Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/toli-mahila-driver-ki-sahayam-chesina-kamal-hasanddf3580f-3653-4db5-be6a-435c93ea995d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/toli-mahila-driver-ki-sahayam-chesina-kamal-hasanddf3580f-3653-4db5-be6a-435c93ea995d-415x250-IndiaHerald.jpgకోయంబత్తూరు(తమిళనాడు)లో మొదటి మహిళా బస్‌ డ్రైవర్‌కి కమల్‌ హాసన్‌ కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆమె ఇటీవల జాబ్‌ని కోల్పోవడంతో విషయం తెలుసుకున్న కమల్‌ ఆమెని తన ఆఫీస్‌కి పిలిపించి కారుని బహుకరించారు. కారుని ట్యాక్సీగానే కాకుండా ఇతర అవసరాలకు వాడుకుని గొప్ప వ్యాపారవేత్తగా ఎదగాలని ఈ సందర్భంగా కమల్‌ ఆకాక్షించారు. మొదటి మహిళా బస్‌ డ్రైవర్‌గా తమిళనాట పాపులర్‌ అయిన కోయంబత్తూరుకి చెందిన షర్మిలా ఇటీవల ఓ ప్రైవేట్‌ ఏజెన్సీకి చెందిన బస్సుకి డ్రైవర్‌గా పనిచేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న డీఎంకే ఎంపీ కనిమొళి తాను కోవsocialstars lifestyle{#}Conductor;Sharmila;bus;MP;Gift;Driverతొలి మహిళా బస్ డ్రైవర్ కి సహాయం చేసిన కమల్ హాసన్...!!తొలి మహిళా బస్ డ్రైవర్ కి సహాయం చేసిన కమల్ హాసన్...!!socialstars lifestyle{#}Conductor;Sharmila;bus;MP;Gift;DriverTue, 27 Jun 2023 07:00:00 GMTకోయంబత్తూరు(తమిళనాడు)లో మొదటి మహిళా బస్‌ డ్రైవర్‌కి కమల్‌ హాసన్‌ కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆమె ఇటీవల జాబ్‌ని కోల్పోవడంతో విషయం తెలుసుకున్న కమల్‌ ఆమెని తన ఆఫీస్‌కి పిలిపించి కారుని బహుకరించారు. కారుని ట్యాక్సీగానే కాకుండా ఇతర అవసరాలకు వాడుకుని గొప్ప వ్యాపారవేత్తగా ఎదగాలని ఈ సందర్భంగా కమల్‌ ఆకాక్షించారు. మొదటి మహిళా బస్‌ డ్రైవర్‌గా తమిళనాట పాపులర్‌ అయిన కోయంబత్తూరుకి చెందిన షర్మిలా ఇటీవల ఓ ప్రైవేట్‌ ఏజెన్సీకి చెందిన బస్సుకి డ్రైవర్‌గా పనిచేస్తుంది.

ఈ విషయం తెలుసుకున్న డీఎంకే ఎంపీ కనిమొళి తాను కోవైలో పర్యటించినప్పుడు షర్మిలా డ్రైవ్‌ చేస్తున్న బస్సులో ప్రయాణించారు. ఆ సమయంలో కండక్టర్ ఎంపీకి టికెట్‌ ఇచ్చారు. ఎంపీకి టికెట్‌ ఇవ్వడం పట్ల షర్మిలా అభ్యంతరం తెలిపారు. ఈ విషయం యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో, కండక్టర్‌ కూడా షర్మిలాపై కంప్లెయింట్‌ చేసింది. పాపులారిటీ కోసం సెలబ్రిటీలను బస్సుల్లోకి ఫ్రీగా ఎక్కించుకుంటుందని ఆరోపించారు. దీంతో ఆ యాజమాన్యం షర్మిలాని జాబ్‌ నుంచి తొలగించారు.

దీంతో ఈ విషయం తమిళనాట పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఇది బాగా వైరల్ గా మారింది. ఈ విషయం కమల్‌ హాసన్‌ వరకు వెళ్లింది. దీంతో ఆయన కలత చెంది, ఆమెకి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. తన ఎంఎన్‌ఎం ఆఫీసుకి పిలిపించారు. ఆమెకి కొత్త కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ సందర్భంగా కమల్‌ మాట్లాడుతూ, కోయంబత్తూర్‌ తొలి మహిళ బస్సు డ్రైవర్‌ షర్మిలా జాబ్‌ కోల్పోవడం తనని ఎంతో బాధించిందని చెప్పారు. యువతకు ఆమె ఎంతో స్పూర్తిగా నిలిచారని, షర్మిల కేవలం డ్రైవర్ గానే మిగిలిపోకుండా, ఎంతో మంది షర్మిలలను సృష్టించాలని కోరుకున్నారు కమల్‌. కమల్ కల్చరల్ సెంటర్ తరఫున షర్మిలకు కారును అందజేస్తున్నట్లు తెలిపారు. కేవలం క్యాబ్ సర్వీసులకే పరిమితం కాకుండా ఎంతో మందికి ఉపాధి కల్పించాలని, పారిశ్రామిక వేత్తగా ఎదగడానికి ఈ కారును వినియోగించుకోవచ్చని కమల్ హాసన్ పేర్కొన్నారు.



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ మూవీ కోసం.. సముద్ర తీరాన్ని హైదరాబాద్ తెచ్చారట?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>