BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautyc5de56ae-5f36-46ab-91ce-3c718deb83f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautyc5de56ae-5f36-46ab-91ce-3c718deb83f3-415x250-IndiaHerald.jpgజుట్టు సమస్యలు ఈ రోజుల్లో చాలా ఎక్కువ అయిపోతున్నాయి. ముఖ్యంగా రసాయనాలతో తయారు చేసిన షాంపులు వాడటం వల్ల మీ జుట్టు పరిస్థితి మరింత క్షీణిస్తుంది.అయితే మామిడి ఆకులను ఉపయోగించి జుట్టు సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చు. ఈ మామిడి ఆకుల్లో విటమిన్‌-ఎ, సి, బి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఇంకా జుట్టుకు చాలా మేలు చేస్తాయి. మీరు జుట్టు పెరుగుదలకు సహాయపడే ఈ ఆకుల నుండి హెయిర్ మాస్క్‌లను ఈజీగా తయారు చేసుకోవచ్చు.ఈ మామిడి ఆకుల హెయిర్ మాస్క్‌ను ఎలా తయారు చేయాలో ఇంకా ప్రయోజనాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.మBEAUTY{#}oil;Indian gooseberry;Ee Rojullo;Manamజుట్టు సమస్యలకి చక్కటి సొల్యూషన్ ఇదే?జుట్టు సమస్యలకి చక్కటి సొల్యూషన్ ఇదే?BEAUTY{#}oil;Indian gooseberry;Ee Rojullo;ManamFri, 30 Jun 2023 16:11:04 GMTజుట్టు సమస్యలకి చక్కటి సొల్యూషన్ ఇదే ?

జుట్టు సమస్యలు ఈ రోజుల్లో చాలా ఎక్కువ అయిపోతున్నాయి. ముఖ్యంగా రసాయనాలతో తయారు చేసిన షాంపులు వాడటం వల్ల మీ జుట్టు పరిస్థితి మరింత క్షీణిస్తుంది.అయితే మామిడి ఆకులను ఉపయోగించి జుట్టు సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చు. ఈ మామిడి ఆకుల్లో విటమిన్‌-ఎ, సి, బి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఇంకా జుట్టుకు చాలా మేలు చేస్తాయి. మీరు జుట్టు పెరుగుదలకు సహాయపడే ఈ ఆకుల నుండి హెయిర్ మాస్క్‌లను ఈజీగా తయారు చేసుకోవచ్చు.ఈ మామిడి ఆకుల హెయిర్ మాస్క్‌ను ఎలా తయారు చేయాలో ఇంకా ప్రయోజనాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.మామిడి ఆకులతో హెయిర్ మాస్క్ ని తయారు చేసి అప్లై చేయడం వల్ల జుట్టుకు ఖచ్చితంగా మంచి నిగారింపు రావడంతో పాటు జుట్టు చాలా దృఢంగా మారుతుంది.

ముందుగా మామిడి ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడగాలి. తరువాత వాటిని పేస్ట్‌లా చేసి, అందులో పెరుగు, ఉసిరి పొడి, హెన్నా పౌడర్ ఇంకా కొబ్బరి నూనె కలపాలి.ఇప్పుడు దీన్ని జుట్టుకు బాగా పట్టించి 20-30 నిమిషాల తర్వాత నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి.జుట్టుకు మామిడి ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.ఎందుకంటే ఈ మామిడి ఆకుల్లో విటమిన్-ఎ, విటమిన్-సి తగినంత పరిమాణంలో ఉంటాయి. మన జుట్టు పెరుగుదలకు సహాయపడే ముఖ్యమైన అంశాలు ఇవి. ఇవన్నీ కూడా మన జుట్టు మూలాలను బాగా బలోపేతం చేస్తాయి.ఇంకా ఈ మామిడి ఆకుల్లోని పోషకాలు జుట్టు రాలడాన్ని నియంత్రిస్తాయి.మామిడి ఆకుల పేస్ట్‌ని తలకు అప్లై చేయడం వల్ల జుట్టు చాలా స్పీడ్ గా పెరుగుతుంది.ఇంకా అంతే కాదు స్కాల్ప్‌లో బ్లడ్ సర్క్యులేషన్‌ను బాగా మెరుగుపరుస్తుంది.ఇది సహజంగా జుట్టును నల్లగా మార్చడంలో ఎంతగానో సహాయపడుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. జుట్టుని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుకోండి.



RRR Telugu Movie Review Rating

రామ్ చరణ్ కూతురికి సర్ప్రైజింగ్ గిఫ్ట్ పంపిన శర్వానంద్..!?

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?

మోడీ అమెరికా టూర్‌లో అతి గొప్ప విజయం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>