PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawana9d464f8-71f7-418f-9fa8-647c5fcdd273-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawana9d464f8-71f7-418f-9fa8-647c5fcdd273-415x250-IndiaHerald.jpgపవన్ కల్యాణ్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం వారాహి యాత్ర కోనసీమలో కొనసాగుతోంది. అయితే పవన్ నాలుగు రోజులుగా ఉపవాస దీక్షలో ఉన్నారు. ఆయన కేవలం పండ్ల రసాలు మాత్రమే తీసుకుంటున్నారు. దీంతో కాస్త అస్వస్థతకు గురైనట్లు జనసేన నాయకులు ప్రకటించారు. గత నాలుగు రోజులుగా వారాహి యాత్ర కోనసీమ జిల్లాల్లో కొనసాగడం అక్కడ పవన్ తన స్పీచ్ ఇవ్వడంతో కాస్త అలసిపోయారు. ఆయనకు ఒళ్ల నొప్పులతో పాటు జ్వరం కూడా వచ్చింది. దీంతో పవన్ మిగతా సభల్లో స్పీచ్ ఇవ్వకుండానే చేతులు ఊపుకుంటూ జనాలకు కనిపిస్తూ వెళ్లిపోయారు. ఉదయం సpawan{#}Rajolu;Hello;Yatra;Army;Jagan;Pawan Kalyan;Janasenaపవన్‌కు అనారోగ్యం.. అయినా ఆగని సభలు?పవన్‌కు అనారోగ్యం.. అయినా ఆగని సభలు?pawan{#}Rajolu;Hello;Yatra;Army;Jagan;Pawan Kalyan;JanasenaWed, 28 Jun 2023 08:07:00 GMTపవన్ కల్యాణ్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం వారాహి యాత్ర కోనసీమలో కొనసాగుతోంది. అయితే పవన్ నాలుగు రోజులుగా ఉపవాస దీక్షలో ఉన్నారు.  ఆయన కేవలం పండ్ల రసాలు మాత్రమే తీసుకుంటున్నారు. దీంతో కాస్త అస్వస్థతకు గురైనట్లు జనసేన నాయకులు ప్రకటించారు. గత నాలుగు రోజులుగా వారాహి యాత్ర కోనసీమ జిల్లాల్లో కొనసాగడం అక్కడ పవన్ తన స్పీచ్ ఇవ్వడంతో కాస్త అలసిపోయారు.


ఆయనకు ఒళ్ల నొప్పులతో పాటు జ్వరం కూడా వచ్చింది. దీంతో పవన్ మిగతా సభల్లో స్పీచ్ ఇవ్వకుండానే చేతులు ఊపుకుంటూ జనాలకు కనిపిస్తూ వెళ్లిపోయారు. ఉదయం సమావేశం తర్వాత మిగతా సభల్లో ఆయన మాట్లాడలేదు. హలో ఆంధ్రప్రదేశ్, బైబై జగన్ అంటూ వెళ్లిపోయారు. అమలాపురం సభలో దాదాపు 3 గంటల పాటు పాల్గొన్నారు. సభ అనంతరం తాను బస చేసిన సత్యనారాయణ గార్డెన్ కు వెళ్లిన పవన్ కు ఒళ్లు నొప్పులు, జ్వరం వచ్చినట్లు జనసేన నాయకులు తెలిపారు.


దీంతో పవన్ కేవలం అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయారు. చివరకు రాజోలు చేరుకుని డిండి రిసార్టులో బస చేశారు. అనారోగ్యంతో ఆయన మాట్లాడలేకపోయినా అభిమానులు మాత్రం నిరాశ చెందకుండా పవన్ కల్యాణ్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అయితే పవన్ తన స్పీచ్ ఆవేశంగా, గట్టిగా మాట్లాడటం వల్ల గొంతు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది.


చాలా అగ్రెసివ్ గా పవన మాట్లాడతారు. దీనికి తోడు వారాహి యాత్రలో ఆ వాహనంపై గంటల తరబడి నిలబడి ఉండటం కూడా ఆయనకు ఒళ్లు నొప్పులు రావడానికి కారణం. పవన్ మాట్లాడకపోయిన ఆయన అభిమానులు మాత్రం సభలకు రావడం సానుకూల అంశం. పవన్ సభలకు ప్రజలు కానీ, జన సేన నాయకులు కానీ స్వచ్ఛందంగా వస్తారని మరో సారి రుజువైంది. మరి తొందరగా కోలుకుని ప్రజల వద్దను వారాహి యాత్ర కొనసాగించాలని జనసేన అధినేత కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

నేను అందుకే పవన్ కి ముందుగా రెమ్యూనరేషన్ ఇవ్వలేదు... తొలిప్రేమ నిర్మాత..!

అందులో తెలంగాణ కంటే ఏపీ కంటే ఎంతో బెటర్‌?

జనసేనకు ప్రమాదం.. కొద్దిలో తప్పింది?

ముస్లింలు.. పాక్‌ కంటే ఇండియాలోనే సేఫ్‌?

డేంజర్‌: చైనాను అమెరికా కట్టడి చేయకపోతే?

జగన్‌ను మళ్లీ సీఎం చేసేలా ఆర్జీవీ "వ్యుహం"?

చైనాతో ఘర్షణ.. రెడీగా ఉన్న ఇండియా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>