MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgబాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ప్రెగ్నెంట్ అంటూ బాలీవుడ్ మీడియాలో విపరీతమైన రచ్చ జరుగుతోంది. ఈవిషయమై ఆమె వైపు నుంచి ఎటువంటి ఖండన లేకపోవడంతో ఆమె తల్లి అవుతోంది అన్న అభిప్రాయం బాలీవుడ్ మీడియా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి వార్తలు ఆమె పై రావడానికి ఈమె లేటెస్ట్ ఫోటోలలో బేబీ బంప్ తో కనిపించడమే కారణం అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈమధ్య కియారా తన కొత్త సినిమా ప్రచారం కోసం జైపుర్ వెళ్లింది హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఫొటోలకు పోజులిచ్చింది. అలా దిగిన ఫొటోల్లో ఆమె చిన్నపాటి గర్భంతో కనిపించడం ఇపRAMCHARAN{#}GEUM;Nijam;Raccha;aryan;Kiara Advani;Darsakudu;shankar;Ram Charan Teja;bollywood;News;Director;Industry;Heroine;Hero;Cinemaగేమ్ ఛేంజర్ కు కియరా అద్వానీ కష్టాలు !గేమ్ ఛేంజర్ కు కియరా అద్వానీ కష్టాలు !RAMCHARAN{#}GEUM;Nijam;Raccha;aryan;Kiara Advani;Darsakudu;shankar;Ram Charan Teja;bollywood;News;Director;Industry;Heroine;Hero;CinemaTue, 27 Jun 2023 09:00:00 GMTబాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ప్రెగ్నెంట్ అంటూ బాలీవుడ్ మీడియాలో విపరీతమైన రచ్చ జరుగుతోంది. ఈవిషయమై ఆమె వైపు నుంచి ఎటువంటి ఖండన లేకపోవడంతో ఆమె తల్లి అవుతోంది అన్న అభిప్రాయం బాలీవుడ్ మీడియా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి వార్తలు ఆమె పై రావడానికి ఈమె లేటెస్ట్ ఫోటోలలో బేబీ బంప్ తో కనిపించడమే కారణం అంటూ కామెంట్స్ వస్తున్నాయి.


ఈమధ్య కియారా తన కొత్త సినిమా ప్రచారం కోసం జైపుర్ వెళ్లింది హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఫొటోలకు పోజులిచ్చింది. అలా దిగిన ఫొటోల్లో ఆమె చిన్నపాటి గర్భంతో కనిపించడం ఇప్పుడు రకరకాల చర్చలకు కారణమైంది. దీనితో ప్రస్తుతం ఈమె రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీని అనుకున్న సమయంలో పూర్తి చేయగలదా అన్న సందేహాలు కొందరికి కలుగగుతున్నాయి.


ఇది ఇలా ఉంటే ఈసినిమా షూటింగ్ కు రామ్ చరణ్ కు కూతురు పుట్టడం వలన కొన్ని అవరోధాలు ఏర్పడే అవకాశం ఉంది అని కొందరంటున్నారు. మరో నెల రోజుల వరకు చరణ్ తన పాపను విడిచి షూటింగ్ లకు రాలేని పరిస్థితులలో ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈసినిమా షూటింగ్ చాలవరకు పెండింగ్ ఉండటంతో ఈమూవీ విడుదలను వచ్చే సంవత్సరం సమ్మర్ కు వాయిదా పడింది.


దీనికితోడు ఈమూవీ దర్శకుడు శంకర్ తన దృష్టి అంతా కమలహాసన్ తో తీస్తున్న ‘ఇండియన్ 2’ మూవీ పై పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా శంకర్ కియారా అద్వానీ రామ్ చరణ్ రకరకాల కారణాలతో బిజీగా ఉన్న పరిస్థితులలో ఈమూవీ వచ్చే సంవత్సరం సమ్మర్ కు కూడ విడుదల అవ్వడం కష్టం అయ్యే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో  గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఈ వార్తలే నిజం అయితే చరణ్ అభిమానులకు అతడి నుండి మరో సినిమా రావడానికి మరికొంత కాలం పట్టే ఆస్కారం ఉంది



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ మూవీ కోసం.. సముద్ర తీరాన్ని హైదరాబాద్ తెచ్చారట?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>