LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpgమునక్కాయలు మాత్రమే కాదు మునగాకు కూడా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. మునగాకును తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ మునగాకును కొందరు అయితే నేరుగా తినలేరు. అలాంటి వారు ఈ ఆకుల పొడిని తినాలి. దీన్ని అన్నంలో రోజూ మొదటి ముద్దలో 1 టీస్పూన్ కలిపి తింటే చాలా ప్రయోజనాలను పొందవచ్చు. మునగాకు పొడిని తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ మునగాకు పొడిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థ చాలా ఆరోగhealth{#}Drumstick;Sugar;Heart;Manamఅన్నంలో ఈ పొడి కలిపి తింటే ఎన్నో లాభాలు?అన్నంలో ఈ పొడి కలిపి తింటే ఎన్నో లాభాలు?health{#}Drumstick;Sugar;Heart;ManamSat, 24 Jun 2023 16:17:00 GMTమునక్కాయలు మాత్రమే కాదు మునగాకు కూడా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. మునగాకును తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ మునగాకును కొందరు అయితే నేరుగా తినలేరు. అలాంటి వారు ఈ ఆకుల పొడిని తినాలి. దీన్ని అన్నంలో రోజూ మొదటి ముద్దలో 1 టీస్పూన్ కలిపి తింటే చాలా ప్రయోజనాలను పొందవచ్చు. మునగాకు పొడిని తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ మునగాకు పొడిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్దకం కూడా తగ్గుతుంది. ఇలా మునగాకు పొడితో మనం చాలా ప్రయోజనాలను పొందవచ్చు.ప్రతి రోజూ దీన్ని 1 టీస్పూన్ మోతాదులో తీసుకోవాలి. క్రమంగా డోసు పెంచి రోజుకు 2 టీస్పూన్ల దాకా తీసుకోవచ్చు. కానీ కేవలం వైద్య సలహా మేరకు వాడుకోవడం ఉత్తమం. అప్పుడే చాలా మంచి ఫలితాలను రాబట్టవచ్చు.ఈ మునగాకు పొడిలో బయో యాక్టివ్ సమ్మేళనాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి మంచి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి.


అందువల్ల ఈ పొడిని ప్రతి రోజూ తింటే శరీరంలో వాపులు తగ్గుతాయి. ఇది కీళ్ల నొప్పులు ఇంకా ఆస్తమా ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. మునగాకు పొడిని భోజనంలో మొదటి ముద్దగా తింటే దాంతో షుగర్ లెవల్స్ కూడా పెరగవు. దీని వల్ల డయాబెటిస్ ఈజీగా అదుపులోకి వస్తుంది. ఇది షుగర్ ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది.ఈ మునగాకు పొడిలో మన శరీరానికి అవసరం అయ్యే చాలా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు ఎ, బి, సి, ఇ లతోపాటు కాల్షియం, పొటాషియం, ఐరన్‌ ఇంకా ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని అన్ని విధాలుగా ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాలను అస్సలు దరిచేరనివ్వవు.ఇంకా అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో వ్యాధులు అలాగే ఇన్‌ఫెక్షన్లు రావు. మునగాకు పొడిలో ఫ్లేవనాయిడ్స్‌, పాలిఫినాల్స్‌, ఆస్కార్బిక్ యాసిడ్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు చాలా సమృద్ధిగా ఉంటాయి. ఇవి హానికర ఫ్రీ ర్యాడికల్స్‌ను ఈజీగా నాశనం చేస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి కూడా తగ్గుతుంది. దాని ఫలితంగా క్యాన్సర్‌, హార్ట్ ఎటాక్‌లు రావు.



RRR Telugu Movie Review Rating

తన కూతురికి ఆ స్టార్ హీరోయిన్ పేరు పెట్టబోతున్న రామ్ చరణ్..!?

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>