HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthy-teadd2d177b-501b-42d3-8624-cb6cce24efb3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthy-teadd2d177b-501b-42d3-8624-cb6cce24efb3-415x250-IndiaHerald.jpgఇప్పుడు చెప్పబోయే టీని తాగడం వల్ల మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మనకు సులభంగా లభించే మసాలా దినుసులతో ఓ పౌడర్ ను తయారు చేసుకుని ఆ పౌడర్ తో మనకు కావల్సినప్పుడు టీ ని తయారు చేసుకుని తాగవచ్చు.ఇక ఈ మసాలా టీ తయారీకి కావల్సిన మసాలా పౌడర్ ను అలాగే దీనితో టీ ని ఎలా తయారు చేసుకోవాలి? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మసాలా టీ పౌడర్ తయారీకి కావల్సిన పదార్థాలు..దంచిన అతి మధురం వేర్లు – 2, తులసి ఆకులు – 10, దాల్చిన చెక్క ముక్కలు -4, యాలకులు – 20, లవంగాలు – 30, నల్ల యాలకులు – 4, దంచిన జాజికhealthy tea{#}thulasi;Cardamom;Tulasi;Jaggery;Gas Stove;Mixie;Cinnamon;Masala;Manamదగ్గు, జలుబుని దూరం చేసే హెల్తీ టీ ఇదే?దగ్గు, జలుబుని దూరం చేసే హెల్తీ టీ ఇదే?healthy tea{#}thulasi;Cardamom;Tulasi;Jaggery;Gas Stove;Mixie;Cinnamon;Masala;ManamTue, 27 Jun 2023 18:36:10 GMTఇప్పుడు చెప్పబోయే టీని తాగడం వల్ల మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మనకు సులభంగా లభించే మసాలా దినుసులతో ఓ పౌడర్ ను తయారు చేసుకుని ఆ పౌడర్ తో మనకు కావల్సినప్పుడు టీ ని తయారు చేసుకుని తాగవచ్చు.ఇక ఈ మసాలా టీ తయారీకి కావల్సిన మసాలా పౌడర్ ను అలాగే దీనితో టీ ని ఎలా తయారు చేసుకోవాలి? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మసాలా టీ పౌడర్ తయారీకి కావల్సిన పదార్థాలు..దంచిన అతి మధురం వేర్లు – 2, తులసి ఆకులు – 10, దాల్చిన చెక్క ముక్కలు -4, యాలకులు – 20, లవంగాలు – 30, నల్ల యాలకులు – 4, దంచిన జాజికాయ – 1, మిరియాలు- 3 టీ స్పూన్స్, శొంఠి ముక్కలు – 10 ఇంకా అలాగే ఎండిన తులసి పువ్వులు- గుప్పెడు తీసుకోవాలి.ఇంకా ఈ టీ తయారీకి కావల్సిన పదార్థాల విషయానికి వస్తే..నీళ్లు – ఒక గ్లాస్, పటిక బెల్లం – 2 టీ స్పూన్స్ లేదా తగినంత, టీ పౌడర్ – ఒక టీ స్పూన్ ఇంకా మసాలా టీ పౌడర్ -ఒక టీ స్పూన్ ఇంకా పాలు – రెండు కప్పులు తీసుకోవాలి.


మసాలా టీ పౌడర్ తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా కళాయిలో మసాలా పౌడర్ కు కావల్సిన పదార్థాలు వేసి వాటిని దోరగా వేయించాలి.ఆ తరువాత స్టవ్ ని ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ దినుసులను జార్ లో వేసి వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఈ పౌడర్ చల్లారిన తరువాత గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ తో టీని ఎలా తయారు చేసుకోవాలో  తెలుసుకుందాం.


దీని కోసం ఒక గిన్నెలో నీళ్లు, పటిక బెల్లం ఇంకా టీ పౌడర్ వేసి వేడి చేయాలి. ఆ తరువాత ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి.ఆ తరువాత పాలు పోసి కలపాలి. అలాగే ఈ టీ ని మరో 3 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ టీని వడకట్టి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బాగా రుచిగా ఉండే మసాలా టీ తయారవుతుంది. ఈ టీని తాగడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.ఇంకా అలాగే సీజనల్ గా వచ్చే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు.



RRR Telugu Movie Review Rating

మినీ గౌనులో బ్లాస్టింగ్ అందాలతో జబర్దస్త్ బ్యూటీ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>