MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/star-hero-aku-poteega-young-hero-race-lo-hanuman93314dae-ad03-411a-be19-0500239e1e7b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/star-hero-aku-poteega-young-hero-race-lo-hanuman93314dae-ad03-411a-be19-0500239e1e7b-415x250-IndiaHerald.jpgచైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంద్రతోపాటు పలు సినిమాలలో నటించి మెప్పించిన హీరో తేజ సజ్జ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సమంత నటించిన ఓ బేబీ సినిమా ద్వారా కీలకపాత్రలో నటించి మళ్లీ తెలుగుతెరకు పరిచయమైన ఈయన.. ఆ తర్వాత జాంబిరెడ్డి సినిమాతో హీరోగా మారి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత అదృష్టం అనే సినిమా చేసి ఇప్పుడు హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇండియన్ సూపర్ హీరో హనుమంతుడి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పHANUMAN{#}prasanth varma;Makar Sakranti;Guntur;Oh Baby;mahesh babu;Prabhas;News;Indian;Hero;Ravi;ravi teja;Samantha;Posters;Cinemaస్టార్ హీరోలకు పోటీగా యంగ్ హీరో.. రేసులో హనుమాన్..!స్టార్ హీరోలకు పోటీగా యంగ్ హీరో.. రేసులో హనుమాన్..!HANUMAN{#}prasanth varma;Makar Sakranti;Guntur;Oh Baby;mahesh babu;Prabhas;News;Indian;Hero;Ravi;ravi teja;Samantha;Posters;CinemaSun, 02 Jul 2023 14:00:00 GMTచైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంద్రతోపాటు పలు సినిమాలలో నటించి మెప్పించిన హీరో తేజ సజ్జ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సమంత నటించిన ఓ బేబీ సినిమా ద్వారా కీలకపాత్రలో నటించి మళ్లీ తెలుగుతెరకు పరిచయమైన ఈయన.. ఆ తర్వాత జాంబిరెడ్డి సినిమాతో హీరోగా మారి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత అదృష్టం అనే సినిమా చేసి ఇప్పుడు హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇండియన్ సూపర్ హీరో హనుమంతుడి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు సినిమాపై భారీ అంచనాలను కూడా పెంచేసాయి.

ఇకపోతే ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో జాంబిరెడ్డి సినిమా వచ్చి మంచి హిట్ అందుకుంది. అందుకే మరొకసారి వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా పక్కా విజయం సాధిస్తుందని అభిమానుల సైతం గట్టిగా నమ్ముతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాను స్టార్ హీరోలతో పోటీపడేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, ప్రభాస్ నటించిన ప్రాజెక్టు K, రవితేజ నటించిన ఈగల్ సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ పడుతూ ఉండగా.. వీరికి పోటీగా యంగ్ హీరో తేజ తన హనుమాన్ మూవీతో రంగంలోకి దిగబోతున్నారు. మరి ఈ రేస్ లో స్టార్ హీరోలను తట్టుకొని హనుమాన్ ఎలాంటి విజయం సాధిస్తుంది అనేది ఇప్పుడు ఉత్కంఠ గా మారింది. ఏదిఏమైనా ఈసారి సంక్రాంతికి పోటాపోటీగా ఉండబోతోంది అని.. స్టార్ హీరోలను మించి యంగ్ హీరో విజయం సాధిస్తే ఇక ఈయన క్రేజ్ మరింత పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని సమాచారం.



RRR Telugu Movie Review Rating

స్టార్ హీరోలకు పోటీగా యంగ్ హీరో.. రేసులో హనుమాన్..!

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?

అనుమానాస్పదం: కేసీఆర్‌, మోదీ మధ్య ఏం జరుగుతోంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>