PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/viveka-shamim-sharmila-6e1457cc-5bc7-4fb7-8a68-0e95a6ed913a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/viveka-shamim-sharmila-6e1457cc-5bc7-4fb7-8a68-0e95a6ed913a-415x250-IndiaHerald.jpgనిజానికి ఏ ఉద్దేశ్యంతో షర్మిల తెలంగాణాలో పార్టీని పెట్టారో ఆమెకు మాత్రమే తెలియాలి. ఎందుకంటే పార్టీ పెట్టి దాదాపు రెండేళ్ళవుతున్నా ఇంతవరకు తెలంగాణాలో ఉనికిని కూడా చాటుకోలేకపోతున్నారు. వైఎస్సార్టీ అనే పేరుతో ఒకపార్టీ ఉందని, దానికి షర్మిల అధ్యక్షురాలని రాజకీయపార్టీలు కానీ మామూలు జనాలు కానీ గుర్తించటంలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బ్రాండ్ నేమ్ తో రాజకీయాలు చేయాలని అనుకున్నా సాధ్యంకావటంలేదు. ys sharmila congress telangana {#}Rajya Sabha;Rayalaseema;Siva Kumar;Sharmila;Y. S. Rajasekhara Reddy;Congress;Andhra Pradesh;politics;Telangana Chief Minister;Party;Karnatakaహైదరాబాద్ : రాజ్యసభకు షర్మిల ?హైదరాబాద్ : రాజ్యసభకు షర్మిల ?ys sharmila congress telangana {#}Rajya Sabha;Rayalaseema;Siva Kumar;Sharmila;Y. S. Rajasekhara Reddy;Congress;Andhra Pradesh;politics;Telangana Chief Minister;Party;KarnatakaSat, 24 Jun 2023 09:00:00 GMT


వైఎస్ షర్మిల తొందరలోనే రాజ్యసభ ఎంపీగా నామినేట్ కానున్నారా ? అంటే అవుననే కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ నుండి రాజ్యసభ ఎంపీగా ఎలా ఎంపికవుతారు ? ఎలాగంటే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయటం ద్వారానట. కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీని విలీనం చేయాలని హస్తంపార్టీ అధిష్టానం బాగా ఒత్తిడి పెడుతున్నట్లు సమాచారం. షర్మిలేమో పొత్తుపెట్టుకుందామని ప్రతిపాదిస్తే కాంగ్రెస్ అధిష్టానం ఏమో ఏకంగా విలీనం చేసేయాలని గట్టిగా చెప్పిందట.





నిజానికి ఏ ఉద్దేశ్యంతో షర్మిల తెలంగాణాలో పార్టీని పెట్టారో ఆమెకు మాత్రమే తెలియాలి. ఎందుకంటే పార్టీ పెట్టి దాదాపు రెండేళ్ళవుతున్నా ఇంతవరకు తెలంగాణాలో ఉనికిని కూడా చాటుకోలేకపోతున్నారు. వైఎస్సార్టీ అనే పేరుతో ఒకపార్టీ ఉందని, దానికి షర్మిల అధ్యక్షురాలని రాజకీయపార్టీలు కానీ మామూలు జనాలు కానీ గుర్తించటంలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బ్రాండ్ నేమ్ తో రాజకీయాలు చేయాలని అనుకున్నా సాధ్యంకావటంలేదు.





ఈ నేపధ్యంలో ఎంతకాలం పాదయాత్రలు, పోరాటాలు చేసినా ఉపయోగం లేదని కాంగ్రెస్ అధిష్టానం తరపున కర్నాటక ఉపముఖ్యమంత్రి, కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పష్టంగా చెప్పారట. షర్మిల-కాంగ్రెస్ అధిష్టానం మధ్య డీకేనే రాయబారం నడుపుతున్నారు. ఎందుకంటే వైఎస్సార్ కు డీకే అత్యంత సన్నిహితుడు కాబట్టే షర్మిలకు కూడా మంచి పరిచయం ఉంది. ఆ పరిచయంతోనే డీకేని షర్మిల ఇఫ్పటికి మూడుసార్లు కలిశారు.





షర్మిల గనుక తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేస్తే వెంటనే రాజ్యసభకు నామినేట్ చేసి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పచెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధిష్టానం తరపున షర్మిలకు డీకే చెప్పారట. కర్నాటక కోటాలోనే షర్మిలను రాజ్యసభకు పంపే అవకాశముంది. అంటే ఇఫుడు జరుగుతున్న ప్రచారం నిజమైతే ఇక షర్మిలకు తెలంగాణాతో ఎలాంటి సబంధముండదనే అనుకోవాలి. షర్మిలను జనాలు రాయలసీమ వాసిగానే ముద్రవేశారని తెలంగాణా కాంగ్రెస్ నేతలంటున్నారు. మరి జరుగుతున్న ప్రచారమంతా నిజమవుతుందా ? అయినా ఎప్పటికి అవుతుంది ? కోమాలో ఉన్న ఏపీ కాంగ్రెస్ ను షర్మిల మళ్ళీ లేపగలరా ?




RRR Telugu Movie Review Rating

నిఖిల్ "స్పై" మూవీ ట్రైలర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌ న్యూస్?

ఆ దేశాల్లో.. అమెరికా ప్లేస్‌ ఆక్రమిస్తున్న చైనా?

షర్మిల ఫ్యూచర్‌.. డీకే శివకుమార్‌, కోమటిరెడ్డి చర్చలు?

పాకిస్తాన్‌తో ఆడుకుంటున్న చైనా, అమెరికా?

తేలిపోయిందా?: సింగిల్‌గానే ఎన్నికలకు పవన్‌?

వచ్చే ఎన్నికల్లో రఘురామ ఓటమి జగన్‌ స్కెచ్‌ రెడీ?

ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

ఏదేమైనా.. ఆ విషయంలో చంద్రబాబు వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>