Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4f6999bc-8156-4a31-bd04-d5396c6280c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4f6999bc-8156-4a31-bd04-d5396c6280c1-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో పూజ హెగ్డే పరిస్థితి దారుణంగా మారిందని చెప్పాలి. ఏ దర్శకులు కూడా పిలిచి అవకాశాలు ఇచ్చేటట్లు కనిపించడం లేదు.రెండు మూడు సంవత్సరాల నుండి ఈ బ్యూటీకి అసలు కలిసి రావటం లేదు. చేసిన సినిమాలన్నీ ఇట్టే ప్లాఫ్ అవుతున్నాయి. కారణం ఏంటో తెలియదు కానీ పూజ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంది.కెరీర్ మొదట్లో కూడా పూజ హెగ్డే కు అస్సలు కలిసి రాలేదు. మొదట్లో ఐరన్ లెగ్ అని కూడా పేరు తెచ్చుకుంది. కానీ రెండు మూడు సినిమాల తర్వాత కాస్త ఫామ్ లోకి వచ్చింది. స్టార్ హీరోల సినిమాలలో అవకాsocialstars lifestyle{#}Guntur;bollywood;gold;Director;Wife;India;Iron;Tollywood;Parents;marriage;Pooja Hegde;Success;Industry;Cinema;Heroineదానికోసం పూర్తిగా దిగజారిపోయిన పూజహెగ్డే....!!దానికోసం పూర్తిగా దిగజారిపోయిన పూజహెగ్డే....!!socialstars lifestyle{#}Guntur;bollywood;gold;Director;Wife;India;Iron;Tollywood;Parents;marriage;Pooja Hegde;Success;Industry;Cinema;HeroineWed, 28 Jun 2023 23:35:36 GMTప్రస్తుతం ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో పూజ హెగ్డే పరిస్థితి దారుణంగా మారిందని చెప్పాలి. ఏ దర్శకులు కూడా పిలిచి అవకాశాలు ఇచ్చేటట్లు కనిపించడం లేదు.రెండు మూడు సంవత్సరాల నుండి ఈ బ్యూటీకి అసలు కలిసి రావటం లేదు. చేసిన సినిమాలన్నీ ఇట్టే ప్లాఫ్ అవుతున్నాయి. కారణం ఏంటో తెలియదు కానీ పూజ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంది.కెరీర్ మొదట్లో కూడా పూజ హెగ్డే కు అస్సలు కలిసి రాలేదు. మొదట్లో ఐరన్ లెగ్ అని కూడా పేరు తెచ్చుకుంది. కానీ రెండు మూడు సినిమాల తర్వాత కాస్త ఫామ్ లోకి వచ్చింది. స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకుంది. అలా మధ్యలో చేసిన కొన్ని సినిమాలు బాగానే సక్సెస్ అందించాయి.ఆ సమయంలో టాలీవుడ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా పూజ హెగ్డేనే ఉండేది. ఏ హీరోలైన, దర్శకులైన దగ్గరికి వచ్చి మరి అవకాశాలు ఇచ్చేవాళ్ళు. అలా కొంతకాలం ఈ ముద్దుగుమ్మ హవా బాగా నడిచింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. అలా వైకుంటపురంలో సినిమా తర్వాత దరిద్రం వెంటాడుతుందని చెప్పాలి. ఆ సినిమా తర్వాత ఈ అమ్మడుకు బాగానే అవకాశాలు వచ్చాయి.

ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో వచ్చాయి.కానీ ఏం లాభం వరుసగా అన్ని బోల్తా కొట్టాయి. అలా 2021 నుండి ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ సరైన సక్సెస్ అందుకున్నట్లు కనిపించలేదు. వరుసగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, సర్కస్, రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ ఇలా మరిన్ని సినిమాలు ఈ ముద్దుగుమ్మను నిరాశపరిచాయి. అంతేకాదు మరోసారి ఐరన్ లెగ్ అనే ట్యాగ్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో కూడా బాగా ట్రోల్స్ వచ్చాయి.ఇక వరుసగా ఇలా కావడంతో ఏ దర్శకులు కూడా, ఏ స్టార్ హీరోలు కూడా ఈమెకు అవకాశాలు ఇవ్వటానికి ముందుకు రావట్లేదు. ఆమె పేరు వింటేనే భయపడిపోతున్నారు. అయినా కూడా డైరెక్టర్ త్రివిక్రమ్ ఈమెకు గుంటూరు కారం సినిమాలో అవకాశం ఇచ్చాడు. కానీ పూజ హెగ్డే దీనిని కాపాడుకోకుండా.. తన నోటి దురుస వల్ల బంగారం లాంటి అవకాశాన్ని దూరం చేసుకుందని తెలిసింది.ఇక బాలీవుడ్ లో కూడా వరుసగా ఫ్లాప్స్ రావడంతో అక్కడ కూడా పట్టించుకునే నాధుడే లేదని చెప్పాలి. దీంతో ఈ ముద్దుగుమ్మ అవకాశాలు లేకపోవడంతో ఒక నిర్ణయం తీసుకుందని తెలిసింది. అదేంటంటే బాలీవుడ్ ఇండస్ట్రీపై ఉన్న మోజుతో అక్కడ అవకాశాలు సంపాదించడం కోసం.. పెళ్ళై విడాకులు తీసుకున్న హీరోని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందట.

ఇక పూజ ఈ నిర్ణయం తీసుకోవడంతో తన తల్లిదండ్రులు కూడా తనపై మండిపడుతున్నట్లు తెలిసింది. కానీ పూజ మాత్రం అవకాశాల కోసం తప్పనిసరిగా ఈ నిర్ణయం తీసుకుందని.. త్వరలో తన పెళ్లి గురించి అఫీషియల్ గా ప్రకటిస్తుందని తెలిసింది. ఇక ఈ విషయం ప్రస్తుతం రెండు ఇండస్ట్రీలో వైరల్ అవ్వడంతో.. అవకాశాల కోసం సెకండ్ వైఫ్ గా వెళ్లడానికి కూడా సిద్ధపడ్డావా.. ఎంత దిగజారిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఉత్తరాంధ్ర : పవన్ను ఉతికారేసిన జగన్

అందులో తెలంగాణ కంటే ఏపీ కంటే ఎంతో బెటర్‌?

జనసేనకు ప్రమాదం.. కొద్దిలో తప్పింది?

ముస్లింలు.. పాక్‌ కంటే ఇండియాలోనే సేఫ్‌?

డేంజర్‌: చైనాను అమెరికా కట్టడి చేయకపోతే?

జగన్‌ను మళ్లీ సీఎం చేసేలా ఆర్జీవీ "వ్యుహం"?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>