LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/kidneydb31742b-5793-4cb5-b583-e15dec74fc0c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/kidneydb31742b-5793-4cb5-b583-e15dec74fc0c-415x250-IndiaHerald.jpgమనము ఏదైనా పదార్థంలో వున్న అనవసరమైన వ్యర్థాలను క్లీన్ చేయడానికి ఫిల్టర్ ని ఎలా వాడుతామో..మన శరీరంలోని అనవసరమైన టాక్సిన్స్ అన్ని ఫిల్టర్ చేయడానికి కిడ్నీలు కూడా ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తాయి.ఒక్కరోజు కిడ్నీలు పనిచేయడం మానేసినా సరే మన శరీరంలో చెత్త అంతా పేరుకుపోయి,ఇతర శరీర భాగాలు కూడా పనిచేయకుండా ఆగిపోతాయంటే అర్థం చేసుకోవచ్చు.మన శరీరంలో కిడ్నీలు ఎంత పెద్ద పాత్ర పోషిస్తాయో.అలాంటి కిడ్నీలు శుభ్రంగా ఉండడానికి,మరియు వాటి పనితీరు మెరుగ్గా ఉండడానికి కూడా కొన్ని రకాల పండ్లు చాలా బాగా ఉపయోగపడతాయని ఆహార నిపుKIDNEY{#}Vitamin C;Calcium;Pomegranateకిడ్నీలు శుభ్రంగా ఉండటానికి ఉపయోగపడే పండ్లు ఇవే..!కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి ఉపయోగపడే పండ్లు ఇవే..!KIDNEY{#}Vitamin C;Calcium;PomegranateMon, 26 Jun 2023 19:08:22 GMTమనము ఏదైనా పదార్థంలో వున్న అనవసరమైన వ్యర్థాలను క్లీన్ చేయడానికి ఫిల్టర్ ని ఎలా వాడుతామో..మన శరీరంలోని అనవసరమైన టాక్సిన్స్ అన్ని ఫిల్టర్ చేయడానికి కిడ్నీలు కూడా ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తాయి.ఒక్కరోజు కిడ్నీలు పనిచేయడం మానేసినా సరే మన శరీరంలో చెత్త అంతా పేరుకుపోయి,ఇతర శరీర భాగాలు కూడా పనిచేయకుండా ఆగిపోతాయంటే అర్థం చేసుకోవచ్చు.మన శరీరంలో కిడ్నీలు ఎంత పెద్ద పాత్ర పోషిస్తాయో.అలాంటి కిడ్నీలు శుభ్రంగా ఉండడానికి,మరియు వాటి పనితీరు మెరుగ్గా ఉండడానికి కూడా కొన్ని రకాల పండ్లు చాలా బాగా ఉపయోగపడతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు.అలాంటి పండ్లు ఏంటో తెలుసుకుందాం పదండి..

ఆరెంజ్..
నారింజ కుటుంబానికి చెందిన పండ్లు మొత్తం మూత్రపిండాలను శుభ్రపరచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.ఇందులోని అధికంగా ఉన్న విటమిన్ సి సోడియం స్పటికాలతో ఏర్పడే కిడ్నీలో రాళ్లను సైతం ఏర్పడకుండా రక్షిస్తుంది.మరియు ఇది శరీరం అంతటా లిక్విడ్ లెవెల్స్ ని క్రమబద్ధీకరిస్తుంది.దానితో మూత్రపిండాలు ఆరోగ్యంగా మరియు బలంగా ఉంటాయి.

దానిమ్మ..
మూత్రపిండాలు డ్యామేజ్ అయ్యే ప్రమాదాన్ని తగ్గించడంలో దానిమ్మకు చాలా ప్రత్యేకత ఉంది.ఇందులో పోషకాలు ఫాస్ఫేట్,ఆక్సలేట్,సిట్రేట్ మరియు కాల్షియం సమతుల్యం చేయడానికి ఉపయోగపడతాయి.మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడి బాధపడేవారు రోజుకొక దానిమ్మ రసం తాగడం వల్ల, క్రమంగా కిడ్నీలో రాళ్లు కరిగిపోయి మూత్రం రూపంలో బయటకు వచ్చేస్తాయి.

పుచ్చకాయ..
పుచ్చకాయలు 90% వాటర్ మరియు ఫైబర్ ఉండడం వల్ల,శరీరంలోని వ్యర్థాలను తొలగించడమే కాకుండా ఈ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.ముఖ్యంగా ఇందులో ఉన్న లైకోపిన్ అనే సమ్మేళనం కిడ్నీలోని ఫాస్పేట్,ఆక్సలైట్ మరియు క్యాల్షియంను సమతుల్యం చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.

బెర్రీలు..
బెర్రీ కుటుంబానికి చెందిన స్ట్రాబెరీ,బ్లూబెర్రీ,జామున్ వంటి పండ్లను తీసుకోవడం వల్ల,మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.ఇందులోని ఫైటో కెమికల్స్ మరియు ఆంటీ ఆక్సిడెంట్లు కిడ్నీలోని టాక్సిన్స్ ని డీటాక్స్ చేయడానికి చాలా బాగా సహాయపడతాయి.దీనితో కిడ్నీ పనితీరు వేగవంతం అవుతుంది

ద్రాక్ష..
ద్రాక్షలో అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు పుష్కళంగా లభిస్తాయి.వీటిని తరుచూ తీసుకోవడంతో,మూత్రపిండాలను లోపలి నుండి శుభ్రపరుస్తాయి.మరియు ఈ పండ్లలో వున్న అధిక ఫ్లేవనాయిడ్లు రక్తాన్ని శుద్ధి చేయడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.



RRR Telugu Movie Review Rating

హ్యుండయ్, మారుతీలని వణికిస్తున్న కియా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>