Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-0520f7b4-1177-450b-ab63-ba484fa8d5b0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-0520f7b4-1177-450b-ab63-ba484fa8d5b0-415x250-IndiaHerald.jpgవివిఎస్ లక్ష్మణ్ గురించి తెలియని క్రికెట్ అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి కాదు. తెలుగువారి కీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన ఆటగాళ్లలో ఈయన కూడా ఒకరు. తెలుగు రాష్ట్రాల నుంచి క్రికెట్లో అంత పేరు గడించిన ఏకైక వ్యక్తిగా పేరుగాంచాడు లక్ష్మణ్. ఈయన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మేనల్లుడు అన్న సంగతి చాలా తక్కువమందికి తెలుసు. లక్ష్మణ్ డాక్టర్ల కుటుంబంలో పుట్టడం కారణంగా అతనిని ఒక డాక్టర్ గా చేయాలని తన కుటుంబ సభ్యులు అనుకున్నారు కానీ చిన్నప్పట్నుంచి క్రికెట్ మీద మక్కువ ఏర్పరుచుకొని ఆఖరికి తిరుగులేని క్రికెట్ వీరుCricket {#}lakshman;Varasudu;Doctor;wednesday;akhil akkineni;Cricket;Hyderabad;Father;Teluguక్రికెట్: మెరుపువేగంతో దూసుకువస్తున్న వివియస్ లక్ష్మణ్ కొడుకు!క్రికెట్: మెరుపువేగంతో దూసుకువస్తున్న వివియస్ లక్ష్మణ్ కొడుకు!Cricket {#}lakshman;Varasudu;Doctor;wednesday;akhil akkineni;Cricket;Hyderabad;Father;TeluguThu, 29 Jun 2023 14:30:00 GMTవివిఎస్ లక్ష్మణ్ గురించి తెలియని క్రికెట్ అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి కాదు. తెలుగువారి కీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన ఆటగాళ్లలో ఈయన కూడా ఒకరు. తెలుగు రాష్ట్రాల నుంచి క్రికెట్లో అంత పేరు గడించిన ఏకైక వ్యక్తిగా పేరుగాంచాడు లక్ష్మణ్. ఈయన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మేనల్లుడు అన్న సంగతి చాలా తక్కువమందికి తెలుసు. లక్ష్మణ్ డాక్టర్ల కుటుంబంలో పుట్టడం కారణంగా అతనిని ఒక డాక్టర్ గా చేయాలని తన కుటుంబ సభ్యులు అనుకున్నారు కానీ చిన్నప్పట్నుంచి క్రికెట్ మీద మక్కువ ఏర్పరుచుకొని ఆఖరికి తిరుగులేని క్రికెట్ వీరుడిగా పేరు సంపాదించాడు లక్ష్మణ్.  

అలాంటి వివిఎస్ లక్ష్మణ్ కుటుంబంనుండి మన దేశానికి మరో ఫ్యూచర్ స్టార్ క్రికెటర్ రాబోతున్నాడు. అవును, ఆటను మరెవరో కాదు అయన వారసుడు సర్వజిత్. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) లీగుల్లో అతను తన తొలి సీజన్ ను ఘనంగా మొదలు పెట్టాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. రెండు రోజుల లీగ్ లో భాగంగా సికింద్రాబాద్ నవాబ్స్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న సర్వజిత్.. తన రెండో మ్యాచ్ లోనే శతకాన్ని అందుకోవడం కొసమెరుపు. తొలి మ్యాచ్లో 30 పరుగులు చేసిన అతను.. తాజాగా సెంచరీ కొట్టడం విశేషంగా చెప్పుకోవచ్చు.

ఇకపోతే బుధవారం ముగిసిన మ్యాచ్ లో సర్వజిత్ (104; 209 బంతుల్లో 12×4, 1×6) సత్తాచాటాడు. చూడముచ్చటైన షాట్లతో అలరించాడని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. లీగ్ కెరీర్లోనే తొలి శతకాన్ని అందుకోవడం అంటే మాటలు కాదు. ఇక్కడ దురదృష్టకరం ఏమంటే అతని జట్టు సికింద్రాబాద్ నవాబ్స్ మాత్రం 191 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఫ్యూచర్ స్టార్ 70.5 ఓవర్లలో 427 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సికింద్రాబాద్ నవాబ్స్ 71.3 ఓవర్లలో 236కే ఆల్ ఔట్ అయింది. సర్వజిత్ తన శాయశక్తులా పోరాడినా వికెట్లు పడడంతో ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. సర్వజిత్ మినహా అఖిల్ (42) మాత్రమే బ్యాటింగ్ లో రాణించాడు. తండ్రి అడుగుజాడల్లో సాగుతున్న సర్వజిత్.. లక్ష్మణ్ లాగా కుడి చేతి వాటం బ్యాటర్ కాదు. అతను ఎడమ చేతి వాటం బ్యాటర్ కావడం కొసమెరుపు. చూద్దాం మరి ఈ ఫ్యూచర్ స్టార్ క్రికెటర్ ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తాడో!



RRR Telugu Movie Review Rating

అలా చేసి రెచ్చగొడుతున్న నభ నటేష్....!!

అందులో తెలంగాణ కంటే ఏపీ కంటే ఎంతో బెటర్‌?

జనసేనకు ప్రమాదం.. కొద్దిలో తప్పింది?

ముస్లింలు.. పాక్‌ కంటే ఇండియాలోనే సేఫ్‌?

డేంజర్‌: చైనాను అమెరికా కట్టడి చేయకపోతే?

జగన్‌ను మళ్లీ సీఎం చేసేలా ఆర్జీవీ "వ్యుహం"?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>