DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/kcr786f212e-475e-42c5-8de2-d70f2839f3c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/kcr786f212e-475e-42c5-8de2-d70f2839f3c4-415x250-IndiaHerald.jpgప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కుటుంబ పాలనపై విరుచుకుపడ్డారు. దేశంలో కుటుంబ పాలనను అరికట్టాలని అన్నారు. ప్రజా పాలన కావాలంటే బీజేపీకి ఓటు వేయండి. కుటుంబ పాలన కావాలంటే కేసీఆర్ బీఆర్ఎస్ కు ఓటేయండని అన్నారు. అయితే కాంగ్రెస్ కు బీటీం, బీఆర్ఎస్ అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్న సమయంలో దీన్ని పొగొట్టేందుకు బీఆర్ఎస్ నాయకులు మరో ఎత్తుగడ వేస్తున్నారు. మొన్నటి వరకు ఈటల రాజేందర్ పై హత్యకు సుపారీ ఇచ్చారని అది కౌశిక్ రెడ్డి పనేనని ఈటల సతీమణి జమున ఆరోపించారు. దీంతో తెలంగాణKCR{#}KCR;jamuna;kaushik;Bharatiya Janata Party;Telangana Rashtra Samithi TRS;Eatala Rajendar;Madhya Pradesh - Bhopal;Narendra Modi;Rahul Gandhi;Minister;Congress;Prime Minister;Government;CMఅనుమానాస్పదం: కేసీఆర్‌, మోదీ మధ్య ఏం జరుగుతోంది?అనుమానాస్పదం: కేసీఆర్‌, మోదీ మధ్య ఏం జరుగుతోంది?KCR{#}KCR;jamuna;kaushik;Bharatiya Janata Party;Telangana Rashtra Samithi TRS;Eatala Rajendar;Madhya Pradesh - Bhopal;Narendra Modi;Rahul Gandhi;Minister;Congress;Prime Minister;Government;CMSat, 01 Jul 2023 23:00:00 GMTప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కుటుంబ పాలనపై విరుచుకుపడ్డారు. దేశంలో కుటుంబ పాలనను అరికట్టాలని అన్నారు. ప్రజా  పాలన కావాలంటే బీజేపీకి ఓటు వేయండి. కుటుంబ పాలన కావాలంటే కేసీఆర్ బీఆర్ఎస్ కు ఓటేయండని అన్నారు. అయితే కాంగ్రెస్ కు బీటీం, బీఆర్ఎస్ అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్న సమయంలో దీన్ని పొగొట్టేందుకు బీఆర్ఎస్ నాయకులు మరో ఎత్తుగడ వేస్తున్నారు.


మొన్నటి వరకు ఈటల రాజేందర్ పై హత్యకు సుపారీ ఇచ్చారని అది కౌశిక్ రెడ్డి పనేనని ఈటల సతీమణి జమున ఆరోపించారు. దీంతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. వెంటనే కేంద్రం వై కేటగిరి భద్రత ఈటలకు కల్పిస్తామని చెప్పడం, మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈటలకు ప్రాణ హాని ఉంటే తప్పకుండా భద్రత కల్పిస్తామని అనడం రాజకీయ ఎత్తుగడలో భాగమేనని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా బీజేపీ నాయకులకు కూడా బీఆర్ఎస్ భద్రత కల్పిస్తోందని ప్రచారం చేసుకోవచ్చు.


ఇది ఓట్ల సమయంలో వాడుకోవచ్చు. అలాగే కేంద్రంలో ప్రధాని మోదీ చేసిన విమర్శలపై ఎక్కువగా బీఆర్ఎస్ నాయకులు స్పందించలేదు. దీనికి కూడా తెర వెనక ఏదో బలమైన కారణం ఉందని ప్రచారం జరుగుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య బంధం వల్లే సీఎం కేసీఆర్ పేరు మోదీ పలకాడని అంటున్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఆ పార్టీకి ఇంకా ఓటింగ్ శాతం పెరగలేదు.


ఎక్కడా ఇంకా పోటీ చేసిన దాఖలాలు లేవు. అయినా బీఆర్ఎస్ ను ప్రధాని మోదీ ఎక్కువ చేసి చూపడం వెనక స్ట్రాటజీ ఉందని అర్థమవుతుంది. దీని వల్ల కాంగ్రెస్ ను తక్కువ చేసి చూపొచ్చు. అదే విధంగా దేశంలో పరూఖ్ అబ్దుల్లా, కేసీఆర్, స్టాలిన్, రాహుల్ గాంధీ లాంటి వారితో కుటుంబ పాలన తప్ప మరే ప్రయోజనం ఉండదని చెప్పకనే చెప్పారు.



RRR Telugu Movie Review Rating

చిన్న గౌనులో పరువాలు విందు చేస్తున్న శ్రీయ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>