PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/polavaram-jagan-chandrababu-modif4355b56-d8ce-4aeb-ae40-2d318fb719a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/polavaram-jagan-chandrababu-modif4355b56-d8ce-4aeb-ae40-2d318fb719a2-415x250-IndiaHerald.jpgఇపుడే కాదు గతంలో కూడా ఇలాగే చెప్పారు. పార్టీ గెలుపుకోసం ఎవరినైనా సరే పక్కనపెట్టేయటానికి తాను వెనకాడను అని జగన్ స్పష్టమైన మెసేజ్ పంపారు. ఎంఎల్ఏలతో కఠినంగా ఉంటే నష్టం వస్తుందని తెలిసి కూడా నిర్మోహమాటంగానే ఉంటున్నారు. మొన్నటి ఎంఎల్సీ ఎన్నికల్లో ఈ విషయం అర్ధమైంది. నలుగురు ఎంఎల్ఏలు ఓట్లేయకపోతే పార్టీ తరపున పోటీచేయబోయే ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ అభ్యర్ధుల్లో ఒకళ్ళు ఓడిపోతారని జగన్ కు తెలుసు. అయినా వాళ్ళ ఓట్లకోసం రాజీపడకుండా నలుగురిని పక్కనపెట్టేశారు. jagan ycp chandrababu tdp{#}Meera;Bonda;Vijayawada;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;Kesineni Nani;P Anil Kumar Yadav;Kothapalli;Bhuma Akhila Priya;CBN;MLA;YCP;Jagan;Party;Reddyఅమరావతి : చంద్రబాబు నుండి ఊహించగలమా ?అమరావతి : చంద్రబాబు నుండి ఊహించగలమా ?jagan ycp chandrababu tdp{#}Meera;Bonda;Vijayawada;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;Kesineni Nani;P Anil Kumar Yadav;Kothapalli;Bhuma Akhila Priya;CBN;MLA;YCP;Jagan;Party;ReddySat, 24 Jun 2023 07:00:00 GMT



చెప్పదలచుకున్నది సూటిగా, సుత్తిలేకుండా చెప్పటం, అదికూడా నిర్మొహమాటంగా చెప్పటం చంద్రబాబునాయుడు నుండి ఊహించగలమా ? తన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో చంద్రబాబు ఎప్పుడైనా ఎవరితో అయినా ఇలా చెప్పారా ? ఇదంతా ఇపుడు ఎందుకంటే గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ఎంఎల్ఏలకు ఇచ్చిన వార్నింగే కారణం. పనితీరు బాగాలేకపోతే వచ్చేఎన్నికల్లో ఎంఎల్ఏ టికెట్లు ఇచ్చేది లేదని స్పష్టంగా చెప్పేశారు.





ఇపుడే కాదు గతంలో కూడా ఇలాగే చెప్పారు. పార్టీ గెలుపుకోసం ఎవరినైనా సరే పక్కనపెట్టేయటానికి తాను వెనకాడను అని జగన్ స్పష్టమైన మెసేజ్ పంపారు. ఎంఎల్ఏలతో కఠినంగా ఉంటే నష్టం వస్తుందని తెలిసి కూడా నిర్మోహమాటంగానే ఉంటున్నారు. మొన్నటి ఎంఎల్సీ ఎన్నికల్లో ఈ విషయం అర్ధమైంది. నలుగురు ఎంఎల్ఏలు ఓట్లేయకపోతే పార్టీ తరపున పోటీచేయబోయే ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ అభ్యర్ధుల్లో ఒకళ్ళు ఓడిపోతారని జగన్ కు తెలుసు. అయినా వాళ్ళ ఓట్లకోసం రాజీపడకుండా నలుగురిని పక్కనపెట్టేశారు.





తనకు ఎంతో సన్నిహితులైన కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, కాకాణి గోవర్ధనరెడ్డి, అనీల్ కుమార్ యాదవ్ మధ్య విభేదాలు పెరిగిపోయినపుడు కూడా కఠినంగానే వ్యవహరించారు. విభేదాలను పక్కనపెట్టి పార్టీ కోసం పనిచేయకపోతే పార్టీనుండి బయటకు పంపేస్తానని వాళ్ళ మొహంమీదే చెప్పారు. తర్వాత పరిణామాల్లో కోటంరెడ్డి బయటకు వెళ్ళిపోయారు. గుంటూరులో రావి వెంకటరమణ, నరసాపురంలో కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీలైన దాటుతున్నారన్న కారణంగా పార్టీనుండే బయటకు పంపేశారు. జగన్ తీసుకున్న నిర్ణయాలు చూసిన తర్వాత ఇలాంటివి చంద్రబాబు నుండి ఊహించగలరా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.





ఎంతసేపు లేస్తే మనిషిని కానని బెదిరించటం తప్ప లేచింది లేదు తానేంటో చూపిందీ లేదు. నిజంగానే అలా చూపుంటే విజయవాడ ఎంపీ కేశినేని నాని చేతిలో అవమానం ఎదురయ్యేదా ? విజయవాడలో ఎంపీకి వ్యతిరేకంగా బోండా ఉమ, బుద్ధా వెంకన్న, నాగూల్ మీరా గొడవలు పడి తిట్టుకుంటున్నా చంద్రబాబు చోద్యం చూస్తున్నారంతే. నంద్యాలలో సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపైన దాడిచేసి మాజీమంత్రి భూమా అఖిలప్రియ మద్దతుదారులు చచ్చేట్లు కొట్టినా యాక్షన్ తీసుకోలేదు. చివరకు పుంగనూరులో తన కళ్ళెదుట రెండువర్గాల నేతలు కొట్టుకున్నా ఎవరిపైనా యాక్షన్ లేదు. ఇవన్నీ చూసిన తర్వాతే జగన్ లా చంద్రబాబును ఊహించగలమా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. 




RRR Telugu Movie Review Rating

మెగా కజిన్స్ అందరూ రాంచరణ్ ను అలా పిలుస్తారట.....!!

రాహుల్ గాంధీ: అమెరికాలో మోసం చేశారా?

పాకిస్తాన్‌ను వెంటాడుతున్న భారత్‌ భయం?

రష్యా, ఉక్రెయిన్‌ వార్‌: సీన్‌ రివర్స్‌ అవుతోందా?

అమెరికా, చైనా: చర్చలు విఫలం.. సమరమేనా?

ఏపీ: జగన్‌కు షర్మిల బిగ్‌ షాక్‌ ఇస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>