Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/virald41a1c0f-f90d-40aa-9e29-ebd325f67029-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/virald41a1c0f-f90d-40aa-9e29-ebd325f67029-415x250-IndiaHerald.jpgప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థానంలోకి ఎదగడానికి ఉపాధ్యాయులదే కీలకపాత్ర అన్న విషయం తెలిసిందే. ఉపాధ్యాయులు నేర్పిన విద్యాబుద్ధులు సంస్కారంతోనే ఇక ఉన్నత స్థానాలకు ప్రతి ఒక్కరూ వెళ్తూ ఉంటారు. అయితే ఇలా తమకు సంస్కారం నేర్పించి మంచి జీవితాన్ని ప్రసాదించిన ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులు ఎప్పుడు కృతజ్ఞతా భావంతోనే ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే స్కూల్లో చదువులు చెప్పిన టీచర్లను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఇక ఇలా పెరిగి పెద్దయి ఒక పొజిషన్ లోకి వచ్చిన తర్వాత స్కూల్లో చదువు చెప్పిన టీచర్లు ఎక్కడైViral{#}Teachers;Yevaru;students;Madhya Pradesh - Bhopal;policeవైరల్ : టీచర్ను ప్రేమగా పలకరించి.. తర్వాత తుపాకితో కాల్చిన విద్యార్థులు?వైరల్ : టీచర్ను ప్రేమగా పలకరించి.. తర్వాత తుపాకితో కాల్చిన విద్యార్థులు?Viral{#}Teachers;Yevaru;students;Madhya Pradesh - Bhopal;policeSat, 24 Jun 2023 10:00:00 GMTప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థానంలోకి ఎదగడానికి ఉపాధ్యాయులదే కీలకపాత్ర అన్న విషయం తెలిసిందే. ఉపాధ్యాయులు నేర్పిన విద్యాబుద్ధులు సంస్కారంతోనే ఇక ఉన్నత స్థానాలకు ప్రతి ఒక్కరూ వెళ్తూ ఉంటారు. అయితే ఇలా తమకు సంస్కారం నేర్పించి మంచి జీవితాన్ని ప్రసాదించిన ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులు ఎప్పుడు కృతజ్ఞతా భావంతోనే ఉంటారు అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే స్కూల్లో చదువులు చెప్పిన టీచర్లను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఇక ఇలా పెరిగి పెద్దయి ఒక పొజిషన్ లోకి వచ్చిన తర్వాత స్కూల్లో చదువు చెప్పిన టీచర్లు ఎక్కడైనా కనిపిస్తే ఎంతో వినయంగా గౌరవంగా నమస్కారం చేయడం కూడా చూస్తూ ఉంటాము. కానీ ఇటీవల కాలంలో టీచర్లపై ఇంత గౌరవాన్ని ఎవరు చూపించడం లేదు. ఇక్కడ పూర్వ విద్యార్థులు తమకు చదువు చెప్పిన టీచర్ దగ్గరికి వచ్చి బాగోగులు తెలుసుకున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం దారుణానికి పాల్పడ్డారు. ఏకంగా తుపాకీతో కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు.



 మధ్యప్రదేశ్ లోని మోరేనా జిల్లాలో ఈ ఘటన జరిగింది. గిర్వార్ సింగ్ అనే వ్యక్తి చౌర రోడ్డు ప్రాంతంలో ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అయితే మూడేళ్ల క్రిందట ఇద్దరు విద్యార్థులు 12వ తరగతి పరీక్షల కోసం అతని ట్యూషన్ సెంటర్లోనే చదివారు. అయితే కొంత ట్యూషన్ ఫీజు చెల్లించలేదు. దీంతో ఆ విద్యార్థులు కనిపించినప్పుడల్లా ట్యూషన్ ఫీజులు అడిగేవాడు గిర్వార్ సింగ్. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఇద్దరు యువకులు ట్యూషన్ టీచర్ పై దాడి చేయాలని ప్లాన్ చేశారు. ట్యూషన్ సెంటర్ వద్దకు వెళ్లి టీచర్ గిర్వార్ సింగ్ ను బయటకు పిలిచి ఎలా ఉన్నారు అటు మాటల్లో పెట్టారు. యోగక్షేమాలు తెలుసుకుంటున్నట్లు నటించి చివరికి తుపాకీతో కాల్చి అక్కడి నుంచి పారిపోయారు. కాగా స్థానికులు వెంటనే గమనించి టీచర్ను ఆసుపత్రిలో చేర్పించారు. ఘటనపై కేసు నమో చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
">



RRR Telugu Movie Review Rating

నిఖిల్ "స్పై" మూవీ ట్రైలర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>