LifeStyleChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/tirupathie935bb95-38b6-42ef-b5e9-bc95d3bfcd5e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/tirupathie935bb95-38b6-42ef-b5e9-bc95d3bfcd5e-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా నివాస యోగ్యమైన నగరాల్లో తిరుపతి, విజయవాడలకు గుర్తింపు లభించింది. పేదలు, మధ్యతరగతి, ధనికులు, కోటీశ్వరులు అందరూ బతకగలిగిన వాటిలో తిరుపతి, విజయవాడ చోటు దక్కించుకున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, కోల్ కతా, ఢిల్లీ లాంటి మహానగరాలను తల దన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే లో విజయవాడ, తిరుపతి నగరాలు నివాసయోగ్యంగా ఉన్నాయని తేలింది. అయితే మొదటి స్థానంలో పుణే, రెండో స్థానంలో నవీ ముంబయి, మూడు, గ్రేటర్ ముంబయి, నాలుగు తిరుపతి, అయిదు చంఢీఘర్ నిలిచాయి. ఇందులో తొమ్మిదో స్థానంలో విజయవాడ నిలిచింది. TIRUPATHI{#}Vijayawada;Tirupati;Survey;Delhi;Vishakapatnam;central government;Andhra Pradesh;Hyderabadమన తిరుపతి, విజయవాడ.. దేశంలోనే సూపర్‌?మన తిరుపతి, విజయవాడ.. దేశంలోనే సూపర్‌?TIRUPATHI{#}Vijayawada;Tirupati;Survey;Delhi;Vishakapatnam;central government;Andhra Pradesh;HyderabadSun, 25 Jun 2023 13:00:00 GMTదేశవ్యాప్తంగా నివాస యోగ్యమైన నగరాల్లో తిరుపతి, విజయవాడలకు గుర్తింపు లభించింది. పేదలు, మధ్యతరగతి, ధనికులు, కోటీశ్వరులు అందరూ బతకగలిగిన వాటిలో తిరుపతి, విజయవాడ చోటు దక్కించుకున్నాయి.  హైదరాబాద్, బెంగళూరు, కోల్ కతా, ఢిల్లీ లాంటి మహానగరాలను తల దన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే లో విజయవాడ, తిరుపతి నగరాలు నివాసయోగ్యంగా ఉన్నాయని తేలింది.


అయితే మొదటి స్థానంలో పుణే, రెండో స్థానంలో నవీ ముంబయి, మూడు, గ్రేటర్ ముంబయి, నాలుగు తిరుపతి, అయిదు చంఢీఘర్ నిలిచాయి. ఇందులో తొమ్మిదో స్థానంలో విజయవాడ నిలిచింది. దేశ వ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల కంటే కూడా నివాసయోగ్య నగరాల్లో కూడా ఈ నగరాలు నిలిచాయి. అయితే హైదరాబాద్, కోల్ కతా, ఢిల్లీ నగరాల్లో లేనిది ఇక్కడ ఏముంది.. అంటే సామాన్య ప్రజలు కూడా అతి తక్కువ ఖర్చుతో జీవించే అవకాశం ఉంది.


ఆర్థిక పరంగా, సామాజిక పరంగా నివాసయోగ్యంగా ఉండటం కారణం. రెండు నగరాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండటం ఇక్కడ సానుకూల అంశం. ఒకప్పుడు అందరికీ నివాసయోగ్యంగా హైదరాబాద్, వైజాగ్ నగరాలు ఉండేవి. కానీ ప్రస్తుతం మారిన కాల మాన పరిస్థితుల్లో మెట్రో నగరాలుగా మారి హైదరాబాద్ లో సామాన్యులు జీవించడం అనేది కష్టంగా మారింది.


పెరిగిన ధరలు, అద్దెలు ఎక్కవ కావడం అనేది ఇక్కడ సమస్యగా మారింది. దాదాపు రూ. 20 వేలు సంపాదించిన రూమ్ రెంట్ కే దాదాపు రూ. 7 నుంచి 8 వేలు పెట్టాల్సి రావడం ఇబ్బంది కలిగించే అంశం. కానీ తిరుపతి, విజయవాడలో సామాన్యుడు జీవించడానికి, కోటీశ్వరుడు జీవించే లగ్జరీ లైఫ్ గడిపే అవకాశాలు ఉండటం కలిస్తోంది. దీని వల్లే కేంద్రం చేపట్టిన నివాస యోగ్య నగరాల్లో ఈ రెండు చోటు దక్కించుకున్నాయి. మరి మరింత మౌలిక సదుపాయాలు కల్పిస్తే విదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షించి అత్యంత అద్భుత నగరాలుగా మార్చవచ్చు.



RRR Telugu Movie Review Rating

కేపీ చౌదరితో పరిచయంపై క్లారిటీ ఇచ్చిన నటి జ్యోతి..!!

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>