MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas3dc9bd92-1117-48f4-bd75-e4a6de59a95b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas3dc9bd92-1117-48f4-bd75-e4a6de59a95b-415x250-IndiaHerald.jpg‘ఆదిపురుష్’ రికార్డులను బ్రేక్ చేయలేకపోవడంతో ప్రభాస్ అభిమానుల ఆశలు అన్నీ ‘సలార్’ పై ఉన్నాయి. ప్రభాస్ ను తాము ఎలా చూడాలి అని అనుకుంటున్నారో ప్రశాంత్ నీల్ ఆస్థాయికి మించి చూపెడతాడు అని అభిమానులు కలలు కంటున్నారు. ‘కేజీ ఎఫ్’ మూవీతో సంచలనాలు సృష్టించిన ప్రశాంత నీల్ ఈమూవీలో కూడ అలాంటి సంచలనాలు చేస్తాడని అభిమానుల అంచనా.ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ లో విడుదలకు రెడీ అవుతున్న ఈమూవీ పై ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. ఈ మూవీలోని చాలా సన్నివేశాలు గతంలో మణిరత్నం PRABHAS{#}Mani Ratnam;Mahabharatham;vegetable market;Prasanth Neel;prashanth neel;september;Prabhas;media;Cinemaకాపీ మరకలతో సలార్ !కాపీ మరకలతో సలార్ !PRABHAS{#}Mani Ratnam;Mahabharatham;vegetable market;Prasanth Neel;prashanth neel;september;Prabhas;media;CinemaThu, 22 Jun 2023 10:00:00 GMT‘ఆదిపురుష్’ రికార్డులను బ్రేక్ చేయలేకపోవడంతో ప్రభాస్ అభిమానుల ఆశలు అన్నీ ‘సలార్’ పై ఉన్నాయి. ప్రభాస్ ను తాము ఎలా చూడాలి అని అనుకుంటున్నారో ప్రశాంత్ నీల్ ఆస్థాయికి మించి చూపెడతాడు అని అభిమానులు కలలు కంటున్నారు. ‘కేజీ ఎఫ్’ మూవీతో సంచలనాలు సృష్టించిన ప్రశాంత నీల్ ఈమూవీలో కూడ అలాంటి సంచలనాలు చేస్తాడని అభిమానుల అంచనా.


ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ లో విడుదలకు రెడీ అవుతున్న ఈమూవీ పై ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. ఈ మూవీలోని చాలా సన్నివేశాలు గతంలో మణిరత్నం తీసిన ‘దళపతి’ మూవీని పోలి ఉంటాయని స్నేహితుడి కోసం మహాభారతం లోని కర్ణుడి లా త్యాగం చేసే పాత్రలో ప్రభాస్ పాత్రను తీర్చిదిద్దినట్లు కోలివుడ్ మీడియా వార్తలు రాస్తోంది.


ఇప్పటికే ఈసినిమా కథ ప్రశాంత్ నీల్ గతంలో దర్శకత్వం వహించిన ‘ఉగ్రం’ మూవీ ఛాయాలతో ఉంటాయని ప్రచారం జరుగుతున్న పరిస్థితులలో ఇప్పుడు లేటెస్ట్ గా మణిరత్నం ‘దళపతి’ వచ్చి చేరడంతో ఈ రెండు సినిమాల ఛాయలు ‘సలార్’ లో కనిపిస్తాయా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఇప్పటికే మూడు భారీ ఫ్లాప్ లతో సతమతమైపోతున్న ప్రభాస్ కెరియర్ మరో ఫ్లాప్ ను తట్టుకునే స్థితిలోలేడు.


ప్రభాస్ కు దేశవ్యాప్తంగా ఎంతమంది అభిమానులు ఉన్నారో అంతకు మించిన స్థాయిలో యాంటీ ఫ్యాన్స్ కూడ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో అవకాశం దొరికితే చాలు ప్రభాస్ సినిమాను విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య ‘సలార్’ విషయంలో ప్రశాంత్ నీల్ ఏమైనా ప్రయోగాలు చేశాడా అన్నసందేహాలు అభిమానులను వెంటాడుతున్నాయి. ఇది ఇలా ఉంటే జూలై మొదటి వారంలో ఈసినిమాకు సంబంధించిన టీజర్ ను ఈసినిమా విడుదల అయ్యే అన్నీ భాషలలోను విడుదలచేయబోతున్నారు. ప్రభాస్ సినిమాకు మార్కెట్ పరంగా సమస్య లేనప్పటికీ ఇలా వరస ఫ్లాప్ లు కొనసాగితే మాత్రం మార్కెట్ పరంగా ఇబ్బందులు తప్పవు అన్న సంకేతాలు వస్తున్నాయి..





RRR Telugu Movie Review Rating

కాంతార 2 రిషబ్ శెట్టి ప్లాన్ అదుర్స్..!

ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

రేవంత్‌ రెడ్డి.. సైలంట్‌గా నరుక్కొస్తున్నారా?

రష్యాపై.. ఆ దేశాల కుట్ర బయటపడిపోయింది?

పవన్‌ను నమ్ముకుంటే బీజేపీ కొంప కొల్లేరే?

నిజం: చైనా ప్రపంచ లీడర్‌గా ఎదుగుతోందా?

అందం కోసం కోట్లు తగలేస్తున్నారా?

టీడీపీ, జనసేన.. పొత్తు గల్లంతేనా?

పవన్‌ను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>