Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-1cb9a8c0-7547-4aa2-a788-b8d7fc3ff915-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-1cb9a8c0-7547-4aa2-a788-b8d7fc3ff915-415x250-IndiaHerald.jpgప్రపంచ క్రికెట్లో ఎవరైనా స్టార్ బ్యాట్స్మెన్ అరుదైన రికార్డు సాధించాడు అంటే చాలు అతని పేరు మారుమోగిపోతూ ఉంటుంది. ఇక ఎవరైనా బ్యాట్స్మెన్ డబుల్ సెంచరీ సాధించి రికార్డు కొట్టాడు అంటే ఇక అతని ఆట తీరుపై అందరూ ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. అయితే ఇలా బ్యాట్స్మెన్లు సెంచరీ డబుల్ సెంచరీలు చేసి రికార్డు సృష్టిస్తే ప్రశంసలు కురిపించే క్రికెట్ ప్రేక్షకులు అదే మహిళా క్రికెటర్లు ఇలాంటి రికార్డులు సాధిస్తే మాత్రం పెద్దగా పట్టించుకోరు. ఎందుకో ప్రపంచ క్రికెట్లో పురుషుల క్రికెట్ కు ఉన్నంత క్రేజ్ మహిళా క్రికెట్కు లేCricket {#}England;Yevaru;Cricketడబుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్?డబుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్?Cricket {#}England;Yevaru;CricketSun, 25 Jun 2023 09:00:00 GMTప్రపంచ క్రికెట్లో ఎవరైనా స్టార్ బ్యాట్స్మెన్ అరుదైన రికార్డు సాధించాడు అంటే చాలు అతని పేరు మారుమోగిపోతూ ఉంటుంది. ఇక ఎవరైనా బ్యాట్స్మెన్ డబుల్ సెంచరీ సాధించి రికార్డు కొట్టాడు అంటే ఇక అతని ఆట తీరుపై అందరూ ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. అయితే ఇలా బ్యాట్స్మెన్లు సెంచరీ డబుల్ సెంచరీలు చేసి రికార్డు సృష్టిస్తే ప్రశంసలు కురిపించే క్రికెట్ ప్రేక్షకులు అదే మహిళా క్రికెటర్లు ఇలాంటి రికార్డులు సాధిస్తే మాత్రం పెద్దగా పట్టించుకోరు. ఎందుకో ప్రపంచ క్రికెట్లో పురుషుల క్రికెట్ కు ఉన్నంత క్రేజ్ మహిళా క్రికెట్కు లేకుండా పోతుంది అని చెప్పాలి.


 మహిళా క్రికెట్కు ఉన్న ఆదరణ పెంచేందుకు ఆయా క్రికెట్ బోర్డులు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నప్పటికీ ఎందుకో మహిళల క్రికెట్ ను చూసే ప్రేక్షకుల సంఖ్య మాత్రం రోజు రోజుకి తగ్గిపోతుంది తప్ప పెరగడం లేదు. దీంతో ఇక ఎంతోమంది ఉమెన్ ప్లేయర్స్ ఎంత మంచి రికార్డులు సాధించినప్పటికీ కూడా.. వారి ప్రతిభను గుర్తించే వారే లేకుండా పోయారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ ఒక అరుదైన రికార్డు సృష్టించగా.. ఎవరు కూడా పెద్దగా ఈ విషయం గురించి మాట్లాడటం లేదు. మహిళా క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డును సృష్టించింది ఇంగ్లాండ్ ఉమెన్ క్రికెటర్ టామీ బ్యూమంట్.


 ఇంగ్లాండ్ జట్టు తరుపున టెస్ట్ ఫార్మాట్లో డబుల్ సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్ గా కూడా ఒక అరుదైన రికార్డును సృష్టించింది అని చెప్పాలి. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ యాషెష్ టెస్టులో బ్యుమాంట్ 208 పరుగులు చేసింది. 1935లో ఇంగ్లాండ్ ప్లేయర్ బెట్టిస్ స్నోబాల్ 189 పరుగులు చేయగా నిన్నటి వరకు కూడా ఇక ఇదే మహిళల టెస్ట్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ గా నిలిచింది. కానీ ఇప్పుడు బ్యూమంట్ ఏకంగా 208 పరుగులు చేసి ఈ రికార్డును బద్దలు కొట్టింది అని చెప్పాలి. ఇంగ్లాండ్ తరఫున ఇప్పటివరకు అత్యధిక స్కోర్ ఇదే కావడం గమనార్హం. ఇలా డబుల్ సెంచరీ తో రికార్డు సృష్టించిన ఆమె ప్రదర్శన గురించి మాట్లాడే వారే కరువయ్యారు.



RRR Telugu Movie Review Rating

కేపీ చౌదరితో పరిచయంపై క్లారిటీ ఇచ్చిన నటి జ్యోతి..!!

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>