Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/pelli44bb01c5-53b3-41e6-9339-622dd6d4417b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/pelli44bb01c5-53b3-41e6-9339-622dd6d4417b-415x250-IndiaHerald.jpgవర్షాకాలం వచ్చేసింది. అక్కడ ఇక్కడ కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా తొలకరి చినుకు పలకరించాల్సి ఉంది. కొన్ని రాష్ట్రాలలో వర్షాలు దంచి కొడుతున్నాయి అని చెప్పాలి. కానీ మరికొన్ని రాష్ట్రాలలో మాత్రం ఎండలు దంచి కొడుతున్నాయి. వర్షపు చినుకు అనేదే కనిపించడం లేదు. దీంతో తొలకరి చినుకు కోసం రైతులందరూ ఎంతో నిరీక్షణగా ఎదురు చూస్తున్నారు. వర్షం పడాలి అంటూ వరుణ దేవుడికి పూజలు కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇలా వరుణ దేవుడికి పూజలు చేయడంలో ప్రతి రాష్ట్రంలో కూడా కొన్ని వింతైన సాంప్రదాయాలను ఆచరిస్Pelli{#}marriage;Varsham;Districtఇద్దరబ్బాయిలకు పెళ్లి చేసిన గ్రామస్తులు.. ఎందుకో తెలుసా?ఇద్దరబ్బాయిలకు పెళ్లి చేసిన గ్రామస్తులు.. ఎందుకో తెలుసా?Pelli{#}marriage;Varsham;DistrictSun, 25 Jun 2023 11:15:00 GMTవర్షాకాలం వచ్చేసింది. అక్కడ ఇక్కడ కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా తొలకరి చినుకు పలకరించాల్సి  ఉంది. కొన్ని రాష్ట్రాలలో వర్షాలు దంచి కొడుతున్నాయి అని చెప్పాలి. కానీ మరికొన్ని రాష్ట్రాలలో మాత్రం ఎండలు దంచి కొడుతున్నాయి. వర్షపు చినుకు అనేదే కనిపించడం లేదు. దీంతో తొలకరి చినుకు కోసం రైతులందరూ ఎంతో నిరీక్షణగా ఎదురు చూస్తున్నారు. వర్షం పడాలి అంటూ వరుణ దేవుడికి పూజలు కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇలా వరుణ దేవుడికి పూజలు చేయడంలో ప్రతి రాష్ట్రంలో కూడా కొన్ని వింతైన సాంప్రదాయాలను ఆచరిస్తూ ఉంటారు.


 సాధారణంగా తెలంగాణలో అయితే ఇలా వర్షాలు పడాలని కప్పలకు పెళ్లి చేయడం చూస్తూ ఉంటాం.. మరికొన్ని రాష్ట్రాలు ఇదే సాంప్రదాయం కొనసాగుతూ ఉంటుంది. అయితే కర్ణాటక రాష్ట్రంలో అయితే మరింత విచిత్రమైన ఆచారం కొనసాగుతుంది. ఏకంగా వర్షాకాలం వర్షాలు రావట్లేదని ఇక  ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన మాండ్య జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే రుతుపవనాలు వచ్చినప్పటికీ వర్షాలు మాత్రం కురవడం లేదు. దీంతో వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక చోట్ల రకరకాల ఆచారాలను పాటిస్తున్నారు.



 ఈ క్రమంలోనే మాండ్య జిల్లాలో వర్షాల కోసం పడిగాపులు కాస్తున్న ఓ గ్రామంలోని ప్రజలందరూ కలిసి ఏకంగా ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి చేశారు. ఇద్దరు అబ్బాయిలు ఒకరిని ఒకరు పెళ్లి చేసుకుంటే వర్షాలు కురుస్తాయని నమ్మిన మాండ్య జిల్లా కృష్ణరాజుపేట గంగేన హాలిడే గ్రామస్తులు.. ఇక ఈ పెళ్లి తంతును జరిపించారు. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే గత ఏడాదితో పోల్చి చూస్తే ఇప్పుడు వర్షాలు రాకకు ఆలస్యమైన నేపథ్యంలో వరుణ దేవుడిని శాంతింప చేయడానికి ఇలా ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి చేసినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇది ఇప్పటి ఆచారం కాదని పూర్వీకుల నుంచి ఇదే విధంగా వర్షం పడినప్పుడల్లా అబ్బాయిలకు వివాహం చేసే వారిని ఇప్పుడు కూడా అదే సాంప్రదాయం పాటిస్తున్నామని చెబుతున్నారు ఆ గ్రామస్తులు.



RRR Telugu Movie Review Rating

కేపీ చౌదరితో పరిచయంపై క్లారిటీ ఇచ్చిన నటి జ్యోతి..!!

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>