HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health72a07143-e025-4958-b901-40e71a444806-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health72a07143-e025-4958-b901-40e71a444806-415x250-IndiaHerald.jpgమొలల సమస్యతో ఎక్కువగా బాధపడే వారు రోజూ రెండు పూటలా అర కప్పు మోతాదులో ముల్లంగి రసాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక ఇలా తీసుకోవడం వల్ల క్రమంగా మొలల సమస్య తగ్గుతుంది.ఇంకా అలాగే రోజూ రాత్రిపడుకునే ముందు 4 ఎండు అంజీరాలను నీటిలో నానబెట్టాలి. తరువాత ఈ అంజీరాలను నానబెట్టిన నీటితో పాటు అంజీరాలను కూడా పూటకు రెండు చొప్పున తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మలబద్దకం సమస్యతో పాటు మొలల సమస్య కూడా చాలా ఈజీగా తగ్గుతుంది.ఇంకా అలాగే దానిమ్మ తొక్కను నీటిలో వేసి దానిని మరిగించాలి. ఆ తరువాత ఈ నీటిని వడకట్టి రోజుకు రెండు సార్లుHEALTH{#}Pepper Powder;Pomegranate;Onion;Turmeric;House;Gingerమొలల సమస్య చిటికెలో తగ్గే చిట్కాలు?మొలల సమస్య చిటికెలో తగ్గే చిట్కాలు?HEALTH{#}Pepper Powder;Pomegranate;Onion;Turmeric;House;GingerThu, 29 Jun 2023 18:05:08 GMTమొలల సమస్యతో ఎక్కువగా బాధపడే వారు రోజూ రెండు పూటలా అర కప్పు మోతాదులో ముల్లంగి రసాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక ఇలా తీసుకోవడం వల్ల క్రమంగా మొలల సమస్య తగ్గుతుంది.ఇంకా అలాగే రోజూ రాత్రిపడుకునే ముందు 4 ఎండు అంజీరాలను నీటిలో నానబెట్టాలి. తరువాత ఈ అంజీరాలను నానబెట్టిన నీటితో పాటు అంజీరాలను కూడా పూటకు రెండు చొప్పున తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మలబద్దకం సమస్యతో పాటు మొలల సమస్య కూడా చాలా ఈజీగా తగ్గుతుంది.ఇంకా అలాగే దానిమ్మ తొక్కను నీటిలో వేసి దానిని మరిగించాలి. ఆ తరువాత ఈ నీటిని వడకట్టి రోజుకు రెండు సార్లు తాగాలి.ఇంకా అలాగే మజ్జిగలో రాళ్ల ఉప్పు, మిరియాల పొడి ఇంకా అల్లం వేసి రోజుకు రెండు సార్లు తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.అలాగే మొలల నుండి రక్తం కారే సమస్యతో బాధపడే వారు ఒక టీ స్పూన్ ఆవాల పిండిని అర కప్పు మేకపాలల్లో వేసి బాగా కలపాలి.ఇంకా అలాగే ఇందులో కొద్దిగా పంచదారును వేసుకుని రోజూ ఉదయం పూట పరగడుపున తాగాలి. ఇలా తాగడం వల్ల క్రమంగా మొలల నుండి రక్తం కారడం తగ్గడంతో పాటు మొలల సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది. ఇంకా అలాగే ఒక టీ స్పూన్ అల్లానికి కొద్దిగా నిమ్మరసం, పుదీనా ఆకులు ఇంకా తేనె కలిపి రోజుకు మూడు నుండి నాలుగు సార్లు తీసుకోవాలి.


ఇలా చేయడం వల్ల మొలల సమస్య ఈజీగా తగ్గు ముఖం పడుతుంది. ఇంకా అలాగే బాగా పండిన అరటి పండును కప్పు పాలల్లో వేసి కలిపి తాగాలి. ఇలా తాగడం వల్ల మొలల వల్ల కలిగే నొప్పి ఈజీగా తగ్గుతుంది.అలాగే మొలల సమస్యతో బాధపడే వారు నేరేడు పండ్లను తినడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది.అలాగే రోజూ ఒక తాజా పసుపు కొమ్మును తినడం వల్ల కూడా మొలల సమస్య ఈజీగా తగ్గుతుంది.మొలల సమస్యతో బాధపడే వారు వాటిపై కొద్దిగా కొబ్బరి నూనెను రాసుకోవడం వల్ల ఆ భాగంలో కలిగే మంట ఇంకా దురద వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ఉల్లిపాయ తురుముకు తేనెను కలిపి రోజుకు రెండు నుండి మూడుసార్లు దానిని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కూడా మొలల సమస్య ఈజీగా తగ్గుతుంది. ఈ విధంగా మొలల సమస్యతో బాధపడే వారు ఈ హోమ్ టిప్స్ వాడడం వల్ల మొలల సమస్య నుండి ఈజీగా ఉపశమనం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ సమస్య మరీ తీవ్రంగా ఉన్నవారు వైద్యున్ని సంప్రదించి ఖచ్చితంగా తగిన చికిత్స తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆనంద్ దేవరకొండ 'బేబీ' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

అందులో తెలంగాణ కంటే ఏపీ కంటే ఎంతో బెటర్‌?

జనసేనకు ప్రమాదం.. కొద్దిలో తప్పింది?

ముస్లింలు.. పాక్‌ కంటే ఇండియాలోనే సేఫ్‌?

డేంజర్‌: చైనాను అమెరికా కట్టడి చేయకపోతే?

జగన్‌ను మళ్లీ సీఎం చేసేలా ఆర్జీవీ "వ్యుహం"?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>