MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kabir41c439f1-e9e4-4442-9ac4-2ae7ea23e366-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kabir41c439f1-e9e4-4442-9ac4-2ae7ea23e366-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో ది మోస్ట్‌ స్టైలిష్‌ విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కబీర్‌ సింగ్‌ పెళ్లి చేసుకొని ఓ ఇంటి వాడయ్యాడు. హర్యానాకు చెందిన సీమ చాహల్‌ అనే అమ్మాయితో కలిసి కబీర్ ఏడడుగులు నడిచాడు.ఫరీదాబాద్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో వీరి పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇద్దరు కుటుంబాలతో పాటు వధూవరుల సన్నిహితులు ఇంకా స్నేహితులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. నవ దంపతులను ఆశీర్వదించారు. కబీర్‌- సీమ చాహల్‌ల పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి.పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు అభKABIR{#}Haryana;Rayalaseema;Wife;Samantha;Tollywood;marriage;Newsమ్యాథ్స్ టీచర్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్?మ్యాథ్స్ టీచర్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్?KABIR{#}Haryana;Rayalaseema;Wife;Samantha;Tollywood;marriage;NewsSat, 24 Jun 2023 19:51:54 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో ది మోస్ట్‌ స్టైలిష్‌ విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కబీర్‌ సింగ్‌ పెళ్లి చేసుకొని ఓ ఇంటి వాడయ్యాడు. హర్యానాకు చెందిన సీమ చాహల్‌ అనే అమ్మాయితో కలిసి కబీర్ ఏడడుగులు నడిచాడు.ఫరీదాబాద్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో వీరి పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇద్దరు కుటుంబాలతో పాటు వధూవరుల సన్నిహితులు ఇంకా స్నేహితులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. నవ దంపతులను ఆశీర్వదించారు. కబీర్‌- సీమ చాహల్‌ల పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి.పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక హర్యానా రాష్ట్రానికి చెందిన కబీర్‌ సింగ్‌.. గోపీచంద్‌ ‘జిల్‌’ సినిమాతో టాలీవుడ్ వెండితెరకు పరిచయమయ్యాడు. మొదటి మూవీలోనే సూపర్ స్టైలిష్‌ విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.


ఆ తర్వాత కిక్‌ 2, డిక్టేటర్‌, వేదాళం (తమిళ్‌), స్పీడున్నోడు, సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌, సుప్రీమ్‌, జక్కన్న, సాక్ష్యం, శాకినీ డాకినీ, హంట్‌, కబ్జా వంటి సినిమాల్లో విలన్ గా నటించి బాగా మెప్పించాడు.రీసెంట్ గా సమంత నటించిన శాకుంతలం సినిమాలో కూడా అసుర రాజుగా ఆకట్టుకున్నాడు.ఇక కబీర్‌ భార్య సీమా చాహల్‌ విషయానికొస్తే.. ఆమె మ్యాథ్స్‌ టీచర్‌ అని సమాచారం తెలుస్తోంది. ‘ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ భగవంతుడు, అభిమానులు నాపై ఎంతగానో ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. నా సతీమణి సీమకు కూడా మీ ఆశీర్వాదాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆమె జీవితంలో నేను ఒక బెస్ట్‌ హీరోగా ఉండాలనుకుంటున్నాను. నేను ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. ఇక ఇప్పుడదే నిజమైంది. సీమాను కలిసిన మొదటి క్షణంలోనే ఆమే నా భార్య అనిపించింది. నన్ను, నా ఫ్యామిలీని బాగా అర్థం చేసుకోగలదన్న నమ్మకం నాకు కలిగింది. ఆమెతో కలిసి నూతన జీవితాన్ని ప్రారంభిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది’ అని ఆనందాన్ని వ్యక్తం చేశాడు కబీర్‌ సింగ్‌.



RRR Telugu Movie Review Rating

గుంటూరు కారం: పూజా స్థానంలో ఆ హాట్ బ్యూటీ?

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>