PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-pawan-razoloe-jagan34f4ce78-d6da-4a34-a2c1-aae0dc164fd0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-pawan-razoloe-jagan34f4ce78-d6da-4a34-a2c1-aae0dc164fd0-415x250-IndiaHerald.jpgనిజానికి ప్రజాస్వామ్యంలో ఇలాంటి చాలెంజులు, ప్రతిజ్ఞలు పనిచేయవని పవన్ కు ఇంకా అర్ధంకాలేదు. ఇలాంటి ప్రతిజ్ఞలే 2019 ఎన్నికల్లో కూడా చేసి బోర్లాపడ్డారు. సరే ఆ విషయాన్ని వదిలేస్తే వైసీపీని ఒక్కనియోజకవర్గంలో కూడా గెలవనిచ్చేది లేదన్నారు బాగానే ఉంది. మరి జనసేన ఎన్నిసీట్లలో గెలుస్తుందో ఎందుకు చెప్పలేదు. అసలు ఎన్నిసీట్లలో పోటీచేస్తుందో కూడా తెలీని పవన్ వైసీపీ గెలుపు గురించి మాట్లాడటమే విచిత్రంగా ఉంది. janasena pawan razoloe jagan{#}Janasena;Reddy;Raccha;Hanu Raghavapudi;Yevaru;YCP;Jagan;Party;Pawan Kalyanగోదావరి : జనసేన గెలిచే సీట్లేవో చెప్పగలరా ?గోదావరి : జనసేన గెలిచే సీట్లేవో చెప్పగలరా ?janasena pawan razoloe jagan{#}Janasena;Reddy;Raccha;Hanu Raghavapudi;Yevaru;YCP;Jagan;Party;Pawan KalyanFri, 30 Jun 2023 05:00:00 GMT


వారాహియాత్ర మొదలైన దగ్గర నుండి జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాగా హైలైట్ చేస్తున్న పాయింట్లలో కీలకమైనది ఏమిటంటే వైసీపీని గెలవనివ్వనని. మొదటగా ఉభయగోదావరి జిల్లాల్లోని 34 సీట్లలో ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో కూడా వైసీపీని గెలవనిచ్చేదిలేదని చాలెంజ్ చేశారు. మళ్ళీ ఇందులో కూడా కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి రాబోయే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తానంటు భీష్మ ప్రతిజ్ఞ చేశారు. అంతటి ఆగకుండా ద్వారంపూడి గనుక గెలిస్తే పవన్ కల్యాణ్ అనే తన పేరును మార్చుకుంటానని శపథం చేశారు.





నిజానికి ప్రజాస్వామ్యంలో ఇలాంటి చాలెంజులు, ప్రతిజ్ఞలు పనిచేయవని పవన్ కు ఇంకా అర్ధంకాలేదు. ఇలాంటి ప్రతిజ్ఞలే 2019 ఎన్నికల్లో కూడా చేసి బోర్లాపడ్డారు. సరే ఆ విషయాన్ని వదిలేస్తే వైసీపీని ఒక్కనియోజకవర్గంలో కూడా గెలవనిచ్చేది లేదన్నారు బాగానే ఉంది. మరి జనసేన ఎన్నిసీట్లలో గెలుస్తుందో  ఎందుకు చెప్పలేదు. అసలు ఎన్నిసీట్లలో పోటీచేస్తుందో కూడా తెలీని పవన్ వైసీపీ గెలుపు గురించి మాట్లాడటమే విచిత్రంగా ఉంది.





తాను పోటీచేయబోయే నియోజకవర్గాన్ని ప్రకటించేందుకే భయపడుతున్నారు. ఎందుకంటే తాను పోటీచేయబోయే నియోజకవర్గాన్ని ఇపుడే ప్రకటిస్తే తనను ఓడించేందుకు ఇఫ్పటినుండే జగన్మోహన్ రెడ్డి దృష్టిపెడతరాట.   అంటే రాబోయే ఎన్నికల్లో తాను గెలిచేదే అనుమానం. పైగా ఈ విషయాన్ని యాత్రలోనే చెప్పారు. వచ్చేఎన్నికల్లో తాను గెలుస్తానో లేదో..తనకు ఓట్లేస్తారో లేదో అంటు పదిసార్లు చెప్పుంటారు.




ముందు తాను పోటీచేసే నియోజకవర్గంలో ఎలా గెలవాలో చూసుకోకుండా, పోటీచేసే నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు గురించి ఆలోచించకుండా వైసీపీ గెలుపు విషయం పవన్ కు ఎందుకు ? ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలని పెద్దలు చెప్పే సామెత ఒకటుంది. బహుశా ఆ సామెత పవన్ విన్నట్లు లేదు. అందుకనే ఎంతసేపు జగన్ పైన వైసీపీ గెలుపుపైన నోరుపారేసుకుంటున్నారు. నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో ఇదే చెబుతున్నారు. ముందు జనసేన గెలుపు సంగతి చూసుకోమని హితవుచెబుతున్నారు. ఎవరు గెలవాలన్నా ఓట్లేయాల్సింది జనాలే. జనాలు ఓట్లేస్తేనే గెలుస్తారు లేకపోతే లేదు. ఇంతోటిదానికి పవన్ ఎందుకు చాలెంజులు చేస్తున్నారో అర్ధంకావటంలేదు.  




RRR Telugu Movie Review Rating

కొబ్బరి ముక్క.. బాలుడి ప్రాణం తీసింది?

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?

మోడీ అమెరికా టూర్‌లో అతి గొప్ప విజయం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>