Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ashein93c1d02c-7ed2-4bcf-b0eb-ac69d03f1bcc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ashein93c1d02c-7ed2-4bcf-b0eb-ac69d03f1bcc-415x250-IndiaHerald.jpgటీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత క్రికెట్ హిస్టరీలో రెండు వరల్డ్ కప్ లు అందించిన ఏకైక కెప్టెన్గా కొనసాగుతున్నాడు మహేంద్రడు. ఇక తన కెప్టెన్సీ తో వరల్డ్ క్రికెట్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. సాధారణంగా మ్యాచ్ జరుగుతున్నప్పుడు జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో కెప్టెన్ గా ఉన్న ఎవరైనా సరే ఒత్తిడికి లోనవ్వడం చూస్తూ ఉంటాం. కానీ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం కష్ట సమయాల్లోనే చిరునవ్వుతో ప్రత్యర్థినAshein{#}MS Dhoni;Cricket;World Cup;Chennai;INTERNATIONALధోని విన్నింగ్ సీక్రెట్ అదే.. షాకింగ్ విషయం చెప్పిన అశ్విన్?ధోని విన్నింగ్ సీక్రెట్ అదే.. షాకింగ్ విషయం చెప్పిన అశ్విన్?Ashein{#}MS Dhoni;Cricket;World Cup;Chennai;INTERNATIONALSat, 24 Jun 2023 07:50:00 GMTటీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత క్రికెట్ హిస్టరీలో రెండు వరల్డ్ కప్ లు అందించిన ఏకైక కెప్టెన్గా కొనసాగుతున్నాడు మహేంద్రడు. ఇక తన కెప్టెన్సీ తో వరల్డ్ క్రికెట్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. సాధారణంగా మ్యాచ్ జరుగుతున్నప్పుడు జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో కెప్టెన్ గా ఉన్న ఎవరైనా సరే ఒత్తిడికి లోనవ్వడం చూస్తూ ఉంటాం. కానీ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం కష్ట సమయాల్లోనే చిరునవ్వుతో ప్రత్యర్థిని భయపెడుతూ ఉంటాడు.



 ధోని వికెట్ల వెనకాల ఉంటూ చిరునవ్వు చిందించాడు అంటే చాలు.. ఆ చిరునవ్వు వెనక ఏదో పదునైన వ్యూహం ఉంది అని అత్యర్థులు వనికి పోతూ ఉంటారు అని చెప్పాలి. ఇక అంతలా తన కెప్టెన్సీ వ్యూహాలతో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు ధోని. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఇంకా ప్రేక్షకులను తన ఆట తీరుతో అలరిస్తూనే ఉన్నాడు అని చెప్పాలి. అయితే ధోని ఇండియన్ క్రికెట్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా మారడానికి గల కారణం ఏంటి అనే విషయం గురించి ఇటీవల అశ్విన్ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చాడు.


 జట్టు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ధోని దానిని ఎంతో సులభంగా సాధారణంగా మార్చేస్తాడు అంటూ అశ్విన్ వివరించాడు. ఇక ఏదైనా సిరీస్ కోసం 15 మందిని జట్టు కోసం ఎంపిక చేస్తే.. అందులో తుది జట్టులో ఆడే 11 మందిని ఇక సిరీస్ మొత్తం ఆడే విధంగా ధోని చూసుకుంటాడు. ఇక దీనివల్ల జట్టులో ఉన్న ఆటగాళ్లు అభద్రతాభావం లేకుండా స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది. ఇక ఇదే మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని విన్నింగ్ సీక్రెట్ అంటూ అశ్విన్ తెలిపాడు. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో గెలవడానికి అటు ఆస్ట్రేలియాకు అన్ని అర్హతలు ఉన్నాయి అంటూ తెలిపాడు అశ్విన్.



RRR Telugu Movie Review Rating

మెగా కజిన్స్ అందరూ రాంచరణ్ ను అలా పిలుస్తారట.....!!

రాహుల్ గాంధీ: అమెరికాలో మోసం చేశారా?

పాకిస్తాన్‌ను వెంటాడుతున్న భారత్‌ భయం?

రష్యా, ఉక్రెయిన్‌ వార్‌: సీన్‌ రివర్స్‌ అవుతోందా?

అమెరికా, చైనా: చర్చలు విఫలం.. సమరమేనా?

ఏపీ: జగన్‌కు షర్మిల బిగ్‌ షాక్‌ ఇస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>