MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adipurush51008bb4-912d-4953-b75b-42807d833ce2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adipurush51008bb4-912d-4953-b75b-42807d833ce2-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎనలేని స్టార్ డం ని సొంతం చేసుకున్నాడు. బాహుబలి సినిమాతో దేశంలో ఏ హీరో అందుకోలేని రికార్డులు క్రియేట్ చేసాడు. ఇక రేంజ్ అంచనాలతో వచ్చిన ఆదిపురుష్ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు.కానీ ఈ సినిమా అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ చాలా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి ఊహించని స్థాయిలో కలెక్షన్స్ రోజురోజుకు తగ్గిపోతూ వస్తున్నాయి.పెద్ద పాన్ ఇండియా హీరో, ఇంటర్నేషనల్ లో పేరు పొందిన పెదADIPURUSH{#}Bahubali;Hero;Director;dil raju;Andhra Pradesh;Prabhas;Hindi;Telugu;India;Cinemaఆదిపురుష్: సరిగ్గా తీసుంటే ఎన్ని కోట్ల లాభం వచ్చేదంటే?ఆదిపురుష్: సరిగ్గా తీసుంటే ఎన్ని కోట్ల లాభం వచ్చేదంటే?ADIPURUSH{#}Bahubali;Hero;Director;dil raju;Andhra Pradesh;Prabhas;Hindi;Telugu;India;CinemaSat, 24 Jun 2023 18:15:00 GMTపాన్ ఇండియా స్టార్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎనలేని స్టార్ డం ని సొంతం చేసుకున్నాడు. బాహుబలి సినిమాతో దేశంలో ఏ హీరో అందుకోలేని రికార్డులు క్రియేట్ చేసాడు. ఇక రేంజ్ అంచనాలతో వచ్చిన ఆదిపురుష్ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు.కానీ ఈ సినిమా అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ చాలా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి ఊహించని స్థాయిలో కలెక్షన్స్ రోజురోజుకు తగ్గిపోతూ వస్తున్నాయి.పెద్ద పాన్ ఇండియా హీరో, ఇంటర్నేషనల్ లో పేరు పొందిన పెద్ద ప్రొడక్షన్ కంపెనీ ఇంకా భారీ స్టార్ క్యాస్ట్ ఇన్ని బలాలు వున్నా ఆదిపురుష్ టీం ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయింది. ఇక ఏపీ తెలంగాణలో మొదటి రోజు 32 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకున్న ఈ మూవీ వసూళ్లు ఆ తర్వాత మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చాయి.  మొత్తంగా ఏడవ రోజు చూసుకుంటే ఈ సినిమాకు కేవలం చాలా దారుణంగా 97 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ఇక ఎనిమిదవ రోజు అంతకంటే తక్కువగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా దారుణంగా 65 లక్షల షేర్ మాత్రమే దక్కింది.మొత్తానికి దిల్ రాజు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయకుండా సేఫ్ అయ్యాడు.


ఇక మొత్తంగా ఎనిమిది రోజుల్లో ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎంత కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం 8 రోజుల్లో ఆదిపురుష్ సినిమాకు 75.92 కోట్ల షేర్ కలెక్షన్స్ 121 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక కర్ణాటకలో  అయితే 11.82 కోట్లు రాగా తమిళనాడులో చాలా దారుణంగా 2.34 కోట్ల షేర్ వచ్చింది.ఇక కేరళలో అయితే మరింత దారుణంగా కేవలం 84 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ఇక హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే మొత్తం 65.35 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఇక ఓవర్సీస్ లో ఇప్పటి దాకా ఈ సినిమా 23.60 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల్లో ఆదిపురుష్ సినిమా మొత్తం 179.87 కోట్ల షేర్ కలెక్షన్స్ 363 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకుంది. ఈ మూవీ ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల రేంజ్ లో అయితే బిజినెస్ చేసింది. ఇక 242 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో వచ్చిన ఆదిపురుష్ ఇప్పుడు 200 కోట్లు షేర్ కలెక్ట్ చేయడానికి నానా కష్టాలు పడుతుంది. డైరెక్టర్ ఇంకా అతని టీం కొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా తీసుంటే ఈ సినిమా అలవోకగా ఈపాటికి 1500 నుంచి 2000 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. పైగా రామాయణం లాంటి ఎపిక్ స్టోరీ కాబట్టి 2000 కోట్లకు పైగా వసూళ్లు వచ్చిన ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. ఇంత మంచి ఛాన్స్ వున్న ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఓం రౌత్.



RRR Telugu Movie Review Rating

తన కూతురికి ఆ స్టార్ హీరోయిన్ పేరు పెట్టబోతున్న రామ్ చరణ్..!?

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>