Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhonia31f200f-5992-4dcb-8e93-a4cf9529211d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhonia31f200f-5992-4dcb-8e93-a4cf9529211d-415x250-IndiaHerald.jpgవరల్డ్ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ లలో ఒకటిగా కొనసాగుతుంది టీమిండియా. అయితే ఇలాంటి స్ట్రాంగ్ టీమ్ గా కొనసాగుతున్న టీమ్ ఇండియా ప్రదర్శన మాత్రం గత కొంతకాలం నుంచి చెప్పుకోదగ్గ విధంగా లేదు అని చెప్పాలి. ముఖ్యంగా ఐసీసీ టోర్నీలలో పేలవ ప్రదర్శన చేస్తూ తీవ్రంగా నిరాశ పరుస్తుంది. ధోని కెప్టెన్సీలో 2011 లో వచ్చిన వరల్డ్ కప్ తర్వాత టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ గెలవడం అనేది అందరిని ద్రాక్ష లాగే మారిపోయింది అని చెప్పాలి. ధోని తర్వాత కోహ్లీ ప్రయత్నించినా.. కోహ్లీ తర్వాత ఇప్పుడు రోహిత్ ప్రయత్నిస్తున్న విశ్వవిజేతగDhoni{#}MS Dhoni;VIRAT KOHLI;BCCI;World Cup;India;mediaటీమిండియా చీఫ్ సెలెక్టర్గా.. మహేంద్ర సింగ్ ధోనీ?టీమిండియా చీఫ్ సెలెక్టర్గా.. మహేంద్ర సింగ్ ధోనీ?Dhoni{#}MS Dhoni;VIRAT KOHLI;BCCI;World Cup;India;mediaFri, 23 Jun 2023 09:50:00 GMTవరల్డ్ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ లలో ఒకటిగా కొనసాగుతుంది టీమిండియా. అయితే ఇలాంటి స్ట్రాంగ్ టీమ్ గా కొనసాగుతున్న టీమ్ ఇండియా ప్రదర్శన మాత్రం గత కొంతకాలం నుంచి చెప్పుకోదగ్గ విధంగా లేదు అని చెప్పాలి. ముఖ్యంగా ఐసీసీ టోర్నీలలో పేలవ  ప్రదర్శన చేస్తూ తీవ్రంగా నిరాశ పరుస్తుంది. ధోని కెప్టెన్సీలో 2011 లో వచ్చిన వరల్డ్ కప్ తర్వాత టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ గెలవడం అనేది అందరిని ద్రాక్ష లాగే మారిపోయింది అని చెప్పాలి. ధోని తర్వాత కోహ్లీ ప్రయత్నించినా.. కోహ్లీ తర్వాత ఇప్పుడు రోహిత్ ప్రయత్నిస్తున్న విశ్వవిజేతగా మాత్రం నిలవలేక పోతుంది టీమిండియా.


 ఈ క్రమంలోనే ఇక టీమిండియా సెలక్షన్ పై కూడా విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి. టీమిండియా సెలక్షన్ విషయంలో అటు పారదర్శకత లోపించిందని.. సెలక్టర్లు తమకు నచ్చిన ప్లేయర్లకే జట్టులో ఛాన్స్ ఇస్తున్నారని ఇక మంచి ప్రదర్శన చేసి ఫామ్ కనబరిచిన కూడా కొంతమందిని పట్టించుకోవట్లేదు అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. ఇలా జట్టు ఎంపిక విషయంలో పారదర్శకత లేకపోవడం వల్ల టీమిండియా ప్రదర్శన పేలవంగ సాగుతుంది అంటూ కొంతమంది అభిమానులకు కూడా గతంలో సెలెక్టర్లపై విమర్శలు గుప్పించిన సందర్భాలు ఉన్నాయి.


 ఈ క్రమంలోనే ఇక టీమ్ ఇండియా అభిమానులు అందరూ కూడా ఇప్పుడు కొత్త డిమాండ్ ను తెరమీదకి తీసుకువచ్చారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని ఇక భారత జట్టుకు చీఫ్ సెలెక్టర్గా నియమించాలి అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఆటగాళ్ల ఎంపికలో పారదర్శకత ఉండాలి అంటే ఇక ఈ నిర్ణయం తీసుకోవాలి అంటూ బీసీసీఐ ని కోరుతున్నారు. ఇక ధోని ఐపిఎల్ కు గుడ్ బై చెప్పి టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ఎన్సీఏ చైర్మన్గా కోచ్ గా వ్యవహరిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. కాగా కొత్త ఆటగాళ్ల ప్రతిభను గుర్తించడంలో ధోని మంచి ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని కూడా అభిమానులు ప్రస్తావిస్తూ ఉండడం గమనార్హం.



RRR Telugu Movie Review Rating

అఫీషియల్ : రామ్... బోయపాటి మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!

రాహుల్ గాంధీ: అమెరికాలో మోసం చేశారా?

పాకిస్తాన్‌ను వెంటాడుతున్న భారత్‌ భయం?

రష్యా, ఉక్రెయిన్‌ వార్‌: సీన్‌ రివర్స్‌ అవుతోందా?

అమెరికా, చైనా: చర్చలు విఫలం.. సమరమేనా?

ఏపీ: జగన్‌కు షర్మిల బిగ్‌ షాక్‌ ఇస్తుందా?

యుద్ధం: ఉక్రెయిన్‌ను నాటో దేశాలు ముంచేశాయా?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>