PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawan1524169b-a429-49fc-b9f8-6475ddf3e342-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawan1524169b-a429-49fc-b9f8-6475ddf3e342-415x250-IndiaHerald.jpgఫైనల్ గా అధ్యక్షుడిగా ఎవరు పోటీచేసి తర్వాత స్ధానంలో నిలిచిన రన్నరప్ ఫారెన్ సెక్రటరీగా ఉంటారని చెప్పారు. ఇందుకు ఒబామా, హిల్లరీ క్లింటన్ను ఉదాహరణగా చెప్పారు. అందరు కలిసి పార్టీ అభ్యర్ధిని అధ్యక్షుడిగా గెలిపించేందుకే పనిచేస్తారని అన్నారు. అలాగే జనసేనలో కూడా టికెట్ ఎవరికి దక్కుతుందని కాకుండా పోటీచేసే అభ్యర్ధులను గెలిపించాలని చెప్పారు. పోటీచేసే అభ్యర్ధిని వెనక్కు లాగటం తనకు నచ్చదన్నారు. జనాల గెలుపే జనసేన గెలుపనే పిచ్చి కొటేషన్ ఒకటి చెప్పారు. janasena pawan{#}Godavari River;Janasena;gannavaram;TDP;YCP;Yevaru;Party;udhayanidhi stalin;Stalin;Pawan Kalyan;Hanu Raghavapudiగోదావరి : పోటీచేసేందుకు నాయకులే లేరా ?గోదావరి : పోటీచేసేందుకు నాయకులే లేరా ?janasena pawan{#}Godavari River;Janasena;gannavaram;TDP;YCP;Yevaru;Party;udhayanidhi stalin;Stalin;Pawan Kalyan;Hanu RaghavapudiMon, 26 Jun 2023 05:00:00 GMT

వారాహియాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విచిత్రమైన వ్యాఖ్యలుచేశారు. పీ గన్నవరం నియోజకవర్గంలో నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతు ఇక్కడ నిలబడే నాయకులు ఎక్కడున్నారో ఒకసారి చెప్పండని అడిగారు. టీడీపీతో పొత్తుంటే పీ గన్నవరంలో పోటీచేసే అవకాశం జనసేనకే దక్కాలని నేతలు అడిగినట్లున్నారు. అందుకనే సుదీర్ఘమైన ధర్మోపన్యాసం ఇచ్చారు. అమెరికాలో రిపబ్లికన్, డెమక్రటిక్ పార్టీల గురించి చెప్పారు. అధ్యక్ష పదవికి ఎవరు పోటీపడాలన్న విషయంలో జరిగే తంతును వివరించారు.





ఫైనల్ గా అధ్యక్షుడిగా ఎవరు పోటీచేసి తర్వాత స్ధానంలో నిలిచిన రన్నరప్ ఫారెన్ సెక్రటరీగా ఉంటారని చెప్పారు. ఇందుకు ఒబామా, హిల్లరీ క్లింటన్ను  ఉదాహరణగా చెప్పారు. అందరు కలిసి పార్టీ అభ్యర్ధిని అధ్యక్షుడిగా గెలిపించేందుకే పనిచేస్తారని అన్నారు. అలాగే జనసేనలో కూడా టికెట్ ఎవరికి దక్కుతుందని కాకుండా పోటీచేసే అభ్యర్ధులను గెలిపించాలని చెప్పారు. పోటీచేసే అభ్యర్ధిని వెనక్కు లాగటం తనకు నచ్చదన్నారు. జనాల గెలుపే జనసేన గెలుపనే పిచ్చి కొటేషన్ ఒకటి చెప్పారు.





ఇది చెబుతునే జనసేన పోటీచేయాలంటే ఇక్కడ నిలబడే నాయకులు ఎవరున్నారో చెప్పండని నిలదీశారు. చాలాకాలంగా పి గన్నవరంలో జనసేన అభ్యర్ధే పోటీచేస్తారని స్ధానిక నేతలు ప్రచారం కూడా చేసుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్ధి కొండేటి చిట్టిబాబు గెలిచారు. టీడీపీ తరపున నేలపూడి స్టాలిన్ బాబుకు 45 వేల ఓట్లొస్తే, జనసేన తరపున పోటీచేసిన పాముల రాజేశ్వరిదేవికి 36 వేల ఓట్లొచ్చాయి. అందుకనే టీడీపీతో  పొత్తుంటే కచ్చితంగా జనసేన గెలుస్తుందని నేతలు పదేపదే పవన్ పై ఒత్తిడి పెడెతున్నారు. ఒకవైపు గోదావరి జిల్లాల్లో పార్టీ చాలాబలంగా ఉందని చెబుతూనే మరోవైపు పీ గన్నవరంలో పోటీచేసేంత నేతలు ఎవరున్నారో చెప్పాలని అడటం పవన్ కే చెల్లింది.





నేతలు ఎంత ఒత్తిడిపెడితే మాత్రం ఏమి ఉపయోగం? టికెట్లు ఫైనల్ చేసే అవకాశం పవన్ చేతిలో ఉన్నట్లులేదు. అందుకనే రివర్సులో ఇక్కడ పోటీచేసేంత నాయకులు ఎక్కడున్నారంటు విచిత్రమైన ప్రశ్నవేశారు. తాను పోటీచేసినా గెలవనని తెలుసంటారు, పీ గన్నవరంలో పోటీచేసే నేతలే లేరంటారు, ఇంకో నియోజకవర్గంలో టికెట్ అడిగితే టికెట్ ఎవరికని కాదు పార్టీ గెలుపే ముఖ్యమంటారు. మొత్తానికి తనను తాను తక్కువచేసుకోవటమే కాకుండా నేతలను కూడా చాలా తక్కువచేసి మాట్లాడుతున్న పవన్ చివరకు పార్టీని ఏమి చేయదలచుకున్నారో ఏమో.






RRR Telugu Movie Review Rating

రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" మూవీ అవి తప్ప షూటింగ్ మొత్తం పూర్తి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>