MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sri-vishnu13f34749-d5ce-430e-a002-da776f7ec226-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sri-vishnu13f34749-d5ce-430e-a002-da776f7ec226-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి శ్రీ విష్ణు కొంత కాలం క్రితం రాజ రాజ చోరా అనే మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఈ నటుడు పలు మూవీ లలో హీరో గా నటించాడు. కాకపోతే ఆ సినిమాలు ఏవి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. ఆఖరుగా ఈ నటుడు అల్లూరి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో శ్రీ విష్ణు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచిందSri vishnu{#}Naresh;allari naresh;ram pothineni;sri vishnu;vennela kishore;Hyderabad;Alluri Sitarama Raju;cinema theater;Box office;Hero;Traffic police;June;Cinema"సామజవరగమన" మూవీ నుండి సూపర్ అప్డేట్..!"సామజవరగమన" మూవీ నుండి సూపర్ అప్డేట్..!Sri vishnu{#}Naresh;allari naresh;ram pothineni;sri vishnu;vennela kishore;Hyderabad;Alluri Sitarama Raju;cinema theater;Box office;Hero;Traffic police;June;CinemaTue, 27 Jun 2023 15:15:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి శ్రీ విష్ణు కొంత కాలం క్రితం రాజ రాజ చోరా అనే మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఈ నటుడు పలు మూవీ లలో హీరో గా నటించాడు. కాకపోతే ఆ సినిమాలు ఏవి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. ఆఖరుగా ఈ నటుడు అల్లూరి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో శ్రీ విష్ణు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచింది. 

ఇలా వరుస అపజయాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర డీల పడిపోయిన శ్రీ విష్ణు తాజాగా సామజవరగమన అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ లో నరేష్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమాను జూన్ 29 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదలకు ముందుగానే ఈ మూవీ ని నిన్న అనగా జూన్ 26 వ తేదీన కొన్ని ప్రాంతాలలో ప్రీమియర్స్ వేశారు. వీటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ యొక్క టికెట్ బుకింగ్స్ ను ఓపెన్ చేసినట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.

ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ టికెట్ బుకింగ్ లలు మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ మూవీ టికెట్ ధరలు హైదరాబాద్ నగరంలో మల్టీ ప్లెక్స్ థియేటర్ లలో 200 రూపాయలు గాను ... సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో 150 రూపాయలు గాను ఉండబోతున్నాయి.


RRR Telugu Movie Review Rating

"స్పై" మూవీలో ఆ హీరోకు వీరాభిమానిగా కనిపించబోతున్న నిఖిల్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>