PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-pawankalyan-varahi-jagand0a50e4e-c9d0-4a78-936f-c539b45d9966-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-pawankalyan-varahi-jagand0a50e4e-c9d0-4a78-936f-c539b45d9966-415x250-IndiaHerald.jpgఆ పిచ్చిలాజిక్ ఏమిటంటే వైసీపీ ఓట్లు 14-18 శాతం తగ్గుతాయట. సమాజంలో 30 శాతం మంది జనాలు వాస్తవాలను గ్రహించరట. ఒకవేళ వాస్తవాలను గ్రహించినా తమ నిర్ణయం మార్చుకోరట. వీళ్ళని చూసి ఓట్లేసిన వాళ్ళల్లో కూడా ఇపుడు కచ్చితంగా మార్పొస్తుందన్నారు. అందుకనే వైసీపీ ఓట్లు 14-18 శాతం తగ్గుతాయని పవన్ అన్నారు. వచ్చేఎన్నికల్లో వైసీపీ ఓట్లశాతం 39 శాతానికి పడిపోతుందట. 39 శాతం ఓట్లంటే తక్కువని పవన్ అనుకుంటున్నట్లున్నారు. జనసేనకు ఓట్లశాతం పెరిగిందంటే మిగిలిన పార్టీల్లో దేనికో ఒకదానికి తగ్గాలి కదా ? అందుకని వైసీపీకే ఓట్లు తjanasena pawankalyan varahi jagan{#}Pawan Kalyan;Janasena;TDP;YCP;Interview;Reddyగోదావరి : పవన్ ది ఇంత పిచ్చి లాజిక్కా ?గోదావరి : పవన్ ది ఇంత పిచ్చి లాజిక్కా ?janasena pawankalyan varahi jagan{#}Pawan Kalyan;Janasena;TDP;YCP;Interview;ReddyFri, 23 Jun 2023 05:00:00 GMT


స్కూల్లో పిల్లాడిని ఆవుమీద వ్యాసం రాయమంటే తిప్పి తిప్పి  ఒకే విషయాన్ని పేజీ మొత్తం రాసేశాడట. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారం కూడా సేమ్ టు సేమ్.  సమయం ఏదైనా, సందర్భం ఏదైనా జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోవటమే. ప్రభుత్వానికి సంబంధంలేకపోయినా సరే తాను మాత్రం జగన్నే ఎటాక్ చేసేస్తారు. తాజాగా ఎల్లోమీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ మొత్తం ఇలాగే ఉంది. పైగా ఒక పిచ్చిలాజిక్ వినిపించారు.





ఆ పిచ్చిలాజిక్ ఏమిటంటే వైసీపీ ఓట్లు 14-18 శాతం తగ్గుతాయట. సమాజంలో 30 శాతం మంది జనాలు వాస్తవాలను గ్రహించరట. ఒకవేళ వాస్తవాలను గ్రహించినా తమ నిర్ణయం మార్చుకోరట. వీళ్ళని చూసి ఓట్లేసిన వాళ్ళల్లో కూడా ఇపుడు కచ్చితంగా మార్పొస్తుందన్నారు. అందుకనే వైసీపీ ఓట్లు 14-18 శాతం తగ్గుతాయని పవన్ అన్నారు. వచ్చేఎన్నికల్లో వైసీపీ ఓట్లశాతం 39 శాతానికి పడిపోతుందట. 39 శాతం ఓట్లంటే తక్కువని పవన్ అనుకుంటున్నట్లున్నారు.  జనసేనకు ఓట్లశాతం పెరిగిందంటే మిగిలిన పార్టీల్లో దేనికో ఒకదానికి తగ్గాలి కదా ? అందుకని వైసీపీకే ఓట్లు తగ్గిపోతుందట.





ఇక్కడే పవన్ లాజిక్కంతా పిచ్చిగా ఉంది. ఎందుకంటే జనసేనకు ఓట్లశాతం పెరిగిందని లేదా పెరుగుతందని పవన్ ఎలా చెబుతున్నారు ? అందుకు ఆధారాలు ఏమిటి ? ఒకవేళ జనసేనకు ఓట్ల శాతం పెరిగిందనే అనుకుందాం. పెరిగిన ఓట్లశాతమంతా వైసీపీ నుండే వచ్చేస్తుందని గ్యారెంటీ ఏమిటి ? టీడీపీ నుండి కూడా వచ్చే అవకాశం ఉందికదా ? లేదా కొత్త ఓటుబ్యాంకు కూడా అయ్యుండచ్చు కదా. గతంలో నోటాకు పడిన 4 శాతం ఓట్లలో రాబోయే ఎన్నికల్లో జనసేనకు పడే అవకాశాలు కూడా ఉన్నాయి.





వైసీపీ ఓడిపోవాలని పవన్ బలంగా కోరుకుంటున్నారు. తాను ఎలా ఆలోచిస్తే అంతా అలాగే జరిగిపోతుందని పవన్ ఫైనల్ అయినట్లుంది.  ఏ విషయాన్నైనా నాలుగు కోణాల్లో చూసి వాస్తవం ఏమిటో గ్రహించకుండా తాము ఏమి అనుకుంటున్నారో ? ఏమి జరగాలని కోరుకుంటున్నారో అదే జరగాలి..జరగాలి అని అనుకుని చివరకు జరుగుతుంది..జరుగుతుంది అని ఫిక్సయిపోతారు. దాన్నే సైకాలజీలో ‘కన్ఫర్మేషన్ బయాసం’టారు. ఇలాంటి వాళ్ళకి వాస్తవాలు, లాజిక్కులతో పనుండదు. పవన్ పరిస్ధితి కూడా ఇలాగే అయిపోయినట్లుంది. 




RRR Telugu Movie Review Rating

6 రోజుల్లో "ఆది పురుష్" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>