PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-pawan-varahi-godawarie791c7f0-8dba-4102-a69f-9fcb6e2fa02d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-pawan-varahi-godawarie791c7f0-8dba-4102-a69f-9fcb6e2fa02d-415x250-IndiaHerald.jpgఅయితే తాజా ఇంటర్వ్యూల్లో పొత్తులతోనే తాను ఎన్నికలను ఎదుర్కోబోతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదంటే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని పవన్ గుర్తుచేశారు. మరి రెండుపార్టీలతో పొత్తుల్లోనే ఎన్నికలకు వెళుతున్నపుడు కేవలం జనసేనను మాత్రమే గెలిపించమని, తనను ముఖ్యమంత్రిని చేయమని పవన్ ఎలా అడుగుతున్నారో జనాలకు అర్ధంకావటంలేదు. మొదటినుండి పవన్ తో ఇదే సమస్య. తానేం మాట్లాడుతాడో తనకు అర్ధంకాదు.janasena pawan varahi godawari{#}Bharatiya Janata Party;Telangana Chief Minister;Elections;Yatra;Pawan Kalyanగోదావరి : మళ్ళీ మాటమార్చిన పవన్గోదావరి : మళ్ళీ మాటమార్చిన పవన్janasena pawan varahi godawari{#}Bharatiya Janata Party;Telangana Chief Minister;Elections;Yatra;Pawan KalyanFri, 23 Jun 2023 09:00:00 GMT


జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలను గనుక ఎవరైనా సీరియస్ గా తీసుకుంటే పిచ్చెక్కిపోవటం ఖాయం. ఎందుకంటే రోజుకో మాట మాట్లాడుతుంటారు. పూటకో ప్రకటన చేస్తుంటారు. తాను మాట్లాడిన మాటల్లో, చేసిన ప్రకటనల్లో ఏది కరెక్టని అడిగితే పవనే సమాధానం చెప్పలేరు. తాజాగా మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూల్లో తాము ముఖ్యమంత్రి అభ్యర్ధిని కానని తేల్చిచెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తులో పోటీచేయటం ఖాయమన్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రమే పొత్తులపై స్పష్టత ఇస్తారట.





వారాహి యాత్ర మొదలైన దగ్గరనుండి జనసేనను అధికారంలోకి తీసుకురావాలని, తనను ముఖ్యమంత్రిని చేయమని పవన్ పదేపదే సభల్లో మాట్లాడారు. పొరబాటున కూడా ఎక్కడా టీడీపీతో పొత్తుంటుందని, బీజేపీ తన మిత్రపక్షమని ప్రస్తావించలేదు. డైరెక్టుగా జనసేననే గెలిపించమని, తనను ముఖ్యమంత్రిని చేయమనే అడిగారు. మత్స్యకారులు, ముస్లింలు, చేనేతలతో ముఖాముఖి మాట్లాడినపుడు కూడా తనకు మద్దతిచ్చి ముఖ్యమంత్రిని చేయమనే అడిగారు. పవన్ వైఖరి చూసిన తర్వాత పొత్తుల విషయంలో ఏమైనా పునరాలోచనలో పడ్డారేమో అనుకున్నారు.





అయితే తాజా ఇంటర్వ్యూల్లో పొత్తులతోనే తాను ఎన్నికలను ఎదుర్కోబోతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదంటే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని పవన్ గుర్తుచేశారు. మరి రెండుపార్టీలతో పొత్తుల్లోనే ఎన్నికలకు వెళుతున్నపుడు కేవలం జనసేనను మాత్రమే గెలిపించమని, తనను ముఖ్యమంత్రిని చేయమని పవన్ ఎలా అడుగుతున్నారో జనాలకు అర్ధంకావటంలేదు. మొదటినుండి పవన్ తో ఇదే సమస్య. తానేం మాట్లాడుతాడో తనకు అర్ధంకాదు.





నిజానికి వారాహి యాత్రను ఇపుడు మొదలుపెట్టకుండా ఉండాల్సింది. పొత్తులు, సీట్లు ఖరారైన తర్వాత యాత్ర మొదలుపెట్టుంటే అప్పుడు పవన్ స్పీచుల్లో స్పష్టత ఉండేదేమో. కూటమికి ఓట్లేయమని అడిగితే సరిపోయుండేది. అలాకాకుండా ఇఫ్పటి యాత్రలో జనసేనను గెలిపించమని అడుగుతు పొత్తుల తర్వాత కూటమిని గెలిపించమని అడిగితే జనాలు అంగీకరిస్తారా ? ఏమిటో పవన్ వైఖరంతా అయోమయంగానే తయారైంది. స్ధిరత్వంలేని పవన్ తో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి కొత్తగా పోయేదేమీ లేదు. తనకు జరగబోయే డ్యామేజీని చంద్రబాబునాయుడే అంచనా వేసుకోవాలి.




RRR Telugu Movie Review Rating

అఫీషియల్ : రామ్... బోయపాటి మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!

రాహుల్ గాంధీ: అమెరికాలో మోసం చేశారా?

పాకిస్తాన్‌ను వెంటాడుతున్న భారత్‌ భయం?

రష్యా, ఉక్రెయిన్‌ వార్‌: సీన్‌ రివర్స్‌ అవుతోందా?

అమెరికా, చైనా: చర్చలు విఫలం.. సమరమేనా?

ఏపీ: జగన్‌కు షర్మిల బిగ్‌ షాక్‌ ఇస్తుందా?

యుద్ధం: ఉక్రెయిన్‌ను నాటో దేశాలు ముంచేశాయా?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>