MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hamsanandini-movie0e23f8a2-a211-415c-a22d-bb32d50e84e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hamsanandini-movie0e23f8a2-a211-415c-a22d-bb32d50e84e9-415x250-IndiaHerald.jpgప్రముఖ ఐటమ్ గర్ల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హంస నందిని గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఇటీవలే క్యాన్సర్ తో పోరాడి గెలిచిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తాజాగా ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళిపోయింది. టాలీవుడ్ లో చేసింది కొన్ని సినిమాలే అయినా సరే తన గ్లామర్ తో ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్న ఈమె పూణేకు చెందింది. టాలీవుడ్ లో ఈమెకు అభిమానులు ఎక్కువగానే ఉన్నారని చెప్పవచ్చు. ఇక పెద్ద హీరోయిన్గా అవకాశాలు దక్కించుకోకపోయినా సరే ఈమంటే పడి చచ్చే వారి సంఖ్య ఎక్కువే అని చెప్పాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎHAMSANANDINI;MOVIE{#}Cancer;silver screen;Rudramadevi;Fidaa;Car;Shakti;Telugu;Tollywood;Cinemaసినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న హంస నందిని.. నిజమెంత?సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న హంస నందిని.. నిజమెంత?HAMSANANDINI;MOVIE{#}Cancer;silver screen;Rudramadevi;Fidaa;Car;Shakti;Telugu;Tollywood;CinemaTue, 27 Jun 2023 10:03:23 GMTప్రముఖ ఐటమ్ గర్ల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హంస నందిని గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఇటీవలే క్యాన్సర్ తో పోరాడి గెలిచిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తాజాగా ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళిపోయింది. టాలీవుడ్ లో చేసింది కొన్ని సినిమాలే అయినా సరే తన గ్లామర్ తో ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్న ఈమె పూణేకు చెందింది. టాలీవుడ్ లో ఈమెకు అభిమానులు ఎక్కువగానే ఉన్నారని చెప్పవచ్చు. ఇక పెద్ద హీరోయిన్గా అవకాశాలు దక్కించుకోకపోయినా సరే ఈమంటే పడి చచ్చే వారి సంఖ్య ఎక్కువే అని చెప్పాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ షో తో యువతను ఆకట్టుకునే ఈమె అంటే ఎవరైనా సరే ఫిదా అవుతారు.

ఇక హంస నందిని పెట్టే ఒక్కో పోస్ట్ కి విపరీతమైన ఫాలోయింగ్ తో పాటు వ్యూస్ , లైక్స్ కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కుర్ర కారు మనసు దోచుకునే పనిలో పడ్డ ఈ ముద్దుగుమ్మ నెట్టింట రకరకాల హాట్ ఫోటోషూట్లతో ఆకట్టుకుంటూ ఉంటుంది.  ఇకపోతే క్యాన్సర్ సోకిన తర్వాత గుర్తుపట్టకుండా మారిపోయిన ఈమె కొత్త లుక్ లో అందరిని అలరిస్తోందని చెప్పవచ్చు. ఒక్కటవుదాం అనే సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన ఈమె టాలీవుడ్ లో వరుస సినిమా ఆఫర్లను అందుకుంది.

ఇక తర్వాత అత్తారింటికి దారేది, అధినేత, లౌక్యం, లెజెండ్, సోగ్గాడే చిన్నినాయన, రుద్రమదేవి వంటి చిత్రాలలో నటించి సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఈమె ఇటీవలే కీమోథెరపీలు చేయించుకొని కోలుకుంది.  తాజాగా ఆధ్యాత్మిక సేవలోకి మారిపోయిన ఈమె సద్గురు చెప్పినట్లుగా ఆత్మసాక్షాత్కారం అంటే ఎంత మూర్ఖంగా ఉన్నారో గ్రహించడం.. ప్రతిదీ కూడా ఇక్కడే ఉంది మీరు దానిని గ్రహించలేరు.. కానీ నేను ఆశ్రమంలోకి అడుగుపెట్టిన క్షణంలో ఒక అనిర్వచనీయమైన శక్తి ని నేను గ్రహించగలిగాను అంటూ పోస్ట్ పెట్టింది  ఈ బ్యూటీ.. దీన్ని బట్టి చూస్తుంటే ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ మూవీ కోసం.. సముద్ర తీరాన్ని హైదరాబాద్ తెచ్చారట?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>