TVChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/media860a6381-64d4-45ab-b242-c812048cb8ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/media860a6381-64d4-45ab-b242-c812048cb8ab-415x250-IndiaHerald.jpgపాత్రికేయ రంగంలోకి చాలా మంది సమాజానికి ఏదో సేవ చేయాలని వచ్చేవారు. ఎంతో పాషన్ ఉండేది. మీడియాలో రాణించాలి ప్రజలకు ఏ రకంగానైనా సేవలు అందించాలని తాపత్రయపడేవారు. మారుమూల గ్రామాల్లో ఉండే సమస్యల్ని తీర్చేందుకు తమ వంతు కృషి చేయాలని భావించే వారు. మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన చెత్త నుంచి అవినీతి వరకు అన్నింటిని పత్రికల్లో వచ్చే విధంగా చేయడం వల్ల ఆ సమస్య పరిష్కారం అయ్యేది. దీంతో పాత్రికేయ రంగంలో కొన్నింటినైనా సాధించి ఆత్మ సంతృప్తి పొందేవారు. కానీ కాలం మారింది. అన్ని మీడియా యాజమాన్యాలు ఏదో రాజకీయ పార్టీకMEDIA{#}Government;mandalam;Service;Sakshi;television;media;Telugu;Newsఇదేం.. ఎల్లో జర్నలిజం బాబాయిలూ?ఇదేం.. ఎల్లో జర్నలిజం బాబాయిలూ?MEDIA{#}Government;mandalam;Service;Sakshi;television;media;Telugu;NewsFri, 30 Jun 2023 09:00:00 GMTపాత్రికేయ రంగంలోకి చాలా మంది సమాజానికి ఏదో సేవ చేయాలని వచ్చేవారు. ఎంతో పాషన్ ఉండేది. మీడియాలో రాణించాలి ప్రజలకు ఏ రకంగానైనా సేవలు అందించాలని తాపత్రయపడేవారు. మారుమూల గ్రామాల్లో ఉండే సమస్యల్ని తీర్చేందుకు తమ వంతు కృషి చేయాలని భావించే వారు. మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన చెత్త నుంచి అవినీతి వరకు అన్నింటిని పత్రికల్లో వచ్చే విధంగా చేయడం వల్ల ఆ సమస్య పరిష్కారం అయ్యేది. దీంతో పాత్రికేయ రంగంలో కొన్నింటినైనా సాధించి ఆత్మ సంతృప్తి పొందేవారు.


కానీ కాలం మారింది. అన్ని మీడియా యాజమాన్యాలు ఏదో రాజకీయ పార్టీకి తొత్తులుగా మారి విలేకరులతో తమ పార్టీలకు అనుకూలంగా వార్తలు రాయించుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు పత్రిక రంగంలో కొన్ని పత్రికలు టీడీపీకి అనుకూలంగా వార్తలు రాయడం, సాక్షి దినపత్రిక వైసీపీకి అనుకూలంగా పని చేయడం అనేది ప్రజలతో పాటు జగమెరిగిన సత్యం.


ఈ రెండు పత్రికల్లో వార్తలు వస్తే అది కచ్చితంగా ఒకరికి అనుకూలంగా మరొకరికి వ్యతిరేకంగా ఉండటం సహజం. ఇలా ఎవరికి వారు ఇష్టరీతిన వార్తలు రాస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. ఏదీ నిజమో ఏదీ అబద్దమో తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అనేక మీడియా సంస్థలు, టీవీ చానళ్లు కూడా వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా వార్తలు రాయిస్తూ వారి రాజకీయ భవిష్యత్తును డ్యామెజ్ చేస్తున్నాయి.


కాపు రాంచంద్రరెడ్డి ఆయన నియోజకవర్గంలోని బొమ్మిన మండలం గౌసురు గ్రామంలో మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. రెండు ఎల్లో పత్రికల్లో ఆయన ముఖంపైనే తలుపులు వేశారని అబద్ధపు వార్తలు రాశారని అన్నారు. వంద గడపలు ఇళ్లు ఉన్న చోట కేవలం 11 ఇళ్లు తలుపులు వేసి ఉన్నాయన్నారు. వారు పత్తి ఏరడానికి చేనులోకి వెళ్లాలన్నారు. జర్నలిజం చేసే వారు బ్రోకర్ పనులు మానుకోవాలని విలేకరులపై మండి పడ్డారు.



RRR Telugu Movie Review Rating

బాలికపై 68 ఏళ్ళ వృద్ధుడు అత్యాచారం.. కొడుకు ఫోన్ లో వీడియో రికార్డు?

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?

మోడీ అమెరికా టూర్‌లో అతి గొప్ప విజయం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>