MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjunafe7d1286-fb29-436f-afd3-48caa54fc0eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjunafe7d1286-fb29-436f-afd3-48caa54fc0eb-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలోని చాలామంది హీరోలు వరసపెట్టి స్పీడ్ స్పీడ్ గా సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. వారితో సినిమాలు తీయడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నప్పటికీ కథల కొరతతో చాలామంది హీరోలు తాము చేయవలసిన సినిమా ప్రాజెక్ట్స్ కు ఫైనల్ గా ఓకె చెప్పలేకపోతున్న పరిస్థితులలో ఉన్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వస్తున్నాయి.నాని ప్రస్తుతం చేస్తున్న సినిమా ఫైనల్ స్టేజ్ కు రావడంతో వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో చేయవలసిన సినిమాకు సంబంధించి కథ ఫైనల్ చేయలేకపోతున్నాడు అని అంటున్నారు. ఇక నాగార్జున నాగచైతన్యల పరిస్థితNAGARJUNA{#}Chiranjeevi;Naga Chaitanya;Akkineni Nagarjuna;krishna;prasanna;ram pothineni;siddhu;sukumar;vivek;Industry;Director;Darsakudu;Athadu;News;Ram Charan Teja;Cinemaఆ నలుగురి హీరోల కన్ఫ్యూజన్ !ఆ నలుగురి హీరోల కన్ఫ్యూజన్ !NAGARJUNA{#}Chiranjeevi;Naga Chaitanya;Akkineni Nagarjuna;krishna;prasanna;ram pothineni;siddhu;sukumar;vivek;Industry;Director;Darsakudu;Athadu;News;Ram Charan Teja;CinemaSat, 24 Jun 2023 08:00:00 GMTఇండస్ట్రీలోని చాలామంది హీరోలు వరసపెట్టి స్పీడ్ స్పీడ్ గా సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. వారితో సినిమాలు తీయడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నప్పటికీ కథల కొరతతో చాలామంది హీరోలు తాము చేయవలసిన సినిమా ప్రాజెక్ట్స్ కు ఫైనల్ గా ఓకె చెప్పలేకపోతున్న పరిస్థితులలో ఉన్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వస్తున్నాయి.


నాని  ప్రస్తుతం చేస్తున్న సినిమా ఫైనల్ స్టేజ్ కు రావడంతో వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో చేయవలసిన సినిమాకు సంబంధించి కథ ఫైనల్ చేయలేకపోతున్నాడు అని అంటున్నారు. ఇక నాగార్జున నాగచైతన్యల పరిస్థితి కూడ ఇలాగే ఉంది అని టాక్. బెజవాడ ప్రసన్న దర్శకత్వంలో నాగార్జున చేయవలసిన సినిమా కథ ఫైనల్ అవ్వకపోవడంతో చివరి నిముషంలో క్యాన్సిల్ అయింది అన్నప్రచారం జరుగుతోంది. నాగచైతన్య గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ దర్శకుడు చందు మొండేటి చెపుతున్న ఏకథ చైతుకు నచ్చడంలేదు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.


ఇలాంటి పరిస్థితి కళ్యాణ రామ్ కు కూడ ఎదురవుతోంది అని అంటున్నారు. అతడు ప్రస్తుతం నటిస్తున్న మూవీ ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నప్పటికీ ఈమూవీ తరువాత చేయబోయే మూవీ ఎవరి దర్శకత్వంలో చేయాలి ఏకథను అంగీకరించాలి అన్న విషయంలో ఎటూ  తేల్చుకోలేకపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే పరిస్థితి చిరంజీవికి కూడ ఎదురవుతోంది అంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘భోళాశంకర్’ రిలీజ్ కు రెడీ అవుతున్న పరిస్థితులలో ఈమూవీ తరువాత తాను యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో నటించాల లేదంటే మరో యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటించాల అన్న కన్ఫ్యూజన నుండి బయటకు రాలేకపోతున్నాడు అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి.

ఇదే సమస్య రామ్ చరణ్ కు కూడ ఏర్పడింది అంటున్నారు. ప్రస్తుతం అతడు నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ తరువాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయవలసి ఉన్నప్పటికీ ఆమూవీ కథ కూడ ఫైనల్ కాలేదు అని అంటున్నారు. వీరంతా ఇలా ఉంటే  నిఖిల్ కు రెండు సినిమాలు నితిన్ మూడు సినిమాలు శర్వానంద్ విష్వక్ సేన్ సిద్దు జొన్నలగడ్డ రెండేసి సినిమాలతో బిజీగా ఉన్నారు..  





RRR Telugu Movie Review Rating

మెగా కజిన్స్ అందరూ రాంచరణ్ ను అలా పిలుస్తారట.....!!

రాహుల్ గాంధీ: అమెరికాలో మోసం చేశారా?

పాకిస్తాన్‌ను వెంటాడుతున్న భారత్‌ భయం?

రష్యా, ఉక్రెయిన్‌ వార్‌: సీన్‌ రివర్స్‌ అవుతోందా?

అమెరికా, చైనా: చర్చలు విఫలం.. సమరమేనా?

ఏపీ: జగన్‌కు షర్మిల బిగ్‌ షాక్‌ ఇస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>