Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket801ef15b-49c0-43b1-8489-d38f9e9248ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket801ef15b-49c0-43b1-8489-d38f9e9248ad-415x250-IndiaHerald.jpgఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని టీమ్స్ కూడా ఈ వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్నాయి. అయితే ఇప్పటికే 8 జట్లు నేరుగా వరల్డ్ కప్ లో మ్యాచ్ లు ఆడేందుకు అర్హత సాధించాయి. కానీ మరికొన్ని టీమ్స్ మాత్రం మిగిలిన రెండు స్థానాల కోసం క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జింబాంబే వేదికగా జరుగుతున్న క్వాలిఫైయర్ మ్యాచ్ లు నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉన్నాయ్. వరల్డ్ క్రికెట్లో ఛాంపియన్స్ గా ఉన్న టీమ్స్ సైతం ఇCricket{#}teja;Netherlands;Qualification;Parugu;Venkatesh;West Indies;India;Telugu;Audi;World Cupవారెవ్వా.. వెస్టిండీస్ ను చావు దెబ్బ కొట్టిన తెలుగోడు?వారెవ్వా.. వెస్టిండీస్ ను చావు దెబ్బ కొట్టిన తెలుగోడు?Cricket{#}teja;Netherlands;Qualification;Parugu;Venkatesh;West Indies;India;Telugu;Audi;World CupWed, 28 Jun 2023 10:00:00 GMTఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని టీమ్స్ కూడా ఈ వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్నాయి. అయితే ఇప్పటికే 8 జట్లు నేరుగా వరల్డ్ కప్ లో మ్యాచ్ లు ఆడేందుకు అర్హత సాధించాయి. కానీ మరికొన్ని టీమ్స్ మాత్రం మిగిలిన రెండు స్థానాల కోసం క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జింబాంబే వేదికగా జరుగుతున్న క్వాలిఫైయర్ మ్యాచ్ లు నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉన్నాయ్.


 వరల్డ్ క్రికెట్లో ఛాంపియన్స్ గా ఉన్న టీమ్స్ సైతం ఇక పసికూన జట్ల చేతిలో ఓడిపోయి విమర్శలు ఎదుర్కొంటూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే ఇటీవల నెదర్లాండ్స్ ఏకంగా అరివీర భయంకరమైన వెస్టిండీస్ ను దారుణంగా ఓడించింది. ఎంతో సులభంగా వెస్టిండీస్ గెలవడం ఖాయం అనుకున్న మ్యాచ్లో సైతం గట్టి పోటీ ఇచ్చి ఇక అద్వితీయమైన విజయాన్ని నమోదు చేసింది పసికూన నెదర్లాండ్స్. అంతేకాదు వెస్టిండీస్ కెరీయర్ ని ప్రమాదంలో పడేసింది అని చెప్పాలి.


 ఇటీవల జరిగిన  మ్యాచ్లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీనిని అవకాశం గా మార్చుకున్న వెస్టిండీస్ బ్యాట్స్మెన్లు రెచ్చిపోయారు. ఒకరకంగా నెదర్లాండ్స్ బౌలర్లకు చుక్కలు చూపించి బ్యాటింగ్ లో విధ్వంశాన్ని సృష్టించారు. అన్నివైపులా కళ్ళు చెదిరే షాట్లు ఆడి భారీ స్కోర్ చేశారు. పూరన్ 65 బంతుల్లోనే 104 పరుగులు చేసి అదరగొట్టాడు. మొత్తంగా వెస్టిండీస్ 50 ఓవర్ లో 6 వికెట్లు కోల్పోయి.. 374 పరుగులు చేసింది. అయితే భారీ లక్ష్యం తమ ముందు ఉన్నప్పటికీ పసికూన నెదర్లాండ్స్ మాత్రం ఎక్కడ తడబాటుకు గురి కాలేదు.



  నెదర్లాండ్స్ బ్యాటర్లు కూడా బ్యాటింగ్లో రెచ్చిపోయారు. ముఖ్యంగా తెలుగు మూలాలు ఉన్న తేజ నేడుమనూరు 111 పరుగులతో సెంచరీ చేసి అదరగొట్టాడు. స్టార్క్ హెడ్వర్డ్స్ 67 పరుగులు చేసి జట్టును ముందుకు నడిపించాడు. దీంతో వెస్టిండీస్ ఎంతో సులభంగా విజయం సాధిస్తుంది అనుకున్న మ్యాచ్ కాస్త టప్ అయింది. ఇక నెదర్లాండ్స్ విజయానికి చివరి ఓవర్లో ఆరు బంతుల్లో 9 పరుగులు కావాల్సి వచ్చింది. అప్పుడే అసలు డ్రామా మొదలైంది. తొలి 5 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసింది. లాస్ట్ బంతికి ఒక్క పరుగు చేసే క్రమంలో వికెట్ పడింది. మ్యాచ్ టై అయింది. ఇక సూపర్ ఓవర్ లో నెదర్లాండ్స్ 30 పరుగులు చేయగా.. వెస్టిండీస్ రెండు వికెట్ కోల్పోయి 8 పరుగులు చేసింది. దీంతో నెదర్లాండ్స్ సూపర్ విక్టరీ సాధించింది. ఈ విషయం తెలిసి తెలుగోడు వెస్టిండీస్ కి చుక్కలు చూపించాడు అంటూ ఎంతోమంది భారత ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు..



RRR Telugu Movie Review Rating

ఫ్యాన్ చేసిన పనికి కంటతడి పెట్టుకున్న తమన్నా.. అసలు ఏం జరిగిందంటే..!?

అందులో తెలంగాణ కంటే ఏపీ కంటే ఎంతో బెటర్‌?

జనసేనకు ప్రమాదం.. కొద్దిలో తప్పింది?

ముస్లింలు.. పాక్‌ కంటే ఇండియాలోనే సేఫ్‌?

డేంజర్‌: చైనాను అమెరికా కట్టడి చేయకపోతే?

జగన్‌ను మళ్లీ సీఎం చేసేలా ఆర్జీవీ "వ్యుహం"?

చైనాతో ఘర్షణ.. రెడీగా ఉన్న ఇండియా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>