HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpgమన ఇంట్లో దొరికే పదార్థాలతో ఒక సూపర్ టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ టీ ని తయారు చేసుకోవడం చాలా ఈజీ.ఈ టీ ని తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.అందుకే బరువు తగ్గాలనుకునే వారు ఈ టీ ని తాగడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.ఈ టీ ని తయారు చేసుకోవడానికి వాడే ప్రతి పదార్థం కూడా మన వంటగదిలో దొరుకుతుంది. ఇంకా అలాగే ఈ టీ ని తాగడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ అంతా కూడా చాలా ఈజీగా తొలగిపోతుంది. ఇంకా అలాగే మనం చాలా వేగంగా బరువు తగ్గవచ్చు.ఇక బరhealth{#}Gas Stove;Cinnamon;Shakti;Cholesterol;Manamఈ టీ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు?ఈ టీ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు?health{#}Gas Stove;Cinnamon;Shakti;Cholesterol;ManamFri, 23 Jun 2023 14:16:00 GMTమన ఇంట్లో దొరికే పదార్థాలతో ఒక సూపర్ టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల  చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ టీ ని తయారు చేసుకోవడం చాలా ఈజీ.ఈ టీ ని తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.అందుకే బరువు తగ్గాలనుకునే వారు ఈ టీ ని తాగడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.ఈ టీ ని తయారు చేసుకోవడానికి వాడే ప్రతి పదార్థం కూడా మన వంటగదిలో దొరుకుతుంది. ఇంకా అలాగే ఈ టీ ని తాగడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ అంతా కూడా చాలా ఈజీగా తొలగిపోతుంది. ఇంకా అలాగే మనం చాలా వేగంగా బరువు తగ్గవచ్చు.ఇక బరువును తగ్గించే ఈ టీ ని ఎలా తయారు చేసుకోవాలి? ఇంకా దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఈ టీని తయారు చేసుకోవడానికి  మనం ఒక టీ స్పూన్ దంచిన అల్లాన్ని, పావు టీ స్పూన్ మిరియాల పొడిని, అర టీ స్పూన్ పసుపును, ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని ఇంకా రెండు కప్పుల నీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో నీరు పోయాలి.ఆ తరువాత పైన చెప్పిన  పదార్థాలన్నింటిని వేసి కలపాలి.ఇప్పుడు ఈ నీటిపై మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి గోరు వెచ్చగా అయ్యే దాకా అలాగే ఉంచాలి. తరువాత ఈ టీని వడకట్టి ఒక కప్పులో పోసుకోవాలి. ఆ తరువాత ఇందులో అర చెక్క నిమ్మరసం వేసి కలపాలి. 


ఇలా తయారు చేసుకున్న టీని ప్రతి రోజూ రెండు పూటలా తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.చక్కటి ఫలితాల ఈ టీ ని తాగుతూనే రోజూ వ్యాయామం చేయాలి. అలాగే జంక్ ఫుడ్ ను, నూనెలో వేయించిన పదార్థాలను, తీపి పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. పండ్లు, తాజా కూరగాయలను ఇంకా ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఈ టీని తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుంది. ఈ టీ తయారీలో ఉపయోగించిన ప్రతి పదార్థంలో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.


ఈ టీ ని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోదక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది. శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ కూడా ఈజీగా నశిస్తాయి.అలాగే మన రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ విధంగా మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఈ టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

గుంటూరు కారం సినిమా నుండి పూజ హెగ్డే తప్పుకోవడానికి అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు..!?

రాహుల్ గాంధీ: అమెరికాలో మోసం చేశారా?

పాకిస్తాన్‌ను వెంటాడుతున్న భారత్‌ భయం?

రష్యా, ఉక్రెయిన్‌ వార్‌: సీన్‌ రివర్స్‌ అవుతోందా?

అమెరికా, చైనా: చర్చలు విఫలం.. సమరమేనా?

ఏపీ: జగన్‌కు షర్మిల బిగ్‌ షాక్‌ ఇస్తుందా?

యుద్ధం: ఉక్రెయిన్‌ను నాటో దేశాలు ముంచేశాయా?

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>