PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-chandrababu-karakatta-cida2c6e1eb-bf04-4a03-b12b-8e053b18ba4b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-chandrababu-karakatta-cida2c6e1eb-bf04-4a03-b12b-8e053b18ba4b-415x250-IndiaHerald.jpgప్రభుత్వం తరపున లింగమనేనికి చంద్రబాబు చేసిన సాయానికి ప్రతిఫలంగా కరకట్టమీద తన అక్రమనివాసాన్ని చంద్రబాబుకు ఇచ్చేసినట్లుగా సీఐడీ ఆరోపించింది. అందుకనే భవనాన్ని జప్తుచేయాలని నోటీసులిచ్చింది. అలాగే జప్తకు అనుమతించాలని ఏసీబీ కోర్టులో అనుమతి కోరింది. దీనికిపై విచారణలు జరిగిన తర్వాత కోర్టు జప్తుకు అనుమతిచ్చింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు అధికారంలోకి రాగానే కరకట్టమీదున్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు నోటీసులిచ్చారు. jagan chandrababu karakatta cid{#}Amaravati;Anti-Corruption Bureau;Lingamaneni Ramesh;CBN;courtఅమరావతి : చంద్రబాబుకు ఊహించని షాక్..ఖాళీ చేయాల్సిందేఅమరావతి : చంద్రబాబుకు ఊహించని షాక్..ఖాళీ చేయాల్సిందేjagan chandrababu karakatta cid{#}Amaravati;Anti-Corruption Bureau;Lingamaneni Ramesh;CBN;courtSat, 01 Jul 2023 03:00:00 GMT


చంద్రబాబునాయుడుకు ఏసీబీ కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. కరకట్ట మీద చంద్రబాబు ఉంటున్న అక్రమనివాసాన్ని జప్తుచేసేందుకు సీఐడీకి అనుమతిచ్చింది. అమరావతి రాజధాని భూసమీకరణలో భాగంగా చంద్రబాబుకు అక్రమభవనం యజమాని లింగమనేని రమేష్ కు మధ్య క్విబ్ ప్రో కో జరిగిందని సీఐడీ ఆరోపించింది. రైతులనుండి భూములు సమీకరించిన చంద్రబాబు ప్రభుత్వం లింగమనేని ఎస్టేట్ ధరలు పెరిగేట్లుగా వ్యవహరించినట్లు ఆరోపించింది. లింగమనేని భూముల దగ్గరకు వచ్చి సమీకరణ ఆగిపోయేట్లుగా నిర్ణయించారన్నది సీఐడీ ఆరోపణ.





ప్రభుత్వం తరపున లింగమనేనికి చంద్రబాబు చేసిన సాయానికి ప్రతిఫలంగా కరకట్టమీద తన అక్రమనివాసాన్ని చంద్రబాబుకు ఇచ్చేసినట్లుగా సీఐడీ ఆరోపించింది. అందుకనే భవనాన్ని జప్తుచేయాలని నోటీసులిచ్చింది. అలాగే జప్తకు అనుమతించాలని ఏసీబీ కోర్టులో అనుమతి కోరింది. దీనికిపై విచారణలు జరిగిన తర్వాత కోర్టు జప్తుకు అనుమతిచ్చింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు అధికారంలోకి రాగానే కరకట్టమీదున్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు నోటీసులిచ్చారు.





అలా నోటీసులు అందుకున్న భవనాల్లో లింగమనేని అక్రమనిర్మాణం కూడా ఉంది. తర్వాత తెరవెనుక ఏమైందో ఏమో కొద్దిరోజులకు చంద్రబాబు సదరు అక్రమనిర్మాణంలోకి మారిపోయారు. అంటే అక్రమనిర్మాణం కాస్త సక్రమినిర్మాణమైపోయింది. దీనిపై అప్పట్లో పెద్ద దుమారం రేగింది. ఇదే విషయమై అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతు లింగమనేని తన భవనాన్ని ప్రభుత్వానికి రాసిచ్చేశారు కాబట్టే తాను అందులో ఉంటున్నట్లు ప్రకటించారు.





మీడియాతో మాట్లాడుతు లింగమనేని కూడా తన భవనాన్ని ప్రభుత్వానికి రాసిచ్చేసినట్లు నిర్ధారించారు. అయితే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మాట్లాడుతు తానుంటున్న భవనం ప్రైవేటు భవనమని మాట మార్చారు. ఇక్కడే తెలిసిపోతోంది చంద్రబాబు అబద్ధంచెప్పారని. సీఐడీ ఆరోపిస్తున్నట్లు క్విడ్ ప్రోకో జరిగిందనే ఆనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఏసీబీ కోర్టు ఆదేశాల ప్రకారమే సీఐడీ కరకట్ట భవనాన్ని జప్తు చేయబోతోంది. అంటే భవనమే అక్రమనిర్మాణమంటే చంద్రబాబు ఉంటున్నది కూడా అక్రమమే. కాబట్టి అక్రమ భవనాన్ని చంద్రబాబు వెంటనే ఖాళీ చేయాల్సిందే అని అర్ధమైపోతోంది.




RRR Telugu Movie Review Rating

నిఖిల్ "స్పై" మూవీకి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>