PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/eetala-48966de5-37a9-4601-999d-844c7ec948c2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/eetala-48966de5-37a9-4601-999d-844c7ec948c2-415x250-IndiaHerald.jpgఅప్పటినుండి ఈటల భద్రత అన్నది తెలంగాణాలో పెద్ద ఇష్యూఅయిపోయింది. ఇదే విషయమై కేంద్ర హోంశాఖ కూడా దృష్టిపెట్టింది. ఈటల భద్రతను సమీక్షించి వై క్యాటగిరి భద్రత కల్పించబోతున్నట్లు జరిగిన ప్రచారం అందరికీ తెలిసిందే. ఇంతలోనే మంత్రి కేటీయార్ జోక్యం చేసుకుని ఈటల భద్రతకు ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే మేడ్చల్ డీసీపీ సంజీవ్ రావు ఎంఎల్ఏ ఇంటికి వెళ్ళి వివరాలు సేకరించారు. ముందుజాగ్రత్తగానే ఈటలకు భద్రత పెంచాలని ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చారట. eetala kcr telangana bjp{#}Sanjeev;Mudiraj;Medchal;kaushik;Eatala Rajendar;Wife;central government;Minister;Government;MLA;Yevaruహైదరాబాద్ : ఈటలకు భ్రదత పెరిగిందా ?హైదరాబాద్ : ఈటలకు భ్రదత పెరిగిందా ?eetala kcr telangana bjp{#}Sanjeev;Mudiraj;Medchal;kaushik;Eatala Rajendar;Wife;central government;Minister;Government;MLA;YevaruSat, 01 Jul 2023 07:00:00 GMT


బీజేపీ ఎంఎల్ఏ ఈటల రాజేందర్ కు రాష్ట్రప్రభుత్వం భద్రత పెంచినట్లుంది. తనకు ప్రాణహాని ఉందని నాలుగురోజుల క్రితం ఈటల ప్రకటించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎంఎల్సీ పాడి కౌశిక్ రెడ్డి తనను హత్యచేసేందుకు సుపారి ఇవ్వటానికి రెడీ అయినట్లు ఈటల ఆరోపించారు. తనను హత్యచేసేందుకు రు. 20 కోట్లయినా ఖర్చుచేస్తానని పాడి తమ మద్దతుదారులతో చెప్పినట్లుగా తనకు తెలిసిందని ఈటల ఆరోపించటం సంచలనంగా మారింది. ఇదే నేపధ్యంలోనే ఈటల భార్య జమున కూడా ఎంఎల్సీపై చాలా ఆరోపణలు చేశారు.





అప్పటినుండి ఈటల భద్రత అన్నది తెలంగాణాలో పెద్ద ఇష్యూఅయిపోయింది. ఇదే విషయమై కేంద్ర హోంశాఖ కూడా దృష్టిపెట్టింది. ఈటల భద్రతను సమీక్షించి వై క్యాటగిరి భద్రత కల్పించబోతున్నట్లు జరిగిన ప్రచారం అందరికీ తెలిసిందే. ఇంతలోనే మంత్రి కేటీయార్ జోక్యం చేసుకుని ఈటల భద్రతకు ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే మేడ్చల్ డీసీపీ సంజీవ్ రావు ఎంఎల్ఏ ఇంటికి వెళ్ళి వివరాలు సేకరించారు. ముందుజాగ్రత్తగానే ఈటలకు భద్రత పెంచాలని ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చారట.





ఆ రిపోర్టు ప్రకారం ప్రభుత్వం ఈటలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఎస్కార్ట్, పైలెట్ సౌకర్యం కల్పించబోతున్నదట. గన్ మెన్ల సంఖ్యను కూడా పెంచబోతున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. ఎన్నికల కాలం అందులోను ముదిరాజ్ సామాజికవర్గంలో ఈటల రాజేందర్ ప్రముఖుడనే చెప్పాలి. అందుకనే ఇపుడు గనుక ఎవరి వైపునుండైనా ఈటలపై దాడి జరిగితే అది ప్రభుత్వానికే చుట్టుకుంటుంది.





అందుకనే కేంద్రహోంశాఖ చొరవ తీసుకుని భద్రతను పెంచేలోపుగానే రాష్ట్రప్రభుత్వం స్పందించింది. నిజానికి ఈటల హత్యకు పాడి కౌశిక ప్లాన్ చేస్తున్నట్లుగానీ సుపారి ఇవ్వబోతున్నట్లు గానీ స్పష్టమైన ఆధారాలు లేవు. అయినా సరే ఈటల ఆరోపణలతో ప్రభుత్వం అలర్టయ్యింది. అందుకనే పాడి మీడియాతో మాట్లాడుతు ఈటల దంపతుల నుండి తనకు ప్రాణహాని ఉందని ఎదురు ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. మొత్తానికి హత్యకు కుట్ర, సుపారి విషయం ఎలాగున్నా ఈటలకు భద్రత అయితే పెరిగిందన్నది వాస్తవం.




RRR Telugu Movie Review Rating

నిఖిల్ "స్పై" మూవీకి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>