MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/og50570454-829c-4eae-8d3e-8078dab3d45f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/og50570454-829c-4eae-8d3e-8078dab3d45f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ స్పీడు ఓ రేంజ్‌లో ఉంది.అప్పుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఓజీ షూటింగ్ ని యాభై శాతం పూర్తిచేసేశాడు. ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సోమవారం నాడు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.మూవీ యూనిట్ ఫొటోను నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సోమవారం నాటితో ఈ సినిమా మూడో షెడ్యూల్ కూడా పూర్తయినట్లు తెలిపింది.హైదరాబాద్‌లో సాగిన ఈ షెడ్యూల్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తప్ప ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. ఏOG{#}RRR Movie;Gabbar Singh;Athadu;April;editor mohan;priyanka;kalyan;Dussehra;Vijayadashami;monday;Pawan Kalyan;media;bollywood;Director;Hero;Cinema;NewsOG: సూపర్ స్పీడులో సుజిత్.. అప్పుడే సగం షూటింగ్ పూర్తి?OG: సూపర్ స్పీడులో సుజిత్.. అప్పుడే సగం షూటింగ్ పూర్తి?OG{#}RRR Movie;Gabbar Singh;Athadu;April;editor mohan;priyanka;kalyan;Dussehra;Vijayadashami;monday;Pawan Kalyan;media;bollywood;Director;Hero;Cinema;NewsMon, 26 Jun 2023 21:10:00 GMTటాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ స్పీడు ఓ రేంజ్‌లో ఉంది.అప్పుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఓజీ షూటింగ్ ని యాభై శాతం పూర్తిచేసేశాడు. ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సోమవారం నాడు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.మూవీ యూనిట్ ఫొటోను నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సోమవారం నాటితో ఈ సినిమా మూడో షెడ్యూల్ కూడా పూర్తయినట్లు తెలిపింది.హైదరాబాద్‌లో సాగిన ఈ షెడ్యూల్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తప్ప ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. ఏప్రిల్‌ నెలలో లాస్ట్‌వీక్‌లో ముంబయిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కేవలం రెండు నెలల గ్యాప్‌లోనే డైరెక్టర్ సుజీత్ ఏకంగా యాభై శాతం షూటింగ్‌ను కంప్లీట్ చేయడం టాలీవుడ్‌లో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.సుజీత్ స్పీడును చూసి పవన్ ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు.


అలాగే మిగిలిన టాకీ పార్ట్‌ను జూలై ఎండింగ్ లేదా ఆగస్ట్ సెకండ్ వీక్‌లోగా పూర్తిచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. ఓజీ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌ నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్స్ జరుగుతోన్నాయి.గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ రోల్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది.అలాగే బాలీవుడ్ సీనియర్ హీరో ఇమ్రాన్ హష్మీ ఓజీలో కీలక పాత్రను పోషిస్తోన్నాడు. పవన్ కళ్యాణ్ మూవీతోనే అతడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య ఓజి సినిమాని నిర్మిస్తున్నాడు.సాహో సినిమా తర్వాత సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఇది. ప్రస్తుతం ఓజీతో పాటు హరిహరవీరమల్లు, బ్రో సినిమాల్లో కూడా నటిస్తోన్నాడు పవన్ కళ్యాణ్‌. ఇంకా అలాగే గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా చేస్తున్నాడు.



RRR Telugu Movie Review Rating

అదే నిజమైతే రాంచరణ్ మూవీ కి తప్పని ఇబ్బందులు...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>