MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bholashankar82fd8465-4265-4b72-8852-4bd31edaf781-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bholashankar82fd8465-4265-4b72-8852-4bd31edaf781-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో అతి భయంకరమైన ఫ్లాప్ సినిమాల లిస్టులో ‘ఆచార్య’ మూవీ కూడ ఉండి తీరుతుంది అన్న విషయాన్ని అతడి అభిమానులు కూడ అంగీకరిస్తారు. చిరంజీవికి ఆ షాక్ నుండి తెరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఈ సంవత్సరం సంక్రాంతి రేస్ కు విడుదలైన ‘వాల్తేర్ వీరయ్య’ ఘన విజయంతో తిరిగి చిరంజీవి సక్సస్ బాట పట్టాడు.ఇప్పుడు ఆగష్టులో ‘భోళాశంకర్’ రాబోతోంది. అయితే ఈమూవీ పై పెద్దగా అంచనాలు లేకపోవడం ఒక విధంగా చిరంజీవికి మళ్ళీ షాక్ ఇచ్చే విషయం. దీనికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. చాలా సంవత్సరాల క్రితం వచBHOLASHANKAR{#}Chiranjeevi;meher ramesh;Makar Sakranti;Telangana;Tamil;Remake;Coronavirus;Cinema;Teluguభోళాశంకర్ ను వెంటాడుతున్న ఆచార్య భయాలు !భోళాశంకర్ ను వెంటాడుతున్న ఆచార్య భయాలు !BHOLASHANKAR{#}Chiranjeevi;meher ramesh;Makar Sakranti;Telangana;Tamil;Remake;Coronavirus;Cinema;TeluguSat, 01 Jul 2023 08:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో అతి భయంకరమైన ఫ్లాప్ సినిమాల లిస్టులో ‘ఆచార్య’ మూవీ కూడ ఉండి తీరుతుంది అన్న విషయాన్ని అతడి అభిమానులు కూడ అంగీకరిస్తారు. చిరంజీవికి ఆ షాక్ నుండి తెరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఈ సంవత్సరం సంక్రాంతి రేస్ కు విడుదలైన ‘వాల్తేర్ వీరయ్య’ ఘన విజయంతో తిరిగి చిరంజీవి సక్సస్ బాట పట్టాడు.


ఇప్పుడు ఆగష్టులో ‘భోళాశంకర్’ రాబోతోంది. అయితే ఈమూవీ పై పెద్దగా అంచనాలు లేకపోవడం ఒక విధంగా చిరంజీవికి మళ్ళీ షాక్ ఇచ్చే విషయం. దీనికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. చాలా సంవత్సరాల క్రితం వచ్చిన తమిళ సినిమాకు ఈమూవీ రీమేక్ కావడం ఒక కారణం అయితే ఈమూవీ తెలుగు డబ్బింగ్ ను ఇప్పటికే అనేకమంది చూసిన సందర్భం ఉంది.




దీనికితోడు గతంలో ‘శక్తి’ ‘షాడో’ లాంటి భయంకరమైన ఫ్లాప్ సినిమాలు తీసిన మెహర్ రమేష్ ఈమూవీకి దర్శకత్వం వహించడం మరొక కారణంగా కనిపిస్తోంది. మెహర్ రమేష్ కు చిరంజీవికి ఉన్న సాన్నిహిత్యం రీత్యా అతడికి ఈ అవకాశం వచ్చింది అన్న ప్రచారం కూడ ఉంది. కరోనా సమయంలో చిరంజీవి చేపట్టిన సేవా కార్యక్రమాలను మెహర్ రమేష్ దగ్గర ఉండి అన్నీ పర్యవేక్షించడంతో చిరంజీవి మెహర్ రమేష్ కు ఈ అవకాశం ఇచ్చాడు అన్న మాటలు కూడ ఉన్నాయి.


లేటెస్ట్ గా విడుదలైన ఈసినిమా టీజర్ ను చూసిన తరువాత చాలామంది ఈసినిమా పై ఆశలు వదులుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమూవీ టీజర్ ఇలా ఉంటే రాబోయే సినిమా ఇక ఎలా ఉంటుందో అంటూ మెగా అభిమానులు కూడ భయపడుతున్నట్లు టాక్. దీనికితోడు ఈమూవీలో చిరంజీవి లుక్ బాడీ లాంగ్వేజ్ ఏమాత్రం బాగా లేకపోవడంతో పాటు చిరంజీవి నోటివెంట వచ్చిన తెలంగాణ యాస డైలాగ్స్ అంతగా బాగలేవు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో చిరంజీవి అభిమానులకు మెహర్ రమేష్ ‘ఆచార్య’ షాక్ ను గుర్తు చేయబోతున్నాడ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..



RRR Telugu Movie Review Rating

నిఖిల్ "స్పై" మూవీకి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>