PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/radha-vangaveeti-ycpb65fc854-cb39-44fc-a131-f4fd171d026b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/radha-vangaveeti-ycpb65fc854-cb39-44fc-a131-f4fd171d026b-415x250-IndiaHerald.jpgవాస్తవం ఇదైతే రాధాను చంపటానికి వైసీపీ నేతలు రెక్కీ చేశారని పోతిన చెప్పటమే చాలా విచిత్రంగా ఉంది. పోతిన తాజా ఆరోపణలతో ఇపుడు వైసీపీ నేతలు ఎదురుదాడులు మొదలుపెడతారు. చివరకు విషయం అంతా ఎటెటో వెళిపోతుంది. ఆధారాలు లేకుండా కేవలం సంచలనాల కోసమే ఆరోపణలు చేయటం ఎక్కువైపోతోంది. మీడియా కూడా సంచలనాలకే ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా ఎవరేమి మాట్లాడినా వెంటనే ప్రచారం చేసేస్తున్నాయి. కేవలం ప్రచారం కోసమే చాలామంది చాలా ఆరోపణలను చేస్తున్నారు. మరిలాంటి సంచలనాలకు ఎప్పుడు ఫులుస్టాప్ పడుతుందో ఏమో.Radha Vangaveeti YCP{#}Mudragada Padmanabham;Vangaveeti;politics;Yevaru;Letter;YCP;police;media;Janasena;Pawan Kalyanఅమరావతి : రాధా హత్యకు వైసీపీ నేతలు రెక్కీ చేశారా ?అమరావతి : రాధా హత్యకు వైసీపీ నేతలు రెక్కీ చేశారా ?Radha Vangaveeti YCP{#}Mudragada Padmanabham;Vangaveeti;politics;Yevaru;Letter;YCP;police;media;Janasena;Pawan KalyanSun, 25 Jun 2023 09:00:00 GMT


కాపు రాజకీయాలు దారితెన్ను లేకుండా వెళ్ళిపోతున్నాయి. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడేస్తున్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడపద్మనాభంపై  పరోక్షంగా వారాహియాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపణలు చేయటంతో ఈ వివాదం మొదలైంది. చివరకు ఇది ఎక్కడిదాకా చేరుకుందంటే వంగవీటి రాధాకృష్ణను వైసీపీ నేతలు హత్యచేసేందుకు రెక్కీ నిర్వహించారనేంత దాకా వెళిపోయింది. రాధాను హత్యచేసేందుకు వైసీపీ నేతలు రెక్కీ నిర్వహిస్తే ముద్రగడ ఎందుకు స్పందించలేదని అడుగుతున్నారు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకటమహేష్ ఉద్యమనేతకు లేఖ రాశారు. అందులో ముద్రగడపై అనేక ఆరోపణలు చేశారు.




అందులోనే వంగవీటి రాధాపై వైసీపీ నేతలు హత్యాయత్నానికి రెక్కీ నిర్వహించినట్లు ఆరోపణలు చేశారు. పోతిన ఆరోపణలు చేసేంతవరకు రాధాపై వైసీపీ నేతలు హత్యాయత్నానికి ప్రయత్నించిన విషయం ఎవరికీ తెలీదు. చివరకు రాధా కూడా ఎప్పుడూ ఈ విషయాన్ని చెప్పలేదు. తనను చంపటానికి గుర్తుతెలీని వ్యక్తులు రెక్కీ నిర్వహించారని మాత్రమే రాధా ఒకసారి ఆరోపించారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేశారు.




అయితే రాధా ఆరోపణలకు ఆధారాలు ఏమీ దొరకలేదు. రాధా ఇల్లున్న వీధిలో దొరికిన నెలరోజుల సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు  రెక్కీ నిర్వహించినట్లుగా ఆధారాలు దొరకలేదు. దాంతో రాధా ఆరోపణలను తర్వాత ఎవరు పట్టించుకోలేదు. రాధా కూడా మళ్ళీ రెక్కీ అనే విషయాన్ని ఎప్పుడూ ప్రస్తావించలేదు.  అసలు రాధాను చంపాల్సిన అవసరం ఎవరికీ లేదు కాబట్టే ఆ విషయాన్ని అందరు వదిలేశారు.




వాస్తవం ఇదైతే రాధాను చంపటానికి వైసీపీ నేతలు రెక్కీ చేశారని పోతిన చెప్పటమే చాలా విచిత్రంగా ఉంది.  పోతిన తాజా ఆరోపణలతో ఇపుడు వైసీపీ నేతలు ఎదురుదాడులు మొదలుపెడతారు. చివరకు విషయం అంతా ఎటెటో వెళిపోతుంది. ఆధారాలు లేకుండా కేవలం సంచలనాల కోసమే ఆరోపణలు చేయటం ఎక్కువైపోతోంది. మీడియా కూడా సంచలనాలకే ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా ఎవరేమి మాట్లాడినా వెంటనే ప్రచారం చేసేస్తున్నాయి. కేవలం ప్రచారం కోసమే చాలామంది చాలా ఆరోపణలను చేస్తున్నారు. మరిలాంటి సంచలనాలకు ఎప్పుడు ఫులుస్టాప్ పడుతుందో ఏమో.







RRR Telugu Movie Review Rating

కేపీ చౌదరితో పరిచయంపై క్లారిటీ ఇచ్చిన నటి జ్యోతి..!!

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>