండా శ్యామ్ మృత దేహాన్ని చూసినప్పుడు అందరూ అది హత్యే అంటున్నారని కూడా వాళ్ళు అంటున్నారు. విచారణ చేసి త్వరగా నిజాలు ఏంటో నిరూపించాలని శ్యామ్  తల్లిదండ్రులు కోరుతున్నారు.


అయితే శ్యామ్ వీడియోను, ఇంకా ఆ శ్యామ్ కుటుంబ సభ్యుల మాటలను ఈ రెండిటిని చూసిన వాళ్ళకి అర్థం అవ్వని విషయం ఒకటే. అదేంటంటే శ్యామ్ తన సూసైడ్ వీడియో నోట్లో తాను తన కుటుంబానికి భారం అని చనిపోతున్నానని చెప్పడం జరిగింది. అయితే శ్యామ్ కుటుంబ సభ్యులు మాత్రం శ్యామ్ సూసైడ్ చేసుకోలేదని అంటున్నారు. అయితే  శ్యామ్ కుటుంబ సభ్యుల ఈ విధంగా మాట్లాడటం వెనక తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రోత్సాహం ఉందని అంటున్నారు.



RRR Telugu Movie Review Rating

స్టార్ హీరోలకు పోటీగా యంగ్ హీరో.. రేసులో హనుమాన్..!

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?

అనుమానాస్పదం: కేసీఆర్‌, మోదీ మధ్య ఏం జరుగుతోంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>