PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/raghuraju-ycp-america-tdpa089d984-7e74-42ce-961c-0c4f3726121a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/raghuraju-ycp-america-tdpa089d984-7e74-42ce-961c-0c4f3726121a-415x250-IndiaHerald.jpgవచ్చేఎన్నికల్లో అయితే టీడీపీ లేకపోతే జనసేన తరపున పోటీచేయటానికి రాజు రెడీ అవుతున్నారు. మళ్ళీ నరసాపురం నుండి ఎంపీగా పోటీచేసి గెలిస్తేనే రఘురాజుకు భవిష్యత్తుంటుంది. లేకపోతే అంతే సంగతులు. జగన్ తో సరిపోక దూరమైన ఎంపీ అలా కామ్ గా ఉండుంటే సరిపోయేది. కానీ ఎంపీ అలాగ ఉండకుండా ప్రభుత్వాన్ని కెలకటం మొదలుపెట్టారు. అయితే ఎవరు పట్టించుకోలేదన్న కోపంతో తర్వాత డైరెక్టుగా జగన్ పైనే ఆరోపణలు మొదలుపెట్టారు.raghuraju ycp America tdp{#}TDP;narasapuram;Narsapur;Texas;American Samoa;Janasena;Jagan;MP;king;Party;Yevaruఢిల్లీ : రఘురాజు కోరిక తీర్చుకున్నారా ?ఢిల్లీ : రఘురాజు కోరిక తీర్చుకున్నారా ?raghuraju ycp America tdp{#}TDP;narasapuram;Narsapur;Texas;American Samoa;Janasena;Jagan;MP;king;Party;YevaruSat, 01 Jul 2023 05:00:00 GMT

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పచ్చకండువా కప్పేసుకున్నట్లేనా ? తాజా పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) నిర్వహిస్తున్న కార్యక్రమాలకు అతిధిగా రఘురాజు హాజరయ్యారు. టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ లో నాటా సమావేశాలు జరుగుతున్నాయి. నిర్వాహకులు అనేకమంది ప్రముఖులను ప్రతిఏడాది ఆహ్వానిస్తుంటారు. అలాగే ఈ ఏడాది నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీని కూడా ఆహ్వానించారు. ఈ సమావేశాల్లో పాల్గొన్న రఘురాజు మెడలో పచ్చకండువా వేసుకుని తిరగటం అందరి దృష్టిని ఆకర్షించింది.





విషయం ఏమిటంటే మెడలో పచ్చకండువా వేసుకున్నంత మాత్రాన రాజు టీడీపీలో చేరిపోయినట్లు కాదు. అయితే రఘురాజు డల్లాస్ కు చేరుకున్న దగ్గర నుండి ఆయనకు స్వాగతం పలికి కూడా ఉంటున్నవారిలో అత్యధికులు తెలుగుదేశంపార్టీ సానుభూతిపరులేనట. నిజానికి రఘురాజకు ఆహ్వానం అందటం కూడా వాళ్ళ చలవే అని ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డితో వ్యక్తిగతంగా చెడినదగ్గర నుండి రెబల్ ఎంపీ వైసీపీకి దూరమైపోయిన విషయం తెలిసిందే. అప్పటినుండి టీడీపీ కండువా కప్పుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నారు. 





వచ్చేఎన్నికల్లో అయితే టీడీపీ లేకపోతే జనసేన తరపున పోటీచేయటానికి రాజు రెడీ అవుతున్నారు. మళ్ళీ నరసాపురం నుండి ఎంపీగా పోటీచేసి గెలిస్తేనే రఘురాజుకు భవిష్యత్తుంటుంది. లేకపోతే అంతే సంగతులు. జగన్ తో సరిపోక దూరమైన ఎంపీ అలా కామ్ గా ఉండుంటే సరిపోయేది. కానీ ఎంపీ అలాగ ఉండకుండా ప్రభుత్వాన్ని కెలకటం మొదలుపెట్టారు. అయితే ఎవరు పట్టించుకోలేదన్న కోపంతో తర్వాత డైరెక్టుగా జగన్ పైనే ఆరోపణలు మొదలుపెట్టారు.





చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా మద్దతుతో జగన్ కు వ్యతిరేకంగా ఎంపీ రెచ్చిపోవటంతో సీఐడీ కేసులు నమోదుచేసి విచారించిన విషయం తెలిసిందే. ఆ విచారణ సందర్భంగానే తనను తీవ్రంగా కొట్టారని, హత్యాయత్నం కూడా జరిగిందని కోర్టులో కేసువేశారు. లోక్ సభలో ఫిర్యాదుచేశారు. అప్పటినుండి రాజు ఢిల్లీలో కూర్చునే జగన్ పై నోటికొచ్చినట్లు ప్రతిరోజు మాట్లాడుతున్నారు. ఈ నేపధ్యంలోనే ఎంపీగా ఇపుడు తనకున్న ప్రివిలేజెస్ కంటిన్యు అవ్వాలంటే మళ్ళీ ఎంపీగా గెలవాల్సిందే. లేకపోతే ఏదో పద్దతిలో ఏదో పార్టీ నుండి రాజ్యసభకైనా నామినేట్ కావాలి. ఏదీ కాకపోతే మాత్రం రఘురాజు పరిస్ధితి ఇబ్బందే.




RRR Telugu Movie Review Rating

నిఖిల్ "స్పై" మూవీకి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>